WorldWonders

న్యూయార్క్ వెళ్తున్న నిజాం నగలు

Nizam Jewellery To Be Displayed In New York

నిజాం నవాబుల నగలను ఈ నెల 14 నుంచి న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. నిజాం నవాబులు ధరించిన నెక్లెస్, గోల్కొండ వీధుల్లో కొనుగోలుచేసిన వజ్రంతోపాటు మొఘల్ చక్రవర్తి షాజహాన్ వినియోగించిన కత్తి, హైదరాబాద్ దక్కన్ పాన్‌బాక్స్‌తోపాటు వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలెన్నో ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. మొఘల్, నిజాం నవాబులతోపాటు పలు రాజ కుటుంబాలకు చెందిన సుమారు 400 రకాల ఆభరణాలు, వజ్రాలు, కత్తులు, బంగారు కప్పులు, తైలవర్ణ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ద అల్ థాని కలెక్షన్ ఫౌండేషన్ సేకరించిన ఈ ఆభరణాలను న్యూయార్క్‌కు చెందిన క్రిస్టీస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈ నెల 19న ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నది. ఒక్కో ఆభరణం విలువను రూ.కోటి నుంచి రూ.20 కోట్ల వరకు నిర్ణయించారు. వేలం ద్వారా వచ్చే నిధులను ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, పుస్తక ప్రచురణలు, మ్యూజియాల నిర్వహణకు, విద్యార్థుల చదువులకు, స్కాలర్‌షిప్‌లు తదితరాలకు వినియోగించనున్నారు.