WorldWonders

ఈ విమానం అణుబాంబును కూడా తట్టుకుంటుంది

US Air Force E4B Can WithStand Nuclear Explosion

అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఈ–4బీ విమానం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందట. అణుబాంబు పేలుడుని సైతం ఈ బోయింగ్ 747 మోడల్ ప్లేన్ తట్టుకోగలుగుతుందట! ఇటీవల ఈ ప్లేన్ లోపలికి వెళ్లిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. కోల్డ్ వార్ టైంలో తయారైన ఈ–4బీ ప్లేన్ లో డిజిటల్ టెక్నాలజీని వాడకుండా, అనలాగ్ టెక్నాలజీపై మాత్రమే ఆధారపడ్డారు. ఇప్పటికే అలాగే వాడుతుండటం వల్లే అణు బాంబు పేలుడు వల్ల ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలు దీనిపై ఎలాంటి ప్రభావం చూపించలేవు.అంతేకాకుండా ప్లేన్ కు ఉన్న షీల్డ్ యుద్ధ సమయంలో న్యూక్లియర్, థర్మల్ ఎఫెక్ట్స్ లోపలున్న వారిని తాకనివ్వదట. ఈ–4బీ విమానం ఆరు అంతస్థుల ఎత్తు ఉంటుంది. ఇందులో 18 బంకర్లు, ఆరు బాత్రూంలు, ఒక గ్యాలరీ, ఒక బ్రీఫింగ్ రూమ్, ఇతర వసతులు ఉంటాయి. దాదాపు 112 మందిని మోసుకెళ్లగలదు. ఈ ప్లేన్ భారీ ఆయిల్ ట్యాంకులుఉన్నాయి. ఇతర విమానాల నుంచి ఆయిల్ ను రీఫిల్ చేసుకుంటూ కొన్నిరోజుల పాటు అలానే ఎగురుతూ ఉండగలదు. విమానానికి అమర్చిన 67 శాటిలైట్ డిష్ లు, యాంటెన్నాలతో ప్రపంచంలోని ఎవరితోనైనా సెకన్లలో మాట్లాడొచ్చు. సముద్రం అడుగున ఉన్న సబ్ మెరైన్లతో సైతం కమ్యూనికేషన్ జరపొచ్చు. బయట ప్రపంచానికి తెలియకూడనిరహస్య శక్తులు ఈ–4బీకి ఉన్నాయని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ మోడల్ విమానాన్ని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ప్యాట్రిక్ షనహన్ వాడుతున్నారు.