Health

ఎముకల పటుత్వానికి…

Ragi malt for better bone health

ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచేవి రాగులు. మన పూర్వీకులు ఆహారంగా వీటినే ఎక్కువగా వాడేవారు. కొందరు నేటికీ రాగి జావను తాగుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలాంటి ప్రాంతాల్లో వీటి వాడకం ఎక్కువ. రాగులు అంతగా ఆరోగ్యానికి ఉపయోగపడడానికి వాటిలో ఏముంది? రాగుల ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాగులలో ఉండే క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. రాగులతో తయారుచేసే ఆహార పదార్థాలలో పోషకాలు ఉంటాయి. అలాగే ఇందులో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రాగులతో చేసిన జావ దప్పికను అరికట్టడమే కాకుండా కడుపు మంటను తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారుచేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. మహిళలు రాగి మాల్ట్‌ను తాగితే మంచిది. ఇవి ఎముకలకు మంచి పటుత్వానికి సహకరిస్తాయి. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకోవడం వల్ల రక్తపోటును అరికట్టవచ్చు. ఇవి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి.