DailyDose

జ‌గ‌న్ మంత్రివర్గం ఇదేనట–రాజకీయ-06/06

June 06 2019- Daily Political News - Here comes Jagans New Cabinet

* ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డ్రీం కేబినెట్ సిద్ద‌మైంది. అన్ని ప్రాంతాలు..సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోని తీసుకొని జ‌గ‌న్ తుది రూపు ఇస్తున్నారు. ఎన్నిక‌ల వేళ‌..అభ్య‌ర్దుల ఎంపిక‌లో ఎంత ప‌క్కాగా స‌మీక‌ర‌ణాల వారీగా ఖ‌రారు చేసారో అదే ఫార్ములాను ఇప్పుడు అనుస‌రిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ‌గా ఉండటంతో పోటీ సైతం ఎక్కువ గానే ఉంది. దీంతో..సీనియ‌ర్ల‌..జూనియ‌ర్ల స‌మ‌తూకంతో కేబినెట్ ఖ‌రారు చేస్తున్నారు. తాను త‌న టీంను ఏర‌కంగా ఎంపిక చేసుకుందీ జ‌గ‌న్ రేపటి స‌మావేశంలో వెల్ల‌డించ‌నున్నారు.
జ‌గ‌న్ కూర్పు ఇలా..
జ‌గ‌న్ త‌న డ్రీం కేబినెట్‌ను ఎంపిక చేసుకోవ‌టంలో సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప‌క్కాగా ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అదే స‌మ‌యంలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో మంత్రుల సంఖ్య పెంచుతున్నారు. సీనియ‌ర్లు..జూనియ‌ర్లును క‌ల‌గ‌లుపుతూ.. అదే స‌మ‌యంలో మ‌హిళ‌లు..ఎస్సీ-ఎస్టీల‌కు ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండా చూసుకుంటూ..ప్ర‌తీ సామాజిక వ‌ర్గానికి అవ‌కాశం క‌ల్పించేలా జ‌గ‌న్ తుది రూపు ఇస్తున్నారు. ఇక, సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకుంటే మొత్తం 25 మందితో ఏర్పాటు చేసే ఈ కేబినెట్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఏడు స్థానాలు, బీసీ వ‌ర్గాల‌కు ఆరు స్థానాలు, క‌మ్మ వ‌ర్గానికి రెండు బెర్తులు, ఎస్సీ మాల‌- 1, ఎస్సీ-మాదిగ‌-1, ఎస్టీ-1, క్ష‌త్రియ‌-ముస్లిం మైనార్టీ-బ్రాహ్మ‌ణ‌- వైశ్య వ‌ర్గాల‌కు ఒక్కో స్థానం చొప్పున బెర్తులు కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తోంది.
వ‌ర్గాల వారీగా అవ‌కాశాలు ఉన్న‌వారు..
రెడ్డి వ‌ర్గం నుండి ఏడుగురికి అవ‌కాశం ఇస్తే..ఆ వ‌ర్గం నుండి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, మేక‌పాటి గౌతం రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, శిల్పా చ‌క్రపాణి రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక‌, బీసీ వ‌ర్గానికి చెందిన ఆరు బెర్తులు..త‌మ్మినేని సీతారం, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, పి పార్ధసార‌ధి, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ముత్యాల నాయుడు, కాపు రామ‌చంద్రారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. క‌మ్మ వ‌ర్గం నుండి కొడాలి నాని, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోనున్నారు. ఎస్సీ మాల వ‌ర్గం నుండి మేక‌తోటి సుచ‌రిత, తూర్పు గోదావ‌రి నుండి విశ్వ‌రూప్ ముందంజ‌లో ఉన్నారు. ఇక‌, ఎస్టీ మాదిగ వ‌ర్గం నుండి ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆదిమూల‌పు సురేష్‌కు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఎస్టీ వ‌ర్గం నుండి కురుపాం ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ వాణి పేరు వినిపిస్తోంది. క్ష‌త్రియ వ‌ర్గం నుండి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ప్ర‌సాద‌రాజు, ముస్లిం మైనార్టీ కోటాలో తాజాగా జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన ఇక్బాల్‌, బ్రాహ్మ‌ణ వ‌ర్గం నుండి కోన ర‌ఘుప‌తి లేదా మ‌ల్లాది విష్ణు, వైశ్య వ‌ర్గం నుండి కొల‌గ‌ట్ల వీర‌భ్ర‌ద స్వామి పేర్లు రేసులో తుది జాబితా వ‌రకు ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.
**కాపు కోటాలో వీరేనా..రేపు ఫైన‌ల్..
ఇక‌, జ‌గ‌న్ కేబినెట్‌లో కాపు వ‌ర్గానికి రెండు సీట్లు ఇస్తార‌ని చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర నుండి మాజీ ఎంపి..ప్ర‌స్తుత భీమ‌లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు, కాకినాడ రూర‌ల్ నుండి గెలిచిన కుర‌సాల క‌న్న‌బాబు లేదా దాడిశెట్టి రాజాల్లో ఒక‌రికి ఛాన్స్ దక్కే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ కేబినెట్‌లో ఉత్త‌రాంధ్ర నుండి అయిదుగురు, రాయ‌ల‌సీమ నుండి సీఎం జ‌గ‌న్ కాకుండా మ‌రో అయిదుగురు, కోస్తాలోని ఆరు జిల్లాల నుండి సామాజిక‌వ‌ర్గాల వారీగా ప‌దిహేను మందికి చాన్స్ ద‌క్క‌నుంది. ఇక‌, శుక్ర‌వారం జ‌గ‌న్ ఏర్పాటు చేసిన పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో తన కేబినెట్‌లో ఎవ‌రికి ఛాన్స్ ఇస్తుందీ..త‌న ల‌క్ష్యాలు..ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అంశాలు వివ‌రించ‌టంతో పాటుగా మంత్రుల పేర్లు ప్ర‌క‌టించ‌నున్నారు. ఇక‌, డిప్యూటీ స్పీక‌ర్‌గా మ‌హిళ‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.
*కాంగ్రెస్ కి మరో ఎమ్మెల్యే గుడ్ బై
తెలంగాణలో కాంగ్రెస్ కి మరో అవమానం ఎదురవుతున్నట్టే కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ విలీనం తప్పదంటూ ఊహాగానాలు వస్తున్నాయి. నల్గొండ ఎంపీగా గెలిచినా ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున పందొమ్మిది మంది గెలిచారు. వీరిలో పదకొండు మంది ఇప్పటికే గులాబీ కండువా కప్పెసుకున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అధికార పార్టీతో టచ్ లో వెళ్ళడం కలకలం రేపుతోంది.
* జన సేన పార్టీ కార్యాలయం లో ముగిసిన కోర్ కమిటీ సమావేశం
మరి కాసేపట్లో ప్రారంభం కానున్న పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా జన సేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు సమావేశం. జన సేన పార్టీ సమీక్ష సమావేశంలు 6తేది .కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, 7వ తేది తూర్పు గోదావరి, జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా 8వ తేది విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా 9వ తేది రాయలసీమ కడప జిల్లా, కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా
* సీఎల్పీని తెరాసలో విలీనం చేయండి
సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటూ హస్తం గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. అనంతరం ఈ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
* అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా’: జగన్‌
అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆశాఖ అధికారులతో తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు కూడా వెనకడుగు వేయవద్దని సూచించారు.
* భాజపాలో చేరిన బంగ్లాదేశ్‌ నటి
బంగ్లాదేశీ ప్రముఖ నటి అంజు ఘోష్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంజు ఘోష్‌ ప్రస్తుత పౌరసత్వం గురించి మీడియా ప్రశ్నించింది. అయితే ఇందుకు సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు.
* సమయం మించిపోయింది!: మాయావతి
దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. 45 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందన్న విషయాన్ని నివేదికలు స్పష్టం చేశాయని ఆమె గుర్తు చేశారు. ‘‘దేశంలో నిరుద్యోగ రేటు 6.1కి చేరిందని, 45 ఏళ్లలో ఇంతగా నిరుద్యోగం ఉండడం ఇదే మొదటిసారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసి, ఈ ప్రతికూల విషయంపై నిర్ధారణ ఇచ్చింది. కానీ, సమయం మించిపోయింది. పేదరిక, నిరుద్యోగ బాధితులు ఇప్పుడు పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. జరిగిపోయిన విషయాన్ని గురించి బాధపడడం వల్ల లాభం లేదు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
* సమయం వచ్చే వరకు వేచి చూడాలి- వీహెచ్‌
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అధైర్యపడవద్దని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. గురువారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేదని, ప్రధానమంత్రి మోదీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరని ఆయన అన్నారు. సమయం వచ్చే వరకు వేచి చూడాలన్నారు. పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆయారాం గయారాంలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని వీహెచ్‌ పేర్కొన్నారు.
* సమయం వచ్చే వరకు వేచి చూడాలి: వీహెచ్‌
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అధైర్యపడవద్దని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. గురువారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేదని, ప్రధానమంత్రి మోదీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరని ఆయన అన్నారు. సమయం వచ్చే వరకు వేచి చూడాలన్నారు. పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆయారాం గయారాంలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని వీహెచ్‌ పేర్కొన్నారు.
*449 జడ్పీటీసీల్లో తెరాస పాగా
రాష్ట్రంలో మొత్తం 538 జడ్పీటీసీలు ఉండగా 449 (83 శాతం) స్థానాలు తెరాస పరమయ్యాయి. అలాగే మొత్తం ఎంపీటీసీలు 5,817 ఉండగా 3,548(61 శాతం) చోట్ల తెరాస విజయదుందుభి మోగించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఎక్కడికక్కడ ఫలితాలను ప్రకటించగానే ఆయా రిటర్నింగ్‌ అధికారులు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసినా పలువురు ఆర్‌వోలు అలా చేయలేదు. అందువల్లనే అధికారికంగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.
*ఏపీ మంత్రివర్గంపై ఉత్కంఠ
మరో రెండ్రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరనుంది. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి, జగన్‌కు విధేయులుగా ఉండటం.. గతంలో ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చినా కాదనుకుని జగన్‌ వెంటే నడవటం.. వంటి పలు అంశాల ఆధారంగా ఎవరికివారు మంత్రి పదవి దక్కుతుందని ఆశావహంగా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం మొత్తాన్ని ఒకేసారి ఏర్పాటు చేయనున్నారని వైకాపా సీనియరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
*ముందే జడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక
‘ఇంతక్రితందాకా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేసిన తర్వాతే కో-ఆప్టెడ్‌ సభ్యుల్ని; మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని; జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌లను ఎన్నుకునేవారు. దీని కోసం పాత పాలకవర్గాల పదవీ కాలం అయిపోగానే మొదటి సమావేశం నిర్వహించేవారు. ఇప్పుడు చట్ట సవరణతో మార్పులు వచ్చాయి. ఈనెల 7న ఎంపీటీసీ సభ్యులు, 8న జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేయకుండానే ప్రత్యేక సమావేశాల్లో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకొంటారు. వీరంతా ప్రమాణం చేయాల్సిన మొదటి సమావేశం ఎప్పుడనేది తర్వాత వెల్లడిస్తాం’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ వెల్లడించారు.
*ఆరు జిల్లాల్లోనే ఉత్కంఠ
తెరాస తరఫున జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరింది. ఆరు జిల్లాలు మినహా మిగిలిన 26 చోట్ల ఈ ప్రక్రియ బుధవారం పూర్తయినట్లు తెలిసింది. 32 జిల్లా పరిషత్‌లను గెలిచే బలం గల తెరాస.. ఛైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపిక కోసం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించింది. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌ఛార్జులు అభ్యర్థులతో సమావేశమై ఈ వివరాలు తీసుకుంది. మంగళవారానికే 25 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయగా బుధవారం నల్గొండకు బండా నరేందర్‌రెడ్డి పేరును ఖాయం చేసింది. మిగిలిన జిల్లాల సభ్యులతో గురువారం మరోసారి సమావేశమై అభ్యర్థులను ఖరారు చేస్తారు.
*హుజూర్‌నగర్‌పై తెరాస గురి
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో జరిగే ఉప ఎన్నికలో పాగా వేయాలని తెరాస భావిస్తోంది. మిగిలిన పార్టీల కంటే ముందుగా ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. హుజూర్‌నగర్‌ స్థానంలో 2014, 2018 ఎన్నికల్లో తెరాస ఓడిపోయింది. 2014, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీకి మెజార్టీ రాలేదు. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ఈ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు దక్కడం తెరాస వర్గాలకు ఆనందం కలిగిస్తోంది.
*పీసీసీ పదవిపై ఆశ లేదు- కోమటిరెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆశ లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేస్తారన్న వార్తపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ప్రజలు తనను ఎంపీగా గెలిపించి పీసీసీ కన్నా పెద్ద పదవిని కట్టబెట్టారని చెప్పారు.
*వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి
వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. లోక్‌సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీగా ఎన్నికైన పీవీ మిథున్‌రెడ్డిని, చీఫ్‌ విప్‌గా రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైన మార్గాని భరత్‌ను నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖను పంపినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. లోక్‌సభకు 22 మంది వైకాపా తరఫున ఎన్నికవగా.. రాజ్యసభలో ఇప్పటికే ఇద్దరు సభ్యులు ఉన్నారు.
*వివాదంలో గహ్లోత్‌ సర్కారు
విద్యార్థులకు నిర్వహించే ఉపకార వేతన పరీక్ష నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరు తొలగించడం ద్వారా రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త వివాదానికి దారితీసింది. పదోతరగతి సాంఘికశాస్త్ర పుస్తకంలో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను ‘పోర్చుగల్‌ పుత్రుడు’ అని కూడా ఇంతకుముందు గహ్లోత్‌ సర్కారు అభివర్ణించింది. భాజపా సర్కారు ఎలాంటి కారణం లేకుండానే ఉపకార వేతన పరీక్షకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరు పెట్టిందని, అందుకే ఆ పేరు తీసేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ దోతసారా చెప్పారు.
*పార్లమెంట్‌ సమావేశాల్లో సహకరించండి
ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో సహకారం అందించాలని కాంగ్రెస్‌ను కేంద్రప్రభుత్వం కోరింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, వి.మురళీధరన్‌లతో పాటు వెళ్లి రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈదుల్‌ ఫితుర్‌ సందర్భంగా ఆజాద్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌ సహకారాన్ని కోరారు. 16న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్నిపార్టీల సహకారం కోరనున్నట్లు తెలుస్తోంది.
*సీ బిల్లు కోసం తీర్మానం చేయాలి- ఆర్‌.కృష్ణయ్య
పార్లమెంటులో 36 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బీసీల పక్షాన ఏ పార్టీ మాట్లాడకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ తెలంగాణ, ఏపీ శాసనసభల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు.
* కేటీఆర్‌ను కలిసిన రోహిత్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పనున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇదివరకే టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపిన రోహిత్‌రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయినట్టుగా సమాచారం. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
* ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కోలగట్ల వీరభద్రస్వామి
వైసీపీ కీలకనేత కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం అసెంబ్లీ నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం శాసనమండలి ఇంచార్జ్‌ కార్యదర్శికి వీరభద్రస్వామి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే మండలి ఇంచార్జ్‌ ఇక ఆమోదించాల్సి ఉంది. కాగా.. 2014 ఎన్నికల్లో కోలగట్ల టీడీపీ అభ్యర్థి మీసాల గీత చేతిలో ఓటమిపాలవ్వడంతో ఆయన్ను వైఎస్ జగన్.. ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపారు.
*హిందీ రుద్దే యత్నం చేయలేదు – కస్తూరి రంగన్
జాతీయ నూతన విద్యా విధానంలో హిందీయేతర రాష్ట్రాల విద్యార్ధుల పై హిందీ బాషను వారి ఇష్టానికి వ్యతిరేకంగా రుద్దేయడం చేయడంలేదని కమిటీ చైర్ పర్సన్ కే.కస్తూరి రంగాన్ స్పష్తం చేశారు. హిందీని ముసాయిదా నుంచి తొలగించడం పై కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. త్రిబాషా విధానం విషయంలో తాము రెండు అభిప్రాయాలకు ఆమోదం తెలిపామని అయితే వాటిలో ఒకటి నూతన విద్యా విధానంలో తాము ఆశించిన భాషా స్పూర్తిని ప్రతిబింబించలేదన్నారు. దాంతో హిందీ ప్రస్తావనలేని పేరాను చేర్చి దానిని తొలగించామని వెల్లడించారు.