WorldWonders

పోర్న్ చూసి భార్యలను వేధిస్తున్న పట్టణ పురుషులు

Indian husbands abusing wives to act sexually as in porn videos-పోర్న్ చూసి భార్యలను వేధిస్తున్న పట్టణ పురుషులు-రక్తం వచ్చేలా కొడుతున్నారు కూడా

*** పోర్న్ చూస్తారు.. భార్యల్నీ అలానే చేయమని హింసిస్తారు!
ఫోన్లలో పోర్న్ చూసి భార్యలను అసహజ శ‌ృంగారానికి బలవంతం చేయడం దేశంలో పెరుగుతోంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ వంటి నగరాలు.. పట్టణాలు, చివరకు గ్రామాల్లోనూ ఇలాంటి తీరుతో చాలా మంది భార్యలు ఇబ్బందులుపడుతున్నారు. పలు స్థానిక పత్రికలను తిరగేసినపుడు పలువురు వైద్య, మానసిక నిపుణులను సంప్రదించినపుడు ఈ ధోరణి ఎలా పెరుగుతోందో అర్థమవుతుంది. ఇక బయటకు రాని అంశాలైతే ఎన్నో! దేశంలోని పలు నగరాల్లో భర్తలకు ‘పోర్న్ మీద మాత్రమే’ ఆసక్తి ఉండటంతో భార్యలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అది ఇద్దరి బంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పట్టణాలుగా మారుతున్న గ్రామీణ ప్రాంతాల్లో వివాహితులైన మహిళలు.. తమ భర్తల ‘పోర్న్ తరహా సెక్సు’ కోరికల వల్ల గాయపడి చికిత్స తీసుకోవడం పెరుగుతోంది. ఇక నాసిక్ వంటి మధ్యశ్రేణి నగరంలో.. తన వద్దకు వస్తున్న విడాకుల కేసుల్లో 45 శాతం కేసులకు కారణం పోర్నేనని ఒక న్యాయవాది చెప్తున్నారు. కానీ దీనికి అధికారికంగా ‘అసహజ సెక్సు’ అని కారణంగా చూపుతున్నట్లు తెలిపారు. రత్న (అసలు పేరు కాదు)ది మహారాష్ట్రలోని ఓ వెనుకబడిన ప్రాంతం. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఆరంభించింది. ముందంతా మంచి కాలమేనని ఎన్నో కలలు కనింది. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో చూపినట్లు.. తన భర్త తనను ప్రేమించాలని కోరుకుంది. కొన్ని రోజులు అనుకున్నట్లుగానే సాగింది. ఆమె భర్త బాగా చదువుకున్నాడు. ఆమె అవసరాలు తీర్చేవాడు. కానీ ఒకే ఒక సమస్య: శృంగారం బాధాకరంగా.. ఒక్కోసారి హింసాత్మకంగా ఉండేది. ఆమె భర్తకు పోర్న్‌ వ్యసనం ఉంది. ఆ వీడియోల్లో చూపే పనులు చేయాలంటూ రత్నని బలవంతం చేసేవాడు. రోజులు గడిస్తే తన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆమె ఆశించింది. కానీ అలా జరగలేదు. నిజానికి అతడు ఇంకా హింసాత్మకంగా మారాడు. రాత్రంతా పోర్న్ చూడటం మొదలుపెట్టాడు. ఉత్ప్రేరకాలు వాడేవాడు. భార్యతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. తన కోరికలు తీర్చకపోతే ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. ఒక రోజు.. ఒక పోర్న్ వీడియోలో చూపిన విధంగా రత్న కాళ్లను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి ఆమెను తలకిందులుగా వేలాడదీసి.. ఆమెతో సెక్స్ చేశాడు. దీంతో ఆమె గుండె బద్దలయింది. తీవ్రంగా కుంగిపోయింది. ఇక భరించలేని స్థితిలో అయిష్టంగానే విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ‘ఆ ఘటన రత్న జీవితాన్ని మార్చేసింది. ఆమె ఇంకా మనుషుల్ని నమ్మలేకపోతోంది. ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు” అని సోషల్ వర్కర్ రాధా గవాలే చెప్తారు. హింసా బాధితులైన మహిళలు, పిల్లలకు సాయం చేయడం కోసం టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉమన్ అండ్ చిల్డ్రన్ సెల్‌లో పనిచేస్తున్న సోషల్ వర్కర్లలో రాధ ఒకరు. ”పోర్న్ ప్రభావంతో భర్తలు లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసులు మా దగ్గరకు రావడం అంతకంతకూ పెరుగుతోంది” అని ఆమె తెలిపారు. ”భర్తలు పోర్ను వీడియోలు చూసి తమతో అసహజ సెక్సు చేయాలని తమ భార్యల మీద ఒత్తిడి తెస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే వారిని హింసించడం మామూలుగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతమైనా.. అన్ని సామాజిక, ఆర్థిక తరగతుల కుటుంబాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మగవాళ్లు మద్యం మత్తులో ఉన్నపుడు ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి” అని రాధ వివరించారు.

*** చౌక స్మార్ట్‌ఫోన్లు, ఉచిత ఇంటర్నెట్ పాత్ర…
భారతదేశంలో ”పెద్దలకు మాత్రమే” ప్రత్యేకించిన కంటెంట్‌ వినియోగం 2016-17లో దాదాపుగా రెట్టింపయిందని విడూలీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుబ్రత్ కార్ చెప్పారు. విడూలీ తన వినియోగదారులకు అనలటిక్స్, డాటా ఇంటెలిజెన్స్ అందిస్తుంది. ”చౌక స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ దాదాపుగా ఉచితంగా లభిస్తుండడం వల్ల పోర్న్ వీక్షించడం పెరిగినట్లు మా సర్వే చెప్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని.. మరాఠ్వాడా ఉమన్ అండ్ చిల్డ్రన్ సెల్ కో-ఆర్డినేటర్ జ్యోతి సప్కాల్ తెలిపారు. ”కొన్నిసార్లు మగాళ్ల లక్ష్యం లైంగిక తృప్తి కాదు.. వాళ్లు తమ మగతనం నిరూపించుకోవాలని కోరుకుంటారు. లేదంటే తమ భార్యలను ”అదుపు”లో ఉంచాలని భావిస్తారు” అని ఆమె చెప్పారు. ”ఇటువంటి హింసకు మూలం.. ‘నా పెళ్లాం.. నా ఆస్తి… దానితో నేను ఏమైనా చేసుకోవచ్చు’ అనే విశ్వాసమే” అని జ్యోతి విశ్లేషించారు. ఒక భర్త పోర్న్ వీడియోలు చూసి, వాటిలోని సెక్స్ కార్యకలాపాలను అనుకరించాలంటూ తన భార్యను కోరిన ఒక ఉదంతం గురించి రాధ తెలిపారు. ”ఒకసారి అతడు ఆమెను చెక్క మంచానికి కట్టేసి, అసహజంగా ప్రవర్తించాడు. వీడియో తీసి తన ఫ్రెండుకి పంపించాడు. అతడొక దినసరి కూలీ. అయినా కూడా పోర్న్ చూడటానికి ఒక స్మార్ట్‌ఫోను, చౌక ఇంటర్నెట్ అతడికి ఉన్నాయి” అని ఆమె చెప్పారు. ఏ మహిళ అయినా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నపుడు ఆమె వెంటనే ఎవరినైనా సాయం కోరాలని హైదరాబాద్‌కు చెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ షర్మిళ మజుందార్ పేర్కొన్నారు. ”ఎలాంటి హింస అయినా, విపరీత లైంగిక చర్యల ద్వారా ప్రేరణ పొందే వికృత లైంగిక వాంఛలను అసలేమాత్రం ఉపేక్షించకూడదు” అన్నారామె. సెక్స్ విషయంలో భాగస్వాములిద్దరికీ సమాన స్వేచ్ఛ ఉండాలి. శృంగారాన్ని ఇద్దరూ సమానంగా ఆస్వాదించగలిగేలా ఉండాలి. కానీ.. భారతదేశంలో వైవాహిక జీవితంలో ప్రేమానురాగాల కోసం ఎదురుచూసే రత్న లాంటి మహిళలకు ఇది ఇంకా పగటి కలగానే ఉంది. సెక్సు విషయాల్లో భారతీయ మహిళల ఇష్టాయిష్టాలకు చోటు లభించడం చాలా అరుదు. పోర్న్ చూడటంలో తప్పేమీ లేదని కూడా షర్మిళ భావిస్తారు. ”కొన్నిసార్లు దంపతుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు కలిగివుండటానికి ఇది సాయపడుతుంది” అని ఆమె పేర్కొన్నారు. కానీ సెక్సు గురించి మాట్లాడటం ఇంకా నిషిద్ధంగానే ఉన్నా భారత్ వంటి దేశంలో.. సెక్సు గురించి స్కూళ్లలో, ఇళ్లలో బహిరంగంగా చర్చజరగనంత వరకూ.. భార్యాభర్తల మధ్య ఆరోగ్యవంతమైన లైంగిక సంబంధాలు ఉండటమనేది సుదూర స్వప్నమే. మహిళలు మొదట చేయాల్సిన పని గొంతెత్తి మాట్లాడటమని.. ఆ తర్వాత వారి మాటను భర్తలు, కుటుంబ సభ్యులు వినిపించుకోవాలని ఆశించాలని రాధ అంటారు.