Politics

నేను జనసేన వీడను

Rapaka Says He Will Stay With Janasena And Pawan Kalyan

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మెరుగైన స్థానాలు కైవసం చేసుకుంటుందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ధీమా వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నేతలతో పవన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గెలుపే ముఖ్యం.. మీరు ఎలా వెళ్లినా ఫర్వాలేదని పవన్‌ చెప్పడంలేదని.. సిద్ధాంతపరంగా పనిచేయాలని సూచిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. జనసేన సిద్ధాంతపరంగా పనిచేసే పార్టీ అన్నారు. తాను వైకాపాలో చేరట్లేదని.. జనసేనలోనే ఉంటానని రాపాక స్పష్టంచేశారు. వైకాపాలోకి వెళ్తే నా నంబర్‌ 152. జనసేనలో ఉంటే నా నంబర్‌ 1 అని ఇది వరకే చెప్పానని ఆయన గుర్తుచేశారు. జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారి కలిసిన రాపాక వరప్రసాద్‌కు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.