NRI-NRT

మలేషియాలో “జై తెలంగాణా” జోరు

MYTA Celebrates Telangana Formation Day In Malaysia-TNILIVE Latest Malaysia Telangana Telugu News-మలేషియాలో

ఐదు వసంతాలు పూర్తిచేసుకొని ఆరో వసంతములోకి అడుగుపెడుతున్న సందర్భాన తెలంగాణ రాష్ట్ర ఆరవ అవతరణ దినొత్సవ వేడుకలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్, బ్రిక్ ఫీల్డ్స్,కోలాలంపూర్,మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA ) ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మొట్ట మొదట తెలంగాణ రాష్ట్ర గీతం తో మొదలయింది, అనంతరం తెలంగాణ అమర వీరులకు సభాముఖముగా నివాళులర్పించారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమములు మరియు చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భముగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ సుభ్యులందరికి ఫామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు దీనిలో భాగముగా MYTA ‘s బ్యాడ్మింటన్ స్మాష్ టోర్నమెంట్ ను మరియు పిల్లలకు పెద్దలకు పలు ఆటలను ఆడించి బహుమతులను ముఖ్య అతిధులుగా హాజరయిన తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు గారు తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టి బాబు గారు మరియు ముఖ్య కార్య వర్గ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు.

MYTA ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాని విజయవంతం చేసిన సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు అదే విధముగా ఈ కార్యక్రమమానికి స్పాన్సర్ గా ముందుకు వచ్చిన శ్రీ బిర్యానీ.com, ఇన్స్టారెమ్ వారికీ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ అయ్యన్నార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, యూత్ ప్రెసిడెంట్ కార్తీక్ , ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్,మారుతీ, చందు, సందీప్ , కిరణ్, ప్రతీక్ , రవితేజ , సందీప్ నరేందర్ ,సంతోష్, స్వప్న , అశ్విత , సాహితి సాయిచరని ,అనూష తదితరులు పాల్గొన్నారు