* యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెజినీస్ ఎక్స్‌ప్లోజీవ్ కంపెనీలో డిటోనేటర్ పేలింది. ఈ ఘటనలో గది పూర్తిగా ధ్వంసమై రూంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన కార్మికుడి శరీరం తునాతునకలైంది.
*ఆగ్నేయ దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టుచేశారు. మోటారుసైకిల్ మీద వెళ్తున్న యువకులను పోలీసులు లాలా లాజ్‌పత్‌రాయ్ మార్గ్ వద్ద ఆపగా, ఓ యువకుడు తప్పుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపాడు.
*కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో వడదెబ్బకు గురై యువరైతు మృతి చెందారు. గ్రామానికి చెందిన స్వాములు (28) ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా ట్రాక్టరు ద్వారా పొలానికి ఎరువు తరలించారు.
* ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)కి చెందిన ఓ జవాన్ మృతి చెందారు.
*సీలేరు నదిలో పడవ మునిగి ఓ చిన్నారి మృతిచెందగా, ఇద్దరు గిరిజన మహిళలు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం మంగంపాడు సమీపంలోని పాలగెడ్డ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*పిడుగు పాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నారాయణపురం తాలూక బొరిగి పంచాయతీలో కిమిడి భద్ర గ్రామానికి చెందిన కొంత మంది గిరిజనులు కొండపైకి పోడు వ్యవసాయానికి వెళ్లారు.
*విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన సముద్రపు జలగలను తమిళనాడు తీర ప్రాంత ప్రత్యేక నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు.
*ఆడుకోవడానికి వాగు వద్దకెళ్లిన చిన్నారులు అందులో పడి మృతి చెందారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లకి చెందిన ఆరుద్ర వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల కుమారుడు జస్వంత్(6), ఇదే గ్రామానికి చెందిన మల్లా రామాంజనేయులు, కామాక్షి దంపతుల కుమారుడు లక్ష్మీమణికంఠ(7) ఇద్దరూ కలిసి నక్కవాగు వద్దకెళ్లారు.
*దివ్యాంగురాలైన మతిస్థితిమితం లేని అనాథ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా దాడి చేయడంతో ఆమె మృతి చెందిన సంఘటన ఇది. ఈ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
*రైల్వే ఆసుపత్రులకు ఔషధాలు సరఫరా చేసినట్లు తప్పుడు రసీదులు సృష్టించి రూ.2.20 కోట్లు కొల్లగొట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. దక్షిణమధ్య రైల్వే విజిలెన్స్ విభాగం ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో కేసు నమోదైంది.
*ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తానంటూ నకిలీ వెబ్‌సైట్ నడుపుతున్న రాకేశ్ జాంగిడ్(23) అనే ఐఐటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
*పొలం పనులకు వెళ్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.
*ఓ ఇంటి ఆవరణలో తల్లితోసహా నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని పులి నోటకరచుకెళ్లింది. చంపి ఊరిబయట పడేసింది. ఈ దారుణ ఘటన ఆదివారం వేకువజామున 3 గంటలకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందెవాహి తాలూకా గడబోరి గ్రామంలో చోటుచేసుకుంది.
*కూలీల మీదకు ట్రాక్టర్‌ను నడిపిన అర్థం లేని ఆవేశం ఒకవైపు.. అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేదనతో ప్రాణాలకు తెగించిన సోదరుల మొండితనం మరోవైపు.. వివాదం చిన్నదే అయినా.. అది రగిల్చిన ఆవేశకావేశాలు రెండు నిండు ప్రాణాలను తీశాయి. కూలి డబ్బుల వివాదం చిత్తూరు జిల్లాలో రెండు ప్రాణాలను బలిగొంది. మదనపల్లె గ్రామీణ మండలంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదం నింపింది.
*ప్రపంచ ప్రసిద్ధ జానపద కళాకారుడు ‘క్వీన్ హరీశ్’ ఆదివారం ఉదయం జోథ్‌పుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈయనతో పాటు మరో ముగ్గురూ మృతి చెందారు.
*హైదరాబాద్ శివార్లలోని క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. తాజాగా మరో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. గాజుల రామారం ప్రాంతంలో ఓ పేదింటి శుభకార్యానికి అతిథులుగా వచ్చిన తల్లి, కుమారుడు, వృద్ధురాలు ఒకేసారి మృత్యువాత పడ్డారు.
* ఐపీఎస్ అధికారిగా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్న 20 ఏళ్ల యువకుడిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
*టిక్‌టాక్‌లో వీడియో పోస్ట్ చేసినందుకు ఓ భర్త తన భార్యను దారుణంగా హతమార్చాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజ్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య నందిని ఓ కళాశాలలో పనిచేస్తోంది. కుటుంబ తగాదాల కారణంగా వీరిద్దరూ రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు.
*యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన విద్యార్థినుల వరుస హత్యలకు సంబంధించి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
* గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
*ఓ ఇంటి ఆవరణలో తల్లితోసహా నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని పులి నోటకరచుకెళ్లింది. చంపి ఊరిబయట పడేసింది. ఈ దారుణ ఘటన ఆదివారం వేకువజామున 3 గంటలకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందెవాహి తాలూకా గడబోరి గ్రామంలో చోటుచేసుకుంది.
*విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం ఒడిశా సరిహద్దులోని బలపం పంచాయతీ చెరువూరు గ్రామంలో ఓ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
కూలీడబ్బుల కోసం ఇద్దరి హత్య-నేరవార్తలు–06/03

Related tags :