Food

శీతల పానీయాల బదులు పండ్ల రసం తాగితే?

Please do not go with cool drinks. Instead replace them with fruit juices.

కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త. ఏ కాలమైనా సరే చాలామంది ఎంతో ఇష్టంగా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఎండాకాలంలో అయితే మరీనూ.. దీని వల్ల దాహం తీరుతుంది కానీ, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు అమాంతం పెరుగుతుంది. కూల్ డ్రింక్స్‌లో ఎక్కువ కెలోరీలు, చక్కెర శాతంలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల షుగర్, ఊబకాయం, గుండెసమస్యలు వచ్చే ప్రమాదముంది. బరువు తగ్గాలనుకునేవారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ తింటాం. దాంతో.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. ఇందులోని కెమికల్స్ శరీరానికి చెడు చేస్తాయి.. వీటిని ప్రూవ్ చేసేందుకు చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ కూడా పెడుతున్నారంటే అవేంటంటే.. కూల్ డ్రింక్స్ తో ఇంట్లోని సింక్స్ క్లీన్ చేయడం. అంటే.. యాసిడ్‌కి బదులు వీటిని వాడడం అన్నమాట. ఇప్పుడైనా అర్థం చేసుకోండి.. చల్లని ఈ జలం.. నోట్లోకి వెళ్లగానే గరళంగా మారి ప్రాణాలమీదకి తెస్తుందని. కూల్‌డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు నీటిని తీసుకోండి.. లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. దీనివల్ల అనారోగ్యం దూరమై ఆరోగ్యవంతులుగా మారతారు.