Devotional

సర్వాంతర్యామి అయిన భగవంతుడికి విగ్రహారాధన దేనికి?

When God is omnipresent why do you have to pray to statues?

భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?

👉ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్నా అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.

👌విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు.

👉స్వామీజీ నవ్వుతూ స్పందించారు.

👉రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.

👉అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.

👌అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.

👉నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.

👌స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.

👌రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.

👉చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటంలో వున్న చిత్రంలో మా రాజు వున్నారు అంటూ అరిచాడు.

👉అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమె. అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటు న్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో నీ రాజు ని చూసికుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటు న్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.

👉స్వామీజీ ని చూసిన రాజుక సామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు, స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.

👉ఇదే విగ్రహారాధన యొక్క సారము.

👉భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలనుకుంటాము, కోరికలను కోరాలనుకుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అనుకుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలనుకుంటాము,

👉మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.

👌విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.

👌విగ్రహము మనం చూడగలిగే యదార్ధ ప్రతినిధి.

👌నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు ప్రేమతో నన్ను నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తుంది.

👌అద్భుతమైన సందేశం, దయచేసి చదవండి మరియూ పంచండి.