DailyDose

మడిచిపెట్టుకుని హైకోర్టుకే వెళ్లండి

మడిచిపెట్టుకుని హైకోర్టుకే వెళ్లండి - Supreme court denies ravi prakash petition. Pushes him to go seek from AP high court.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ పిటిషన్‌పై మెరిట్‌ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీచేసింది. రవిప్రకాశ్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించగా.. సర్వోన్నత న్యాయస్థానం పలు ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. అలాగే, 41ఏ నోటీసు కింద రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే మాత్రం 48గంటలకు ముందుగానే నోటీసులు ఇవ్వాలని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున రంజిత్‌ కుమార్‌ అనే న్యాయవాది వాదనలు విన్పించారు. రెండుసార్లు నోటీసులు జారీచేసినా రవిప్రకాశ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదని ఆయన కోర్టుకు తెలిపారు.