Food

కరకరలాడే కొబ్బరి చేగోడీలు

This coconut cruncy savory will be a good snack - Telugu easy fast short snack recipes-కరకరలాడే కొబ్బరి చేగోడీలు

*** కావల్సినవి: బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, తాజా కొబ్బరి తరుగు – అరకప్పు, పెసరపప్పు – టేబుల్‌స్పూను, కారం – చెంచా, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.

*** తయారీ: పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. కొబ్బరి తురుమును నీళ్లు చల్లుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక మూడు చెంచాల నూనె, కొద్దిగా ఉప్పూ, నానబెట్టిన పెసరపప్పూ, కారం, కొబ్బరి ముద్ద, బియ్యప్పిండి వేసుకుంటూ కలిపి మంట తగ్గించాలి. రెండు నిమిషాలకు అది గట్టిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది చల్లగా అయ్యాక చేతులకు నూనె రాసి, చేగోడీల్లా చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేగాక తీసేసుకుంటే సరిపోతుంది.