NRI-NRT

బే ఏరియాలో తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకలు

Bay Area Telangana NRIs celebrate Telangana Formation Day-TNILIVE Bay Area California North America Telugu News

*** సీఎం కేసీఆర్ ఉద్యమ సందర్భం.. ఆచార్య జయశంకర్ , విద్యాసాగర్ రావు గారి సేవలను కొనియడిన టి ఆర్ ఎస్ ఎన్నారై సెల్…
– నాటి ఉద్యమం లో..నేటి అభివృద్ధి లో ఎన్నారై లది కీలక పాత్ర ..
– ఫోన్ లో సందేశాన్ని తెలిపిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

అమెరికా బే ఏరియా లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టి ఆర్ ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి.. దీక్షా ఫలితంగా స్వరాష్ర్టాన్ని సాదించి..బంగారు తెలంగాణ దిశగా ప్రజా పరిపాలన సాగిస్తున్నారు అని అన్నారు..పేద ప్రజలు కన్నా తెలంగాణ నేర వేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా తొలిదశ ఉద్యమ యోధుడు.. ఆచార్య జయశంకర్ గారి సేవలను.. అదేవిధంగా నీటి పారుదల రంగం లో చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ గారు అందించిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు..

ఆవిర్భావ వేడుకలు.. అదేవిధంగా హరిశ్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నారై ప్రతినిధులు హరిశ్ రావు గారికి వేడుకలు జరిగే సమయం సందేశం ఇవ్వాలని ఫోన్ ద్వారా కోరారు.. ఈ సందర్భంగా హరిశ్ రావు గారు మాట్లాడుతూ..
నాటి తెలంగాణ ఉద్యమం లో..నేటి అభివృద్ధి లో టి ఆర్ ఎస్ పార్టీ లో ఎన్నారైలది కీలక పాత్ర అని.. అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించి.మన ఖ్యాతిని చాటి చెపిన ఎన్నారై ప్రతినిధులకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు… సిద్ధిపేట లో కూడా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెడుకల్లో పాల్గొన్నారు అని వారితో చెప్పారు.. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై లందరికి ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ సందర్భంగా కుటుంబ సబ్యులతో కల్సి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బైరీ పూర్ణ , జొన్నలు ఉదయ్ , శివ ,రాము , జగన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..