NRI-NRT

లాస్ఏంజిల్స్‌లో “ఆటా” మహాసభలు

American Telugu Association ATA 2020 In Los Angeles

అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 2020 జులై నెలలో మహాసభలు నిర్వహించడానికి సన్నహాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఈ మహాసభలను ప్రముఖ హాలీవుడ్ రాజధాని లాస్ఏంజిల్స్‌లో నిర్వహించాలని ఆ సంఘ కార్యవర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలే జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ ఉత్సవాల నిర్వహణకు ఇప్పటి నుండే పటిష్ఠమైన ఏర్పాట్లను ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ భుజాల తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.