Kids

ఐశ్వర్యం అంటే ఏమిటి?

What is wealth? Telugu kids moral stories

ఐశ్వర్యం అంటే….

💥ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా?_*

💥 లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!_*

💥 ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,తరాజు లోని తులాల బంగారాలు కాదు…!_*

💥ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు “ఐశ్వర్యం”!_*

💥ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య “ఐశ్వర్యం”!_*

💥ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు “ఐశ్వర్యం”!_*

💥అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు “ఐశ్వర్యం”!_*

💥 పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు “ఐశ్వర్యం”!_*

💥పౌర్ణమి నాడు జాబిల్లి “ఐశ్వర్యం”!_*

💥మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం”!

💥పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు “ఐశ్వర్యం”!_*

💥ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు “ఐశ్వర్యం”!_*

💥అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు “ఐశ్వర్యం”!_*

💥బుద్ధికలిగిన బిడ్డలు “ఐశ్వర్యం”!_*

💥బిడ్డలకొచ్చే చదువు “ఐశ్వర్యం”!_*

💥భగవంతుడిచ్చిన ఆరోగ్యం “ఐశ్వర్యం”!_*

💥చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి “ఐశ్వర్యం”!_*

💥పరులకు సాయంచేసే మనసు మన “ఐశ్వర్యం”!_*

🎈*ఐశ్వర్యం అంటే చేతులు
లేక్కేట్టే కాసులు కాదు,*

🌷కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం
🌷మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
💰💰💰💵💵💵💰