Politics

తండ్రీ కూతుళ్లకు మెట్టినింట పరాభవం

KCR and Kavitha Face Loss In Their In-Law Constituency Elections

కరీంనగర్ జిల్లాలోని సీఎం దత్తత గ్రామంలో పరిషత్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. సీఎం దత్తత గ్రామం… చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో టీఆర్ఎస్ ఓడిపోయింది. అక్కడ.. స్వతంత్ర అభ్యర్థి రాజేశం గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
**కవితకు మరో షాక్
నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత సొంతూరు (అత్తగారి ఊరు) పొతంగల్ లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది.కామారెడ్డి జిల్లా నవీపేట మండలం పొతంగల్ లో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి కాట్రాజు రాజు గెలుపొందారు. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీ కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ గెలుపొందారు.
**కేసీఆర్ అత్తగారి ఊరిలో కాంగ్రెస్ గెలుపు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో టీఆర్ఎస్ కి చేదు ఫలితాలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాక. ఈ గ్రామానికి పక్కనే ఉన్న ఊరు కోరేం.. రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ కుటుంబసభ్యుడు అయిన సంతోష్ కుమార్ సొంత ఊరు. కీలక నాయకులు ఉన్న కొదురుపాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. కొదురుపాక ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాలగౌని గౌతమి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి రజితను ఓడించారు.