DailyDose

కళాశాల విద్యార్థినులకు గర్భస్రావాలు-నేరవార్తలు–06/01

June 01 2019 - Daily Crime News - Couple performing illegal abortions on college girls arrested in Tamilnadu India

* కర్నూలు జిల్లా డోన్‌ సమీపంలో జాతీయ రహదారిపై కంబాలపాడు సర్కిల్లో రెండు లారీలను తెలంగాణ ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు ఢీకొట్టింది.
* తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం పాతకోట-ఈతకోట రహదారిలో ఓ కారు ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది.
* కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అనుచరుడి హత్య కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జామో పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిపి నిందితుడు వాసిమ్‌ను పట్టుకున్నారు.
* సీఏ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి.. అపార్టుమెంట్‌ 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
* కుటుంబానికి చేదోడుగా ఉండాలనుకుని..పొట్టచేత పట్టుకొని ఉపాధిని వెతుక్కొంటూ వచ్చిన ఓ గిరిజన యువతి కామాంధుడి అకృత్యానికి బలయిపోయింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం జంగుళూరు పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* పాతకక్షల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై పట్టపగలే ఒక యువకుడిని కొబ్బరి బోండాలు నరికే కత్తితో అతి కిరాతకంగా హత్య చేశారు.
* న్యాయస్థానం కార్యకలాపాలను చిత్రీకరించినందుకు కోర్టు ఓ పాస్టర్‌కు 14 రోజుల జైలు శిక్షతోపాటు రూ.250 జరిమానా విధించింది.
* విద్యుత్‌శాఖ సిబ్బందిలో కొంతమంది నిర్లక్ష్యం ఫలితంగా..శుక్రవారం నారాయణపేట జిల్లా నర్వకు చెందిన కార్మికుడు రాములు(39) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 13.05 క్వింటాళ్ల అనుమతి లేని నకిలీ విత్తనాలను పట్టుకున్నారు.
* జమ్ము-కశ్మీర్‌లోని శోపియాన్‌ జిల్లా ద్రాగద్‌ సుగాన్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మరణించారు.
* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
* అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో శుక్రవారం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపా వర్గీయుడు రాజప్ప(35) మృతిచెందారు.
* రెండు రైలు ఇంజిన్లు ఢీకొన్న ఘటన విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గురువారం చోటు చేసుకుంది. కర్మాగారంలోని బ్లాస్ట్‌ఫర్నెస్‌-2 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ద్రవ ఉక్కుతో ఎస్‌ఎంఎస్‌కు వెళ్లే రైల్వే ఇంజిను, ఎస్‌ఎంఎస్‌ నుంచి ఖాళీ టీఎల్‌సీతో బ్లాస్ట్‌ఫర్నెస్‌కు వస్తున్న ఇంజిను ఓ చోట క్రాసింగ్‌ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణంతో రెండూ ఒకే ట్రాక్‌ మీదకు రావడంతో ఢీకొన్నాయి. పట్టాలు తప్పిన ఖాళీ ఇంజిను ఓ పక్కకు ఒరిగిపోగా, లోడుతో ఉన్న ఇంజినును డ్రైవర్‌ వెంటనే నిలిపివేయడంతో భారీ నష్టం తప్పింది. ఈ ఘటనలో ట్రాక్‌ మాత్రం స్వల్పంగా దెబ్బతింది. వెంటనే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.
*ఈత సరదా రెండు కుటుంబాల్లోని ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం దుబార్లపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
*అవివాహిత యువతులు, కళాశాల విద్యార్థినులు, మహిళలకు విరివిగా గర్భస్రావాలు చేస్తున్న నకిలీ వైద్య దంపతులను తమిళనాడులోని తిరువణ్ణామలై పోలీసులు అరెస్టు చేశారు.
* వికారాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. పూడూరు మండలం కంకల్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న బీరు కంపెనీ వద్ద ఓ షెడ్డు కుప్పకూలింది.
*సరకు రవాణా చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి నకిలీ ఇన్‌వాయిస్‌లతో అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ) తీసుకున్న మరో అక్రమ వ్యవహారాన్ని మేడ్చల్‌ జీఎస్టీ అధికారులు గుట్టు రట్టు చేశారు.
*కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తికి చెందిన ఇంటర్‌ విద్యార్థి మట్ట కార్తీక్‌ (18) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌రాజ్‌ తెలిపారు.
*తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడ్డ దొంగను భద్రాచలం పోలీసులు పట్టుకొన్నారు. గురువారం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీకి చెందిన శివకిశోర్‌ అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు.
* కొద్ది రోజుల క్రితం యూపీలోని అమేఠీలో భాజపా కార్యకర్త హత్యోదంతం మరవక ముందే పశ్చిమ బంగాల్‌లో అలాంటిదే మరో ఘటన జరిగింది. రాష్ట్రంలోని బుర్ద్వాన్‌ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త కత్తిపోట్లకు గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు.
*అసోంలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులను ఏన్నో ఏళ్లుగా భరిస్తున్న ఓ మహిళ సహనం కోల్పోయింది. ఎంత సర్దిచెప్పినా లాభం లేకపోవడంతో అతన్ని చంపడమే తనకు విముక్తి అని భావించింది. ఏకంగా భర్త తల నరికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
*ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫతేనగర్‌కు చెందిన హర్షిత తాను ప్రేమించిన యువకుడ్ని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
*ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లను వేదికగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు హైదరాబాదీలపై పంజా విసురుతున్నారు. ముఖ్యంగా వాహనాలను ఊహించనంత తక్కువ ధరకే విక్రయిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు.
* తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడ్డ దొంగను భద్రాచలం పోలీసులు పట్టుకొన్నారు. గురువారం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీకి చెందిన శివకిశోర్‌ అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు.
*ఉదయగిరి-కావలి ప్రధాన రహదారి, కలిగిరి మండల పరిధిలోని అయ్యపరెడ్డిపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కావలికి చెందిన అయీషా పర్వీన్‌(21) అనే వివాహిత మృతిచెందింది.
*బాలాపూర్‌ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సు బీభ త్సం సృష్టించింది. అతివేగంతో ఉన్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి..విద్యుత్‌ హైమాక్స్‌ స్తంభాలను ఢీకొట్టింది. ఒక్కసారిగా స్థానికులు, ప్రయాణికులు పరుగుతీశారు. అసలే అది ఎలక్ట్రికల్‌ బస్సు..ఎక్కడ విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అవుతుందోనని భయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.