Fashion

ఇంట్లోనే ఫేస్‌మాస్క్ చేసుకోవచ్చు

Home made face mask enhances skin collagen levels-Telugu fashion news

హోంమేడ్ ఫేస్ మాస్క్ తో స్కిన్ కొల్లాజెన్ లెవల్స్ ను పెంచుకోవచ్చు!

మచ్చలేని, నిష్కళంక చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యపడదు. మరియు, ప్రతిరోజూ మనం ఎదుర్కొనే మురికి, ధూళి మరియు కాలుష్యం కారణంగా, చర్మ సంరక్షణ అనేది అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. మనం తరచుగా ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడం, బ్లీచ్ చేయడం, మరియు ఫేషియల్ చేయించుకోవటం వంటి సౌందర్య చికిత్సలను అనుసరించడం ద్వారా, కొన్ని చర్మ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటి కోసం తరచుగా, వివిధరకాల స్పా మరియు సెలూన్లను సందర్శిస్తుంటాం. ఇవి ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉన్నా, నమ్మదగిన ఫలితాలను మాత్రం ఖచ్చితత్వంతో ఇవ్వలేవు. వాస్తవంగా ఈ సెలూన్ ఆధారిత చికిత్సలు, మీ చర్మానికి హానికలిగించే రసాయనాలతో కూడిన పదార్ధాలను కలిగి ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం సులభమైన మరియు సరళతరమైన హోంమేడ్ రెమిడీస్ అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది. అంతేకాకుండా, దుష్ప్రభావాలులేని చికిత్సను అందించగలిగి, ఆరోగ్యకర చర్మాన్ని నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. సహజసిద్దమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయగలిగిన, కొన్ని అద్భుతమైన నేచురల్ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ క్రింద పొందు పరచబడ్డాయి. మరిన్ని వివరాలకు వ్యాసం పూర్తిగా చదవండి

1. అవొకాడో, టమోటో, మరియు ఎగ్ వైట్ : అవకాడో నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తూ, హైడ్రేటెడ్ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో బీటాకెరోటిన్, లినోలెయిక్ ఆమ్లం, మరియు లెసితిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న కారణంగా, చర్మాన్నినిర్జలీకరణం కాకుండా చూస్తూ, మంచి పోషణను అందివ్వగలుగుతుంది. మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, తేమను నిర్వహించడంతోపాటుగా, మంచి పోషణను అందించడానికి టమోటో మరియు ఎగ్ వైట్లను అవకాడోతో కలిపి ఫేస్ మాస్క్ తయారుచేయవచ్చు.   కావలసిన పదార్ధాలు : • 2 టేబుల్ స్పూన్ల అవకాడో గుజ్జు • 2 టేబుల్ స్పూన్ల టొమాటో గుజ్జు • 1 ఎగ్ వైట్ అనుసరించు విధానం : • ఒక గిన్నెలో అన్ని పదార్థాలను వేసి, వాటిని మిశ్రమంగా కలపండి. • దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి 15నిముషాలపాటు అలానే వదిలేయండి. • చల్లటి నీటితో కడిగి, మీ ముఖాన్ని తువాలుతో పొడిగా చేసుకోండి. • ఆశించిన ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ పద్దతిని పునరావృతం చేయండి.

2. దాల్చిన చెక్క, తేనె, మరియు పసుపు : దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు మరియు ఆక్నే సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి. మరోవైపు, తేనె మరియు పసుపు హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. తద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. కావలసిన పదార్ధాలు : • 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి • 1 టేబుల్ స్పూన్ తేనె • ఒక చిటికెడు పసుపు అనుసరించు విధానం : • ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడి, తేనెను తీసుకుని మిశ్రమంగా కలపండి. • దీనికి కొంత పసుపు చేర్చి, అన్ని పదార్థాలను మరలా కలపండి. • దీన్ని మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు 15 నుండి 20 నిముషాలపాటు అలానే వదిలేయండి. • ఆపై చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. • కోరుకున్న ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలా పునరావృతం చేయండి.

3. పెరుగు మరియు అరటి : పెరుగు మీ చర్మానికి ప్రయోజనకరంగా ఉండే అనేక విటమిన్స్ మరియు పోషకాలను కలిగి ఉంటుంది. ఇది లాక్టిక్ ఆమ్లాన్ని ప్రధానంగా కలిగి ఉంటుంది. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులలో వినియోగించే ప్రధాన పదార్థాల్లో ఒకటిగా ఉంటుంది. పెరుగు, ఫేస్ మాస్క్ రూపంలో అప్లై చేసినప్పుడు, మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చగలుగుతుంది. అదేవిధంగా తరచుగా ఉపయోగించినప్పుడు మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. కావలసిన పదార్ధాలు : • 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ ( లేదా పెరుగు) • 2 టేబుల్ స్పూన్ అరటి గుజ్జు అనుసరించు విధానం : • రెండు పదార్థాలను ఒక గిన్నెలోనికి తీసుకుని, వాటిని బాగా బ్లెండ్ చేయాలి. • ఈ పేస్ట్ ను మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేయండి. • 20 నిమిషాలపాటు అలానే వదిలేసి, ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయండి. • ఆశించిన ఫలితాల కోసం ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండుసార్లు పునరావృతం చేయండి.

4. ఆముదం నూనె, ఆలివ్ ఆయిల్, & నిమ్మ రసం : ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె, మరియు నిమ్మ, అద్భుతమైన స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉండడమే కాకుండా, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపగలుగుతాయి. కావలసిన పదార్ధాలు : • 1 టీస్పూన్ ఆముదం నూనె • 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ • 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం అనుసరించు విధానం : • అన్ని పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని, వాటిని మిశ్రమంగా కలపండి. • బ్రష్ ఉపయోగించి మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేయండి. • 20 నిమిషాలపాటు అలానే గాలికి విడిచిపెట్టండి. • ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. • ఆశించిన ఫలితాలకోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.