Editorials

చంద్రబాబును ముంచింది వీరే! ఒక్కొక్కటి బయటపెడుతున్న పార్టీ నేతలు-TNI ప్రత్యేకం

TDP Leaders Releasing Backstabbing Secrets That Led To Its Loss In 2019 Elections

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం వెనుక కారణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. లోకేష్ కోటరీలో ప్రజలతో సంబంధం లేని వ్యక్తులు చేరి పార్టీని బ్రస్తు పట్టించారు. చంద్రబాబు వెనుక మరికొందరు చేరి క్రింది స్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలీయకుండా జాగ్రత్తలు పడ్డారు. పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టం చేయడం కోసం చంద్రబాబు ప్రత్యెక ఏర్పాట్లు చేసారు. ప్రతి బూత్ కు ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఒక కన్వినర్ ను నియమించారు. బూత్ కమిటీ కన్వినర్లు సభ్యులతో చంద్రబాబు ప్రతినిత్యం టెలి కాస్ఫరెంస్ నిర్వహించేవారు. దాదాపు 45000 బూత్ కమిటీలు ఉనాయి. వీటన్నిటిని సమన్వయము చేసే బాద్యతను పెద్ది రామారావు అనే ఒక ప్రబుద్దుడికి చంద్రబాబు అప్పగించారట. ఈయనకు నెలకు పదిలక్షల రూపాయల చొప్పున వేతనం కూడా ఇచ్చారట. లోకేష్ కోటరీలో పెద్దిరామారావు చురుకైన పాత్ర పోషించారట. లోకేష్ కు పబ్లిక్ మీటింగుల్లో ప్రసంగించేటపుడు ముందుగా ప్రసంగం పాటాన్ని ఈయనే తయారు చేసి ఇచ్చేవారట. బూత్ కమిటీలను పెద్ది రామారావు ఎలా భ్రస్టు పట్టించాడు? చంద్రబాబు, లోకేష్ లను ఎలా మోసగించాడుఅనే విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఒక అకాడమీ అద్యక్షుడు ఈ లేఖను వాట్సాప్ గ్రూపుల్లో బాహాటంగానే పోస్టులు చేసాడు. అదేమిటో చూడండి….

* పెద్ది రామారావు.. టీడీపీ ఘోర పరాజయంలో ప్రధాన సూత్రధారి.. బూత్ కన్వీనర్లు అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం లోని 45వేల పైచిలుకు పోలింగ్ బూత్ లలో అన్నింటినీ కవర్ చేస్తూ చేపట్టిన బృహత్ కార్యక్రమం.దీన్ని పెద్ది రామారావుకి అప్పగించారు అధినేత..అప్పుడు అర్ధం కాలేదు… టీడీపీకి పట్టబోతున్న అతి పెద్ద దరిద్రం ఈ క్యారెక్టర్…. అని…!!బాబుగారు ప్రతి రోజు 45వేల బూత్ కన్వీనర్లతో… అంటే, కార్యకర్తలతో దాదాపు 90 రోజుల పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు..ఈ మార్గం ద్వారా అధినేత ప్రతిరోజు శ్రేణులకు దిశానిర్దేశం చేసారు.ఎందరికి తెలుసు బాబుగారు ప్రతిరోజు పార్టీ స్థితిగతులని తెలుసుకుంటారని..?కానీ బాబు గారు ప్రతి రోజూ 45వేల మంది కార్యకర్తలతో మట్లాడారు.బాబుగారు టెలికాన్ఫరెన్స్ తో శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు…. కాదు కాదు దగ్గరయ్యాను అని బాబు గారు భ్రమించారు. కానీ నిజానికి దగ్గర కాలేదు…..!!కారణం.. ఆ దుష్ట ద్వయమే….!!ఈ కాన్ఫరెన్స్ లకి “పెద్ధి రామారావు” అనే అల్ప బుద్దిగల నేత సారధ్యం వహించారు. రాష్ట్రం మొత్తం మీద ఒక సంవత్సరం పాటు శ్రమించి 45వేల మంది బూత్ కన్వీలర్లని ఎంపిక చేశాము అని బాబుగారిని నమ్మించారు. నిజమే కాబోలు అనుకొన్నారు చంద్రబాబు మిగతా నాయకులు..ఎమెల్యేల దగ్గర నుంచి డేటా తెచ్చాము అన్నారు…మొదటగా ఒక పది వేల మందితో ఫోన్ కాల్స్ ద్వారా కాన్ఫెరెన్స్ ప్రారంభం అయ్యి… 45వేల లైన్లు లీజుకి తీసుకొని అన్ని కాల్స్ చేశామని కాన్ఫెరెన్స్ మొదట్లో చెప్పేవారు.కానీ నిజానికి అంత మందిని ఎంపిక చేయలేదనేది వాస్తవం….ఎందుకంటే…..ఏ రోజు కూడా 23 – 26 వేలకి మించి కాల్స్ కనెక్ట్ అవ్వలేదు.తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా మాట్లాడుతుంటే…. కాల్ లిఫ్ట్ చెయ్యని వారు… బూత్ కన్వీనర్ ఎలా అవుతాడో.. పెద్ది వారికే ఎరుక..పోనీ ఒక రోజు, రెండు రోజూలు కాదు… సుమారు వంద రోజుల పాటు చంద్రబాబు ఉదయం 7.30కి టంచనుగా టెలీ కాన్ఫెరెన్స్ పెట్టే వారు. ఎంత మంది వచ్చారమ్మ అని సార్ అడిగితే, 45వేల మందికి ఫోన్ చేశాము… 26వేల మంది లైన్లో వున్నారు అని చెప్పేవారు…. క్రమం తప్పకుండా ఒక వెయ్యి అటూ ఇటుగా ఈ సంఖ్యే కొనసాగింది. ఎప్పుడూ సార్ అడిగినట్లు 45వేల మంది కాదు కదా…30వేలు కూడా దాటలేదు…మరి “పెద్ది”గారు చెప్పిన ఆ 45వేల మందిలో 20వేల మంది ఘోస్ట్ లు ఎక్కడ వున్నారో… అసలు వున్నారో లేదో పెద్ది వారే తేల్చాలి..ఈ డేటా అందించిన ఆర్మీ చీఫ్ వారికే ఈ విషయం అర్ధం కావాలి…ప్రతిరోజు అధ్యక్షుల వారు వివిధ పరిస్థితుల మీద IVRS ద్వారా అభిప్రాయ సేకరణ జరిపేవారు. కానీ చిత్రంగా ఆ వచ్చిన 26 – 27 వేలమందిలో కేవలం 10 – 11 వేల మంది మాత్రమే తమ అభిప్రాయాలను తెలియజేసేవారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మొత్తం 26 వేల మందిలో 10 వేలు పోగా 16వేల ఫోన్ కాల్స్ ఎవరికి వెళుతున్నాయనేది వెయ్యి డాలర్ల ప్రశ్న..?అందరూ ఎందుకు స్పందించడం లేదనే స్పృహ ఏ నాడు ఎవరికీ కలగలేదు. వారి వివరాలు ఎవరి దగ్గరా లేవు కూడా.. ఈ కాన్ఫరెన్స్ లోనే అధ్యక్షుల వారికి పలు సందర్భాలలో తోపులు, తురుమ్ లు అంటూ కొంత మంది భజన పరులని కీర్తిస్తూ అందరికీ పరిచయం చేసేవారు. ఈ భజన సంఘం వృత్తి ధర్మం ప్రకారం బాబుగారిని మీరు ఇంద్రుడు, చంద్రుడు అంటూ తమ కీర్తనలను వినసొంపుగా ఆలపిస్తూ ఉంటే సమ్మగా ఆస్వాదించడం ఆయన వంతు అయింది. ఆర్మీ బృందంలో కలెక్షన్ కింగ్ లని, చీఫ్ సిఫారసుతో ప్రతి రోజూ కొంత మంది పేర్లు చదివి.. వారు వారి వారి గ్రామాల్లో చింపేస్తున్నారు అని ప్రజెంట్ చేసేవారు..వారిని ముందు రోజే ఆర్మీ చీఫ్ ఎంపిక చేసి, తర్ఫీదు ఇచ్చి పంపించిన వారు కావడం విచిత్రం.. ఆ కలెక్షన్ కింగ్ లు పెద్ది గారు వ్రాసి ఇచ్చిన కాగితాలని చిలక పలుకుల్లా వల్లించే వారు.ఇవి కాక, నిత్యం పేపర్లలో వచ్చే ఆర్టికల్స్ ని వీరి టాలెంట్ తో ప్రజెంటేషన్ చేయడం వలన వారిని గొప్ప మేధావులుగా కీర్తిస్తూ ఇలాంటి ప్రసంగాలని ప్రజల మధ్య వినిపించండి అంటూ అధ్యక్షులవారు సలహా ఇచ్చేవారు. ఈ భజన పరుల కీర్తనలు గడప దాటేవి కావు. అనుదినం ఆర్మీ చీఫ్ అందించిన ఫోన్ నెంబర్స్ లిస్ట్ ద్వారా 45 వేలమంది కార్యకర్తలతో అని చెప్తూ,26వేల మందితో… ఈ తంతు కొనసాగింది. సేవామిత్ర అంటూ ఒక యాప్ తయారు చేశారు. దానిలో సభ్యులు ఎవరో, సభ్యత్వానికి కావాల్సిన అర్హతలు ఏమిటో ఎవరికీ తెలియవు. ఈ యాప్ ద్వారా సభ్యులు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు, ప్రజల అభిప్రాయాలను అధినేతకు ఎప్పటికప్పుడు తెలియజేయడం వారి కర్తవ్యం. మరి అధినేతకు కార్యక్షేత్రంలో జరుగుతున్న లోపాలను ఎప్పటికప్పుడు తెలియజేసినట్లయితే ఇంతటి ఘోర పరాజయం చవిచూసేవారమా..? అసలు ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొనే సభ్యులలో వైసిపి కోవర్టుల సంఖ్య ఎంత..? నిజమైన కార్యకర్తలు ఎంతమందికి ఆ కాల్ కనెక్ట్ అవుతుంది అని వివరాలు తెలుసుకునే ప్రయత్నం జరిగిందా..? ఇలాంటి పనికిమాలిన చర్యలకు కారణమైన పెద్దిరామారావు ని కాపాడుతుంది ఎవరు..? ఆర్మీ చీఫ్ ని అంతలా ఆయన ఎందుకు ప్రమోట్ చేశాడు..?ఇది కాకుండా 500 మందితో 5 అంతస్తుల కాల్ సెంటర్…. దానికి కూడా పెద్దిగారే ఆద్యుడు… తర్వాత రూప వచ్చారు… అయినా ఈయన కార్యకలాపాలు అన్నీ 5వ అంతస్తులో నుంచే కొనసాగించారు….ఈ కాల్ నిర్వాకం నిర్వాకం ఏమిటి? అసలు ఏమి సాధించాం ఈ కాల్ సెంటర్ తో…ఈ 45వేల మందికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామంటూ…31కోట్లు ఖర్చు పెట్టారు..అసలు మనుషులే కనపడనప్పుడు ఇక స్మార్ట్ ఫోన్లు ఎవరికి ఇచ్చారు..??