ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య ప్రజలైనా, అధికారులైనా, ప్రముఖులైనా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. ఇటీవల అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య రెండో సమావేశం అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌తో భేటీ విఫలమైనందుకు కారణమని భావిస్తూ ఐదుగురు ఉన్నతాధికారులను ఉత్తరకొరియా ప్రభుత్వం కాల్చి చంపిందట. ఈ మేరకు దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ది చూసన్ ఇల్బో తాజాగా పేర్కొంది. ఫిబ్రవరి 27-28న వియత్నాం రాజధాని హనోయి వేదికగా ట్రంప్, కిమ్ రెండోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భేటీని అర్ధంతరంగా ముగించారు. కాగా.. ఈ సమావేశానికి గ్రౌండ్ వర్క్ చేసిన అమెరికాకు ఉత్తరకొరియా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యోక్ చోల్‌ను ఈ ఏడాది మార్చిలో మిరిమ్ ఎయిర్‌పోర్టులో ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపినట్లు ది చూసన్ ఇల్బో పత్రిక పేర్కొంది. ఆయనతో పాటు విదేశాంగ శాఖకు చెందిన నలుగురు సీనియర్ అధికారుల ప్రాణాలు తీసేసినట్లు తెలిపింది. దేశాధినేతను మోసం చేసిన ఆరోపణలతో వీరిని చంపినట్లు సమాచారం. అంతేగాక.. ట్రంప్‌తో భేటీలో పొరబాట్లు చేసినందుకు గానూ కిమ్ జోంగ్ ఉన్ అనువాదకురాలు(ఇంటర్ప్రిటర్) షిన్ హే యాంగ్‌ను జైలుకు పంపించినట్లు సదరు పత్రిక తెలిపింది. భేటీలో కిమ్ కొత్త ప్రతిపాదనలు అనువదించలేకపోయినందుకు గానూ ఆమెకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. అయితే దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సాధారణంగా ఉత్తరకొరియాలో జరిగే సంఘటనలు బయటి ప్రపంచానికి అరుదుగా తెలుస్తుంటాయి. అవి కూడా దక్షిణ కొరియా మీడియా నుంచే బయటకు వస్తాయి. హనోయిలో జరిగిన భేటీలో తమ దేశంపై విధించిన ఆంక్షలను పూర్తిగా తొలగించాలని కిమ్ డిమాండ్ చేశారు. ఇందుకు వ్యతిరేకించిన ట్రంప్ సమావేశం గది నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చారు. హనోయి కంటే ముందు సింగపూర్ వేదికగా ట్రంప్, కిమ్ తొలిసారిగా భేటీ అయ్యారు.
వీడొక న్యాస్టీ నేల టికెట్ ఫెలో

Related tags :