Movies

భార్య కాదు తల్లిలా ఉన్నావంటూ…

Netizens troll priyanka saying that she looks like nick jonas mom

బాలీవుడ్‌ – హాలీవుడ్‌లలో ప్రస్తుతం మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రియానిక్‌దే. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా- హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే నిక్‌ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో నెటిజన్లు నేటికీ ఆమెను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేసినప్పుడల్లా.. నిక్‌కు తల్లిలా ఉన్నావంటూ అభ్యంతరకర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి తొలిసారిగా స్పందించిన పిగ్గీ చాప్స్‌ మాట్లాడుతూ.. ‘ నా భర్త కంటే నేను పదేళ్లు పెద్దదాన్ని అనే విషయం గురించి కొంతమంది చెత్తగా వాగుతున్నారు. నేటికీ ఇది కొనసాగుతోంది. అయితే ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తూంటుంది. భార్య కంటే భర్త ఎంత పెద్దవాడైనప్పటికీ ఇటువంటి వాళ్లకు అభ్యంతరం ఉండదు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి మాత్రం విమర్శలతో సిద్ధమైపోతారు’ అని అసహనం వ్యక్తం చేశారు.