DailyDose

ఎట్టకేలకు లొంగిపోయిన రవిప్రకాష్-నేరవార్తలు–06/04

Raviprakash surrenders himself to police

* క్రైం పోలీసుల ఎదుట హాజరైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్….నకిలీ, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్పైం అలంద మీడియా ఫిర్యాదు…రవిప్రకాశ్పై్ గతంలో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు….41ఏ సీఆర్పీసీ కింద ఇదివరకే నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు.
* అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై విజయలక్ష్మి (28) మృతి
* ఔటర్ రింగ్‌రోడ్డు ఘట్‌కేసర్ టోల్‌ప్లాజా సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న లారీని ఎర్టీగా కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తిమృతి చెందగా, యాదాద్రి జిల్లాలోని మల్లపురంలోఈదురుగాలులకు తాటిచెట్టు నేలకూలడంతో ఓ గీతకార్మికుడు మృతి. అటు నగరంలో కురిసినభారీ వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి.ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బెల్లంపల్లి నియోజకవర్గం లో భారీ వర్షందీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతోవాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
*పెడన నియోజకవర్గం పోసిన వారి పాలెం ఆంజనేయ స్వామి గుడి వివాదంగుడిలో డబ్బులు వివాదం హత్యా ప్రయత్నానికి దారితీసింది అదే గ్రామానికి చెందిన హోంగార్డుగా చేసే సే పూసిన రాము మరో ఐదుగురు రాత్రి దాడికి పాల్పడ్డారు డబ్బులు మీ దగ్గర పెట్టుకుని పెత్తనం చేస్తున్నావంటూ చంద్రకళ పై దాడి పెట్రోల్ పోసి నిప్పు అందించే ప్రయత్నం ఇంటి కుక్క మరగడం తో పరారైన గ్యాంగ్ దాడికి పాల్పడిన రాము పై గతంలో కూడా కేసులున్నట్లు స్థానికులు చెబుతున్నారు
*గుంటూరుతాడేపల్లి వద్ద ఉన్న పోలకంపాడులో గాంధీ విగ్రహం ధ్వసం చేసినగుర్తు తెలియని వ్యక్తులు..విచారణ చేస్తున్న పోలీసులు
*తాడేపల్లి నులకపేటలోని పాల దుకాణంలో చోరీ..11వేల నగదు, సెల్ ఫోన్ అపహరణ..సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యజమాని సంజీవ రెడ్డి
*అక్రమ అవయవ దానం కేసులో ముద్దాయిలుగా ఉన్న నెల్లూరు సింహపురి ఆసుపత్రి వైద్యులకు కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ కోసం వీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది.
*బ్యాంకు కుంభకోణంతో సంబంధం ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, గైర్హాజరవుతున్న నిందితుడని ఈడీ తెలిపింది. ఈ మేరకు సోమవారం బాంబే హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.
*తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న రాడిక్స్‌ మైక్రో సిస్టమ్‌ కంపెనీని సైబర్‌ నేరస్థులు మోసగించారు.
*అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై… దుండగులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం జరిపి, ఆపై హత్యచేసిన ‘కథువా కేసు’ విచారణ ముగిసింది! దోషులెవరో, వారికి ఎలాంటి శిక్ష వేస్తారో వారం రోజుల్లో తేలిపోనుంది.
*జమ్ము-కశ్మీర్‌లోని శోపియన్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది, అతడి సహచరుడు హతమయ్యారు. ఆదివారం రాత్రి మూల్‌ చిత్రగాం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, వాహనంలోని ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు.
*వివాహిత (30)పై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘోరం రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో చోటుచేసుకుంది.
*నందాదేవి శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి, అదృశ్యమైనవారిలో ఐదుగురి మృతదేహాలను భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) హెలికాప్టర్లు సోమవారం కనుగొన్నాయి.
*చోరీ చేసిన దుండగులను పట్టుకునేందుకు రాజస్థాన్‌ వెళ్లిన వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులపై అక్కడి స్థానికులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
*సమస్యను నివేదించడానికి వచ్చిన ఎన్‌సీపీ మహిళానేతను భాజపా ఎమ్మెల్యే ఒకరు తీవ్రంగా కొట్టి, కాలితో తన్ని దౌర్జన్యానికి పాల్పడిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
*రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల ప్రజలను ఓ చిరుత పులి నాలుగు నెలలుగా హడలెత్తిస్తోంది. తరచూ దూడలపై దాడి చేస్తూ వాటిని చంపేస్తోంది.
*కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం పిడుగు పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
*మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ముగ్గురు నిందితులను స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో సోమవారం హాజరుపరిచారు.
*నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ముబారక్‌నగర్‌లో ఓ ఇంట్లో చొరబడేందుకు దుండగులు యత్నించారు. తలుపులు తీయలంటూ ఇంట్లో వాళ్లను బెదిరింపులకు గురిచేశారు.
*పొన్నలూరు మండల తహసీల్దార్‌ కృష్ణరావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
*వేసవి సెలవులు చోరుల హడావుడి లేకుండా ప్రశాంతంగా గడిచిపోతున్నాయని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే రెచ్చిపోయారు.
*పురానాపుల్‌ శివనగర్‌కు చెందిన బి.వంశీకృష్ణ (21) గతనెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరుకోలేదు. యువకుడు ఓ ప్రైవేట్‌ కంపెనీలో విధులకు హాజరు కావడానికి వెళ్లి తప్పిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామశివారులో ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు దర్మరణం చెందాడు.
* విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన అనబత్తుల యుగంధర్‌(18) మృతి చెందాడు.