Politics

మంత్రుల శాఖలు ఖరారు….హోంమంత్రి ఎవరంటే?

Here Is The Official Full List Of YS Jagans 2019 Cabinet

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. 25 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే, మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ జగన్‌ గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఆయన మంత్రుల శాఖలకు ఆమోదం తెలిపారు.
**మంత్రులు-శాఖల వివరాలు..
మేకతోటి సుచరిత-హోంశాఖ(డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి-ఆర్థిక శాఖ
అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ
బొత్స సత్యనారాయణ – మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ,
ధర్మాన కృష్ణ దాస్‌- రోడ్లు, భవనాలు
అనిల్‌ కుమార్‌ యాదవ్‌ -జలవనరుల శాఖ
మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం
పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ -రెవెన్యూ శాఖ(డిప్యూటీ సీఎం)
కన్నబాబు – వ్యవసాయ శాఖ
పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం(డిప్యూటీ సీఎం
తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం
కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ
పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం
ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ(డిప్యూటీ సీఎం)
పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ
ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ
బాలినేని శ్రీనివాస్‌ – అటవీ,పర్యావరణం
గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌
శంకర్‌ నారాయణ-బీసీ సంక్షేమం
అంజాద్‌ బాషా- మైనారిటీ వ్యవహారాలు(డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి-ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు(డిప్యూటీ సీఎం)
వెల్లంపల్లి శ్రీనివాసరావు-దేవాదాయ శాఖ
Here Is The Official Full List Of YS Jagans 2019 Cabinet