NRI-NRT

తానా క్రికెట్ పోటీ విజేతలకు భారీ బహుమతులు

Special Sports Competitions And Prizes Announced-TANA 2019 Conference-తానా క్రికెట్ పోటీ విజేతలకు భారీ బహుమతులు

*** జులై 4 నుంచి 6 వరకు వాషింగ్టన్‌లో నిర్వహణ
అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జులై 4వ తేదీ నుంచి 6 వరకు జరిగే 22వ తానా మహాసభల్లో మెగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాన్ఫరెన్స్‌ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినిమా కళాకారులు, రంగస్థల నటులు, గాయనీగాయకులు, సాహితీవేత్తలు హాజరవుతున్నట్లు సభ్యులు వివరించారు. స్థానిక తెలుగు ప్రజలను ఇందులో భాగస్వాములు చేయడంతోపాటు వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తానా క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు 3,200 డాలర్ల బహుమతి అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.