Devotional

దర్శనం తర్వాత ఏమి చేయాలి?

What should you do after darshan in Temple?

1.ఆలయంలో దర్శనం అనంతరం ఏమి చేయాలి
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
*అది ఏమిటంటే..
“అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం.”
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.”అనాయాసేన మరణం”నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.”వినా ధైన్యేన జీవనం”నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. “దేహాంతే తవ సాన్నిధ్యం”
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. “దేహిమే పరమేశ్వరం”
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
2. తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి?
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్‌ పదవికి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వైకాపాలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం సుబ్బారెడ్డిని ఈ పదవిలో నియమించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలిని రద్దు చేసిన తర్వాతే అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రమంత్రివర్గ సమావేశం తర్వాత అత్యవసర ఆర్డినెన్స్‌ ద్వారా తితిదే పాలకమండలిని రద్దు చేసి, నూతన పాలకమండలిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. తితిదే ఛైర్మన్‌ పదవిపై సుబ్బారెడ్డి మొదటి నుంచీ ఆసక్తి చూపడం లేదు. రాజ్యసభ సీటు ఇస్తారని ఆయన ఆశించారు. కానీ, పార్టీపరంగా ఇతరులకిచ్చిన హామీలుండడంతో రెండేళ్ల వరకూ ఆ సీటు సుబ్బారెడ్డికి ఇచ్చేందుకు అవకాశం లేదని వైకాపా అధిష్ఠానం భావిస్తోంది. అందువల్లే ఇప్పుడు తితిదే ఛైర్మన్‌గా వెళ్తే, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించడంతో వైవీ అంగీకరించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఒంగోలు ఎంపీ సీటును ఆశించారు. పార్టీ అంతర్గత వ్యవహారాల నిర్వహణకు ఆయన కీలకం కావడం, ఉభయగోదావరి జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు ఉండడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైవీ సుబ్బారెడ్డికి అవకాశం లభించలేదు.
3. రేపు డయల్‌ తితిదే ఈవో కార్యక్రమం
తితిదే ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య ‘డయల్‌ తితిదే ఈవో’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు తితిదే ఆలయాలకు సంబంధించిన సమస్యలను, సందేహాలను ఈవో వద్ద ప్రస్తావించవచ్చు. తిరుమలలోని అన్నమయ్య భవన సమావేశమందిరం నుంచి ఈవో సింఘాల్‌ ఫోన్‌ఇన్‌లో పాల్గొంటారు. భక్తులు ఫోన్‌ చేయాల్సిన నెంబరు 0877- 2263261.
4. చరిత్రలో ఈ రోజు జూన్, 06
** సంఘటనలు
1515 – శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.
** జననాలు
1699: అజీజుద్దీన్ అలంఘీర్, మొఘల్ చక్రవర్తి. (మ.1759)
1877: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, ప్రముఖ మలయాళ కవి.(మ.1949)
1890: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)
1902: కె.ఎల్.రావు, ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)
1909: చోడగం మ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు (మ.1999).
1915: చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలోనాయకుడు. (మ.1994)
1915: విక్రాల శేషాచార్యులు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, కవి.
1929: సునీల్ దత్, భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005)
1936: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)
1947: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)
1956: జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
1976: జ్యోతిరాణి. జి, రంగస్థల నటి.
** మరణాలు
1897: కోరాడ రామచంద్రశాస్త్రి, క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816)
1897: కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852)
1976: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902)
1979: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (జ.1912)
2001: కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
2015: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984)
5. వైభవంగా రాములోరి నిత్య కల్యాణం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రాములోరి నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. వేకువ జామునే రామాలయం తలుపులు తీసిన అర్చకులు స్వామి వారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, ఆరగింపు గావించారు. తదుపరి భక్తులకు భద్రాద్రి రాముని దర్శనం కల్పించారు. నిత్యకల్యాణ మూర్తులను అందంగా అలంకరించి, పల్లకీపై ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని వేంచేయింపజేసి సాంప్రదాయబద్ధంగా స్వామి వారి కల్యాణ క్రతువును జరిపారు. భక్తరామదాసు వారు చేయించిన బంగారు ఆభరణాలను శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ధరింప జేసి శోభయామానంగా రామయ్య కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.