DailyDose

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-06/06

June 06 2019 - Daily Business News - Indian stock markets plunge

* భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు – రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రెట్లును తగ్గించడం దేశీయ మార్కెట్లను కుదిపేసింది. బ్యాంకింగ్ ఆర్ధిక రంగాల షేర్లు అమాంతం పడిపోవడంతో మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీసింది. ఫలితంగా సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ ఏకంగా 553 పాయింట్లకు పైగా నష్టంతో నలభై వేల మార్క్ ను కోల్పోగా నేషనల్ స్టాక్ ఎక్చెంజీ నిప్టీ 11,843 వద్ద ట్రేడింగ్ అయ్యింది. సూచీలు ఒక రోజులో అత్యధిక నష్టాన్ని చవిచూడటం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం
*విశ్లేషకుల అంచనాలను నిజ మ్చేస్తూ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ ఆర్ధిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గురువారం వెల్లడించింది. ఇందులో రేపో రేటు పై పావు శాతం కోత విధించింది. ప్రస్తుతం రేపో రేటు ఆరు శతం ఉండగా తాజా నిర్ణయంతో అది 5.75 శాతానికి చేరింది.
*గత ఆర్థిక సంవత్సరంలో (2018-19) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపేణా 9.15 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)ను సేవా రంగం ఆకర్షించింది.
*భారత్‌ సేవా రంగ వృద్ధి మందగమనం పాలైంది. ఎన్నికలు దీర్ఘకాలం సాగడం, కొత్త కాంటాక్టులు ఎక్కువగా రాకపోవడం ఇందుకు కారణం.
*పరుపులు ఉత్పత్తి చేసే సెంచురీ మ్యాట్రెసెస్‌ హైదరాబాద్‌లోని తన ఉత్పత్తి కేంద్రంలో సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేసింది.
* రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త. క్రికెట్‌ అభిమానుల కోసం కొత్త ఆఫర్‌ను జియో ప్రకటించింది.
*దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన వాణిజ్య పత్రాల(సీపీ) రేటింగ్‌ను క్రిసిల్‌ తగ్గించింది.
*భారత్‌ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అయిదేళ్ల కనిష్ఠ స్థాయి (5.8%)కి పడిపోయిన నేపథ్యంలో, తాజాగా ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన అంతర్జాతీయ ఆర్థిక నివేదిక కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి తీపి కబురు అందించింది.
*రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికీ తప్పనిసరిగా ఉండాల్సిన థర్ట్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని పెంచుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిర్ణయం తీసుకుంది.
*దేశంలోని ఇంకా పలు నగరాల్లో విద్యుత్తు బస్సులు నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కొచ్చి వంటి ప్రాంతాల్లో విద్యుత్తు బస్సులు నడుస్తుండగా, కాలుష్య నియంత్రణ కోసం మరిన్ని నగరాలకు వీటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త. క్రికెట్‌ అభిమానుల కోసం కొత్త ఆఫర్‌ను జియో ప్రకటించింది.
*దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన వాణిజ్య పత్రాల(సీపీ) రేటింగ్‌ను క్రిసిల్‌ తగ్గించింది.