Agriculture

రైతన్నా…నకిలీ విత్తనాల కొనకు

PD Act On Fake Seed Sellers - Agriculture News Info In Telugu

నకిలీ విత్తనాలు కొని మోసపోకండి
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనా వ్యాపారులపై పోలీసు శాఖ ద్రుష్టి దారించింది. వ్యవసాయ శాఖ అధికరులుతో కలిసి నకిలీ విత్తన సరఫరాదారులు అమ్మక్మదరుల పై రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించింది. ఈనేపద్యంలో రైతులకు అవగాహనా కల్పించాలని భావించింది కరపత్రాలు పోస్టర్లను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహనా కల్పిస్తోంది.
**రైతులకు సూచనలివే
*విత్తనాలను అదీకృత డీలర్ వాద్దె కొనాలి
*కొనుగోల్లుకు సంబందించిన డీలర్ నుంచి రసీదుతీసుకోవాలి విత్తనం లాట్ నంబరు ఎక్స్ పయిరీ డేట్ వివరాలు బిల్లులో ఉండేలా చూసుకోవాలి. రసీదు పై రైతు సంతకం పాటు అదీకృత డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి
*విత్తనాల కొనుగోలులో శాస్త్రవేత్తల వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.
*బీటీ-3 విత్తనాలను తెలంగాణకు అనుమతి లేదు. వితాన ప్యాకెట్ పై ఉన్న ఎమ్మార్పీకి మించి కొనుగోలు చేయొద్దు. విడిగా విత్తనాలను కొనొద్దు.
*నకిలీ విత్తనాల విక్రేత వివరాలు దయాల్ వందకి , స్థానిక సిఐ , ఎస్సైలకు పోన్ చేసి వారి వివరాలు తెలపాలి.
** నకిలిదారుల పై పీడీ యాక్ట్
నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కటిన చర్యలు తీసుకోవాలని క్షెత్ర స్థాయి అధికారులకు డీజీపీ మహేంద్ర రెడ్డి ఇటీవల ఆదేశాలు జరీ చేశారు. ప్రభుత్వం చట్టసవరణ చేసిందని దాని ప్రకారం నిందితుడిని పై పీడీ చట్టాన్ని ప్రయోగించచాలని నిర్దేశించారు. ఏంటో శ్రమతో శ్రమకోర్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారని రైతులను మోసం చేసిన వారిని ఉపెశించే వద్దని సూచించారు. మూకుమ్మడిగా నకిలీ విత్తనా సరఫరాదారుల అమ్మదరులపై దాడులు నిర్వహించాలని నకిలీ విత్తనాల్ని స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల నిర్మూలకు ఎలాంటి చర్యక్లు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.