ScienceAndTech

ఫ్లిప్‌బోర్డ్ గుండు పగలగొట్టిన హ్యాకర్లు

Flipboard hackers have reset 150million passwords

ప్రముఖ న్యూస్‌ అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫ్లిప్‌బోర్డ్‌ కష్టాల్లో పడింది. ఆ సంస్థపై హ్యాకర్లు దాడి చేసి దాదాపు 150 మిలియన్‌ యూజర్ల సమాచారాన్ని తస్కరించారు. దీంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వినియోగదారుల పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేసి.. కొత్త పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాల్సిందిగా ఆ సంస్థ సూచించింది. గతేడాది జూన్‌ 2 నుంచి ఈ ఏడాది మార్చి 23 వరకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 21-22ల మధ్య హ్యాకర్లు ఫ్లిప్‌బోర్డు వినియోగదారుల సమాచారాన్ని పొందారని సంస్థ భావిస్తోంది. యూజర్‌నేమ్స్‌‌, పాస్‌వర్డ్‌లు,ఈమెయిల్‌ ఐడీలలాంటి సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది. దీంతో 150 మిలియన్‌ యూజర్ల పాస్‌వర్డ్‌లను ఆ సంస్థ రీసెట్‌ చేసింది. వెంటనే కొత్త పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాల్సిందిగా సూచించింది.