NRI-NRT

మాల్టాలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

TNILIVE European Telugu News - Malta NRI TRS Celebrates Telangana Formation Day

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ పార్టీ మాల్టా శాఖా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మాల్టా శాఖా ప్రెసిడెంట్ అనుమాండ్ల మధుకర్ రెడ్డి మాట్లాడుతూ … ఉద్యమ నాయకుడు కేసీఆర్ చాణక్య వ్యూహం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారం అయ్యిందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి గాంధేయ మార్గంలో గొప్పగా పోరాడి ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తూ అతిచిన్న వయసు ఉన్నా మన రాష్ట్రాన్ని ఇటు సంక్షేమ పథకాల అమలులో, అటు అభివృద్ధి పనుల్లో దేశానికే ఆదర్శంగా ఉండేలా నిలిపారని కొనియాడారు.. గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు మన రాష్ట్రానికి దక్కాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి,భరత్ రెడ్డి,అజయ్ రెడ్డి, వంశీ,దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు