DailyDose

బీఎస్పీ సమూల ప్రక్షాళన-రాజకీయ-06/03

June 03 2019 - Daily Political News In Telugu - BSP To Be Rejuvenated Entirely

*ఏడాది చివరిలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు – నవంబర్‌ 15, డిసెంబర్‌ 7 మధ్య నిర్వహిస్తాం: ఈసీ
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధ్యక్షుడు మహీంద్ర దేశప్రియ చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఐదేళ్ల పదవీకాలం 2020 జనవరి 5కి ముగుస్తుంది. నిబంధనల ప్రకారం దీనికి నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందువల్ల నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 7 మధ్య అనువైన రోజున అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని దేశప్రియ వెల్లడించారు. గత ఎన్నిల్లో ప్రధాన ప్రతిపక్షమైన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ.. మైత్రిపాల సిరిసేనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అప్పటి అధ్యక్షుడు మహింద్ర రాజపక్సెపై పోటీకి నిలిపింది. 2015 జనవరి 8న ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
*తెలంగాణకు ఏపీ భవనాలు
హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి మండలి వినతి మేరకు ఆదివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి దీనికి అంగీకరించారని తెలిసింది. దీంతో తెలంగాణ ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న భవనాల సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని భవనాలను కేటాయించాలని నిర్ణయించారు.
*తెలంగాణకు ఏపీ భవనాలు
హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి మండలి వినతి మేరకు ఆదివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి దీనికి అంగీకరించారని తెలిసింది. దీంతో తెలంగాణ ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న భవనాల సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది.
*రుణమాఫీ ఏక కాలంలో అమలు చేయాలి
రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో తెరాస చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలైనా నిరుద్యోగ భృతిపై విధివిధానాలు రూపొందించకపోవడమే దానికి నిదర్శనమని ఆరోపించారు. 12 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వద్ద నమోదు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
*భూప్రక్షాళన పేరిట దోపిడీ: చాడ
నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. కానీ గడిచిన అయిదేళ్లలో నీళ్లు రాలేదు.. నియామకాలు జరగలేదని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గన్‌పార్కులోని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించిన ఆయన మాట్లాడారు. నిజాం కాలం నాటి రెవెన్యూ రికార్డులు నేటికీ కొనసాగుతున్నాయని, ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
*7న వైకాపా శాసనసభాపక్ష భేటీ
వైకాపా శాసనసభాపక్షం ఈ నెల 7న సమావేశం కానుంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 8న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో.. మంత్రిమండలిలోకి ఎవరిని, ఎందుకు తీసుకుంటున్నామన్న వివరాలను జగన్‌.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త మంత్రుల జాబితానూ ప్రకటించవచ్చని అంటున్నారు.
*బీఎస్పీ సమూల ప్రక్షాళన
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి.. తమ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జులను తొలగించడంతో పాటు దిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల అధ్యక్షులను మార్చారు. బీఎస్పీ దిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రసింగ్‌ స్థానంలో లక్ష్మణ్‌సింగ్‌ను నియమించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీపీ చౌధరి స్థానంలోకి రమాకాంత్‌ పుత్తల్‌ను పంపారు.