Sports

తన రికార్డు తానే బద్ధలు కొట్టుకున్న బంగ్లా

Bangladesh cricket team breaks its own record in ICC CWC 2019

వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమ వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని తాజాగా నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. బంగ్లా ఆటగాళ్లు షకీబుల్‌ హసన్‌- ముష్పికర్‌ రహీమ్‌లు ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇది ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నమోదైంది. అంతకుముందు 141 పరుగుల భాగస్వామ్యం బంగ్లాకు వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం కాగా, దాన్ని తాజాగా సవరించింది. గత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం ఆ దేశం తరఫున ఇప్పటివరకూ అత్యధికంగా ఉంది. 2015లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా, ముష్ఫీకర్‌ రహీమ్‌లు ఆ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, గత, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ నెలకొల్పిన రెండు అత్యధిక పరుగుల భాగస్వామ్యాల్లో రహీమ్‌ ఉండటం ఇక్కడ మరో విశేషం.