DailyDose

ఇంజనీర్ చేత గుంజీలు తీయించిన ఎమ్మెల్యే-తాజావార్తలు–06/06

June 06 2019 - Daily Breaking News - Politician makes an engineer do situps

* రోడ్డు సరిగా వేయలేదని బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ మెహెర్ పీడబ్ల్యూడీ ఇంజినీర్ ను గుంజీలు తీయించారు. సరోజ్ కుమార్ తన నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఓ ప్రాంతంలో వేసిన రహదారిలో నాణ్యతాప్రమాణాలు లోపించాయని సదరు ఇంజినీర్ ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రోడ్డు సరిగా వేయనందుకు 100 గుంజీలు తీయాలని ఇంజినీర్ ను ఆదేశించారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇంజినీర్ ను హెచ్చరించారు. దీంతో హడలెత్తిపోయిన ఇంజినీర్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ ముందు గుంజీలు తీశాడు. ఈ వీడియో ఇపుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరోజ్ కుమార్ మెహెర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.
* ద్వారకాతిరుమల గ్రామంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం, భయాందోళనలో గ్రామస్తులుచిన్న వెంకన్న అన్నదానం వెనుక ఉన్న స్టీమ్ పొయ్య పేలడంతో భారీగా ధ్వంసమైన రేకుల షెడ్డు అద్దాలు సామాగ్రిఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దేవస్థాన అధికారులు
* కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామంలో గన్నవరం మండలం సవారీ గూడెం గ్రామస్తులు డంపింగ్ యార్డ్ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ రోడ్డు పై పవన్ కళ్యాణ్ వాహనాన్ని అడ్డుకుని పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారు
* నీళ్ళ ట్యాంక్ డ్రైవర్ గుండెపోటుతో మృతి. గ్రామస్తుల దాహం తీర్చే ఆ డ్రైవర్ విధి నిర్వహణ లొనే ప్రాణాలు విడిచాడు..ఈ విషాదకరమైన సంఘటన బందరు మండలంలోని గుండుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది.
* కృష్ణాజిల్లా మచిలీపట్నం ఇద్దరు విద్యార్థులు సముద్ర స్నానికి వెళ్లి ఒకరు గల్లంతు…ఒకరి పరిస్థితి విషమం..
* శాసనమండలి సభ్యత్వానికి వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం శాసనసభ కార్యదర్శి కె సత్య నారాయణ రావుకి తన రాజీనామా లేఖను సమర్పించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కల్పించే ‘సాధారణ సమ్మతి’ని (జనరల్‌ కన్సెంట్‌) పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ గత నవంబరులో తెదేపా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి..సీబీఐ ప్రవేశానికి వీలుగా సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
* జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
* కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ పలు సూచనలు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాగ‌ల 40 నిమిషాల్లో ఈ రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌నున్నాయని హెచ్చరించింది. ముఖ్యంగా తూళ్లూరు, అమరావతిలలో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలని,
బ‌య‌ట ప్రాంతాల్లో సంచ‌రించ‌రాదని, చెట్ల కింద ఉండ‌టం ప్ర‌మాద‌క‌రమని చెప్పింది.
* వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని, ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పోరాడారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
* ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టేందుకు కార్యాచరణ ఉంటుందన్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావాలన్నారు. ఈనెల 9న ప్రధాని మోడీతో మరోసారి చర్చిస్తామన్నారు.
* నకిలీ విత్తనాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. గురువారం ఉదయం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమీక్షలో రైతు రుణాలు, మద్దతు ధరలు, ముఖ్యంగా.. నకిలీ విత్తనాల వ్యవహారంపై నిశితంగా చర్చించారు.
* అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆశాఖ అధికారులతో తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం జగన్‌ సమీక్ష నిర్వహించారు.
* హరియాణ ముఖ్మమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన ప్రవర్తన కారణంగా మరోసారి వార్తల్లోకెక్కారు. స్థానిక కర్నాల్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఖట్టర్‌ వేదిక వద్దకు చేరుకుంటుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు ఆయన కాళ్లు మొక్కాడు. అనంతరం ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించగా ఖట్టర్‌ అతడిని నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.
* వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశాలపై స్పందిస్తూ.. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని చెప్పారు.
* వైసీపీ అధినేత జగన్ దూకుడు ఇపుడు ఏపీలోని అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తోంది. వరస బదిలీలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హడలిపోతున్నారు. సమర్ధులతో తమ టీంని జగన్ తయారు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వారికి అనుకూలంగా పనిచేసి విపక్షాన్ని ఇబ్బందుల పాలు చేసిన వారిని లూప్ లైన్లోకి తెచ్చేస్తున్నారు.
* ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఏఎన్ఎంలు, డీఎస్సీ-2018 అభ్యర్థులు బైఠాయించారు. ఉద్యోగాలు కల్పించాలని, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గతప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
* వ్యవసాయ శాఖపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష ప్రారంభం.హాజరైన ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ , వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్ , ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ , ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్సి రావత్ , వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి. మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్షించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
* టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ ఘర్షణలో రెండు శిలా ఫలాకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
* ఆర్టీసీ జేఏసీ నేతలను ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. సమస్యల పరిష్కారం కోసం గత నెల 9న సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈనెల 13వతేదీ నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఇవాళ్లి చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని కార్మికులంటున్నారు.
* టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు శిలా ఫలాకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
*తెరాస శాసనసభాపక్షంలోకి కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. శాసనసభలో కాంగ్రెస్‌ బలం 19 కాగా విలీనానికి మూడింట రెండొంతులు అంటే 13 మంది సభ్యులు అవసరం. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12 అయింది.
*నైరుతి రుతుపవనాలు మరింత మందగించాయి. గురువారం నాటికి కేరళకు వస్తాయనే అంచనాలు మారిపోయాయి. ఈ నెల 8 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది.
*టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులుకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
*యూరియాకు పోషక పదార్థాల ఆధారిత రాయితీ (న్యూట్రియంట్‌ బేస్డ్‌ సబ్సిడీ- ఎన్‌బీఎస్‌) వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇంతవరకు యూరియా ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుండగా, ఇకపై ఎంత మొత్తం రాయితీ ఇవ్వాలన్నదాన్నే నిర్ణయిస్తుంది.
*కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పనిచేయాలని, తమ జిల్లాను, మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మార్గనిర్దేశం చేశారు.
*లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల్లోని లుకలుకలూ బయటపడుతున్నాయి. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చలు జరుపుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.
*ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం పేరును భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ లైబ్రరీగా మార్చడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎలాంటి కారణం లేకుండా, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా పేరు మార్చడం చెల్లదంటూ 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ మనవడు నజాఫ్‌ అలీఖాన్‌, మరొకరు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.
* దూరప్రాంత రైళ్లలో రద్దీ భారీగా ఉంటుండటంతో జూన్‌, జులై నెలల్లో తొమ్మిది రూట్లలో 94 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలను బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
*పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును పాలిసెట్‌ కన్వీనర్‌ విడుదల చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని గీతం డీమ్డ్‌ వర్సిటీ ప్రాంగణాల నూతన వీసీగా ఆచార్య కె.శివరామకృష్ణ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌ ఆయన్ను అభినందించారని విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.
*పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును పాలిసెట్‌ కన్వీనర్‌ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 6 లోగా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని, తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరై ఇప్పటికే ఫీజు చెల్లించిన వారు మరోసారి కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.
*ఉమ్మడి సర్వీసు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన మాధ్యమిక గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పాఠశాల సహాయకులుగా, కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి కల్పించాలని మాధ్యమిక గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లగుండ్ల శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సంస్థ ఉన్నతాధికారులతో గురువారం సమావేశమవుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
* ఉత్తరాంధ్రలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని ఆర్‌టిజిఎస్‌ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో, చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని, ఇంట్లో విద్యుత్‌ పరికరాలకు దూరంగా ఉండాలని.. ఆర్‌టిజిఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది.