DailyDose

తెలంగాణాలో రాజకీయ హత్య-నేరవార్తలు–06/05

June 05 2019 - Daily Crime News-Political Killings In Telangana

* దేవరకద్ర మండలంలోని డోకూరుకు చెందిన ప్రేమ్ కుమార్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రాజకీయ ఘర్షణలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
* నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. కిడ్నాప్‌కి పాల్పడిన ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు.
* పెదవేగి మండలం రామచంద్రాపురం వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నులు రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు లారీ సీజ్, డ్రైవర్ రాంబాబు అరెస్ట్ చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామం నుంచి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు తరలిస్తున్న రేషన్ బియ్యం.
* వరంగల్ మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పేపర్లు మాయం ఘటన పై పిర్యాదు చేసిన కస్టోడియన్ రజిత..
* అంతరాష్ట్ర దొంగలు ఇద్దరిని మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు మందమర్రికి చెందిన టేకం రాము(24), పెద్దపల్లి జిల్లా బోగంపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి సారయ్య(22) గుర్తింపు. వీరి వద్ద నుంచి 74.42 తులాల బంగారం, కిలోన్నర వెండి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
* మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు తరువాత, గెలిచిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి మంగళవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
*సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడ స్పార్‌ ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్‌ డ్రమ్ములు రాపిడి జరగడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పరిశ్రమ మొత్తం పూర్తిగా బుడిదపాలు అయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కాగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.
* మహబూబ్‌నగర్ జిల్లాలో పరిషత్ ఎన్నికల తర్వాత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు రాడ్డుతో కొట్టి చంపేశారు.
* సూర్యాపేట జిల్లాలోని జనగామ క్రాస్‌రోడ్డు వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఓ మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మహిళ ప్రాణాలు కోల్పోయింది.
* సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు.
*మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దేవరకద్ర మండలంలోని డోకూరులో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ పార్టీకి చెందిన వ్యక్తి గెలుపొందగా..విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సంబరాల్లో మరో వర్గం వారితో గొడవ జరిగిందని, వారే కొట్టి చంపినట్లుగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
* విశాఖ జిల్లా చోడవరం పట్టణానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త మండే శ్రీనును (44) మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన ముఖాన్ని ఛిద్రం చేసి గుర్తించలేని విధంగా చేశారు.
*తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా జుజుమురాలో మంగళవారం చోటుచేసుకుంది.
* ఉగ్ర నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాదులు మసరత్‌ ఆలమ్‌, అసియా ఆంద్రాబీ, షాబీర్‌ షాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్టు చేసింది.
*మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-5బి భూగర్భ బొగ్గు గనిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు దుర్మరణం చెందగా మరో కార్మికుడికి గాయాలయ్యాయి.
* అది పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్‌్ివాన్‌ జిల్లా.. సమయం మధ్యాహ్నం 12.30 గంటలు. ఎరుపు ఫ్యాంటు, షర్టు.. ఎర్రని శిరస్త్రాణం ధరించిన ఓ పొట్టి వ్యక్తి ఎర్రటి బైక్‌పై ఓ ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు.
*మీ భూములిస్తే తాను ప్రారంభించనున్న కంపెనీలో సంచాలకుడి హోదాతోపాటు రూ.2 కోట్లు లాభం ఇస్తానంటూ మోసానికి పాల్పడిన అల్లూరి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఎండీ ఎ.విక్రమాదిత్యను సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.
* ఆడుకుంటూ వేడిగా ఉన్న సాంబారు పాత్రలో పడి బాలుడు మృతి చెందాడు. కర్ణాటకలోని హులిగిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేటలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 65 తులాల బంగారం, రూ.2.43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
*పండు ముసలి అయిన తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో స్థానికుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరుపతి నగరంలోని అనంత వీధిలో నివసించే 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య దంపతులపై పెద్ద కొడుకు విజయ్‌ తన భార్య, బావమర్దితో కలిసి దాడి చేశాడు.
* ఒక కిడ్నీకి రూ.3 కోట్లు ఇస్తామంటూ ఓ ప్రైవేటు సెంటర్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన ద్వారా పలువురు మోసపోయారు. పెద్ద మొత్తంలో డబ్బు ఎరగా వేయడంతో కిడ్నీ ఇవ్వడానికి చాలా మంది ముందుకొచ్చారు.
*అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
*రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడి కాళ్లు, చేతులు కట్టేసిన కొందరు వ్యక్తులు అతడిని దారుణంగా కర్రలతో చితక్కొట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరు కాషాయ దుస్తులు ధరించి ఉన్నాడు.