DailyDose

తెదేపా-వైకాపా మధ్య ఘర్షణ–నేరవార్తలు–06/06

June 06 2019 - Daily Crime News - Guntur YSRCP And TDP Fight

* గుంటూరు టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ ఘర్షలో రెండు శిలా ఫలాకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
*ఏపీలో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్. ఏపీలో సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం సీబీఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసిన జగన్ సర్కార్ రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ఏపీ హోం శాఖ ఉత్తర్వ్యులు జారీ చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు జగన్.
* గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు శిలా ఫలాకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
* ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో గురువారం ప్రమాదం సంభవించింది. ఆలయంలో అన్నదానం, ఇతర సేవల కోసం వాడుతున్న బాయిలర్‌ అనుకోకుండా.. ఒక్కసారిగా పేలిపోవడంతో.. భారీ శబ్దం వచ్చింది. దీంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బాయిలర్‌ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది
* జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన బోగ ప్రభాకర్, లక్ష్మీల కుమారుడు సాయి ప్రసాద్ అనే విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
* ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
* గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మృతి చెందిన ఘటన గురువారం రాయగడ రోడ్డు శివారులో చోటు చేసుకుంది. పట్టణంలోని రాయగడ రోడ్డు శివారులో జ్యోతి ఐటిఐ కి వెళ్లే దారిలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని బిచ్చగాడు మృతి చెందాడు.
* ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో గురువారం ప్రమాదం సంభవించింది. ఆలయంలో అన్నదానం, ఇతర సేవల కోసం వాడుతున్న బాయిలర్‌ అనుకోకుండా.. ఒక్కసారిగా పేలిపోవడంతో.. భారీ శబ్దం వచ్చింది. దీంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో బాయిలర్‌ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది..
* పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని డమ్‌డమ్‌ ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు టిఎంసి నేత నిర్మల్‌ కుందుపై కాల్పులు జరిపి పరారయ్యారని పోలీసులు చెప్పారు.
* కడప జిల్లా కంటైనర్‌ ఢీకొని స్కార్పియో డ్రైవర్‌ మృతి చెందిన ఘటన గురువారం రాజంపేట టౌన్‌ మండల పరిధిలోని ఊటుకూరు వద్ద చోటు చేసుకుంది. ఎపి 9 బి వై 5566 నెంబరు ఉన్న స్కార్పియో రాజంపేట నుండి శ్రీకాళహస్తి కి వెళుతుండగా.. వెనుక నుండి ఎంహెచ్‌ జి3యు5894 నెంబర్‌ ఉన్న కంటైనర్‌ అయ్యప్ప స్వామి గుడి వద్ద స్కార్పియో ను పక్కగా ఢీకొంటూ దాటి వెళ్ళింది.
* పెనుకొండ మండలం మోటువారిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగేష్ గుట్టురు దగ్గర కర్ణాటక RTC బస్ ఆటోని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి.
* విద్యుత్‌ స్తంభం విరిగిపడి యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రంపచోడవరం – మారేడుమిల్లి రహదారిలో చోటు చేసుకుంది. తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం – మారేడుమిల్లి రహదారిలో చెట్టు కొమ్మ విరిగి, విద్యుత్‌ లైన్‌ పై పడింది.
* అనంతపురం. సంకేపల్లి క్రాస్ వద్ద ఆటో కారు ఢీ. ఆటోలో ప్రయాణిస్తున్న రాళ్ళ అనంతపురం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి మృతి,ద్దరికి గాయాలు. ర్తి వివరాలు తెలియాల్సి ఉంది
* కదిరి జాతీయ రహదారిపై నల్లబోయనపల్లి వద్ద కారు..ఆటో ఢీ. ఒక్కరు మృతి. మరొకరికి తీవ్రగాయాలు.
* పరిగి మండలం గణపతిపల్లిలో విషాదం . విద్యుత్ వైర్లు తగిలి వడ్డే హనుమంతరాయప్ప (47)మృతి. అతని భార్య జయసుధ , సోదరుడు రామంజినేయులుకు గాయాలు .
* అనంతపురం రూరల్ ఆకుతోటపల్లి శివాలయం దగ్గర super xl ని డీ కొన్న బొలెరో .ఇద్దరికి తీవ్రగాయాలు.ఆసుపత్రికి తరలింపు.
* తాడపత్రి అనంతపురం వెల్లే ప్రదాన రహదారి లో శింగనమల మండలం శివపురం గ్రామం వద్ద శేషు రోడ్డుపై నడుచుకుంటూ పోతుండగా గుర్తు తెలియని కారు డీ కొట్టింది దీంతో శేషు తీవ్ర గాయాల పాలయ్యాడు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
* వేములపల్లి మండలం సల్కనూరులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. శ్రీను అనే వ్యక్తిని కొందరు దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
*కడప జిల్లా రైల్వేకోడూరులో బుధవారం ఉదయం ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.
*లోక్‌సభ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నిమ్తాలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వార్డు అధ్యక్షుడు నిర్మల్‌ కుందూ(36) హత్యకు గురయ్యారు.
*తెలంగాణకు చెందిన యువ నావికుడు ఒకరు మహారాష్ట్రలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మల్‌ జిల్లా పార్ది గ్రామానికి చెందిన ఆకాశ్‌ సాయినాథ్‌ కన్నాల(19) నౌకాదళంలో ‘డైరెక్ట్‌ ఎంట్రీ ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌’ కోర్సు అభ్యసిస్తున్నారు.
*కోల్‌కతా, ముంబయి మధ్య నడిచే షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు సంబంధ పదార్థాలను గుర్తించారు.
*హడలెత్తిస్తున్న ఎండ వేడికి తాళలేక కారులో సేద తీరాలని ప్రయత్నించిన ఓ బాలుడు అందులోనే ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్రలోని అకోలా జిల్లా ఆలెవాడీ గ్రామంలో మంగళవారం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
*అగ్ని ప్రమాదం కారణంగా సంగారెడ్డి జిల్లా జిన్నారంమండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని స్పార్‌ ల్యాబ్‌ పరిశ్రమ దగ్ధమైంది.
*పిల్లల మధ్య స్మార్ట్‌ఫోన్‌ తగాదా ఓ బాలిక ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం చినకొండాయపాలేనికి చెందిన గోరంట్ల విజయలక్ష్మి (13) బొగ్గరం ఏడో తరగతి పూర్తి చేసింది.
*మనవళ్లు, మనవరాళ్లకు నీతి కథలు చెప్పాల్సిన తాత నీతిబాహ్యమైన పని చేశాడు. సొంత మనవరాలిపైనే అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశాడు. 72ఏళ్ల వయసులో… ఆ దుర్మార్గుడి కబంధ హస్తాల్లో 16ఏళ్ల బాలిక ప్రాణాలొదిలింది. అంతచేసీ మనవరాలు ఆత్మహత్య చేసుకుందని నమ్మించజూశాడు. పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. దారుణ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో గత నెల 30న చోటుచేసుకుంది.
*తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
*నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజుల శిశువు అదృశ్యమైన కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. ఆ పసికందును తల్లి ఒడికి చేర్చారు.
*నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట ఎంపీటీసీకి భాజపా అభ్యర్థిగా పోటీచేసిన వరలక్ష్మిపై బుధవారం రాత్రి తెరాస కార్యకర్తలు దాడి చేశారు.
*తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురికి విద్యుదాఘాతమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పరిగి మండలం గణపతిపల్లిలో చోటుచేసుకుంది.
సతీష్‌‌లుగా పోలీసులు గుర్తించారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి
*ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగమర్రి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
* యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసె గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని కోళ్లఫారం షెడ్డు కూలడంతో గొర్ల శ్రీను అనే వ్యక్తి మృతి చెందారు. దేవరకొండలో, చందంపేట, కొండమల్లెపల్లిలో గాలిదుమారం రేగింది.
*నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం సల్కనూరులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. శ్రీను అనే వ్యక్తిని కొందరు దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్‌లో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. బైక్‌లను దొంగతనం చేస్తున్న నిందితును అదుపులోకి తీసుకున్నారు.
* ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది.
* గుజరాత్‌లోని నౌసారి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు.
* పశ్చిమ బెంగాల్‌లోని కుచ్‌ బెహార్‌లో బుధవారం ఘోరం జరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు అజిజర్‌ రహ్మన్‌ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై తృణమూల్‌ నాయకులు స్పందించారు.
* రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడియారం, మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండలం వడియారం రైల్వేస్టేషన్ 566/1-2మైలు రాయి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు, ఈ ఘటనలో మృతిడికి రెండు చెతులు, రెండు కాళ్లు శరీరం ముక్కలైనట్లు, మృతుడికి తెల్ల గడ్డం, తెల్ల మీసాలు, చోక్కపైన సికింద్రాబాద్ DRK టైలర్ పేరు ఉందని పోలీసులు తెలిపారు.
* ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్‌ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
* తెలంగాణలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. యాదాద్రిలో కాంగ్రెస్‌ నేత ఇల్లును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మహబూబూనగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చాలా గ్రామాల్లో పరిస్థితిలు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి
*గార్ల మండలంలోని పెద్దకిష్టాపురంలో రూ.50లక్షల విలువైన టేకు దుంగలు దగ్ధమైన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
*నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండల కేంద్రంలో బుధవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ రోటోవేేటర్‌లో పడి పవార్‌ షంక(12) అనే బాలిక మృతి చెందింది.
*హైదరాబాద్‌-వరంగల్‌ ప్రధాన రహదారి జనగామ పట్టణ శివారు బైపాస్‌ రోడ్డుపై బుధవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.