Business

సరికొత్త వెస్పా

The all new vespa urban club for 73000 INR released

పియాజియో ఇండియా మార్కెట్లోకి సరికొత్త వెస్పా అర్బన్‌ క్లబ్‌ను విడుదల చేసింది. 125సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ఈ స్కూటర్‌ దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో ప్రారంభ ధర రూ.73,733 గా నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో అతితక్కువ ధరకు లభిస్తున్న వెస్పా స్కూటర్‌ ఇదే. ఈ కొత్త వేరియంట్‌ అజౌరో ప్రొవెన్జా, మాజ్‌గ్రే, గ్లూసీ ఎల్లో, గ్లూసీ రెడ్‌, గ్లూసీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తోంది. దీనిలో గ్రాబ్‌ రెయిల్‌, బ్రేక్‌ లివర్‌, వీల్స్‌లో మార్పులు ఉన్నాయి. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. 10 అంగుళాల నలుపు రంగు అలాయ్‌ వీల్స్‌, డ్రమ్ బ్రేక్స్‌, కంబైన్డ్‌ బ్రేకింగ్‌సిస్టమ్‌ అమర్చారు. పియాజియో ఇండియా సీఎండీ డియాగో గ్రిఫ్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌లో విస్పా అర్బన్‌ క్లబ్‌ను విడుల చేయడం సంతోషంగా ఉంది. సరికొత్త ట్రెండ్స్‌, సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతల సమ్మేళనమే ఈ వాహనం. ఇది వెస్పా ఫ్యాన్స్‌ను సంతోషపెడుతుందని నమ్ముతున్నాం’’ అని అన్నారు.