DailyDose

కోడెల శివరాంపై కేసు నమోదు-నేరవార్తలు–06/07

June 08 2019 - Daily Crime News - Case filed against Kodela Sivaram Over K Tax Issues

*కే’ ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అధికార బలంతో అణచివేతకు గురైన గొంతులు నేడు గళం విప్పుతున్నాయి. లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
* హర్యానాలో ఫరిదాబాద్‌లోని దబువాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందారు.
* పామిడి మండలం కత్రిమల గ్రామంలో వెంకటేష్ నాయక్ అనే రైతుకు చెందిన చెరుకు తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.. దాదాపు 4 లక్షల ఆస్తి నష్టం….
* అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం N S గేట్ వద్ద 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా ఒకరు మృతి ….ఇంకొకరికి గాయాలు.
* నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
* తిరుమలగిరి పరిధి విలేజ్‌ బస్తీలో ఓ వ్యక్తి అనుమానాస్పదరీతిలో మృతిచెంది పడిఉన్నాడు. మృతుడిని బ్లూ డార్ట్‌ కొరియర్‌ సూపర్‌వైజర్‌ ఎం.ఎ.దాస్‌(62)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
* హర్యానాలోని మహేంద్రఘర్ జిల్లాలోని నైవాజ్ నగర్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఓ కోడలు తన అత్తను తీవ్రంగా చితకబాదింది. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ అమ్మాయి.. తన సెల్‌ఫోన్‌లో బంధించి వైరల్ చేసింది.
* మధ్యప్రదేశ్‌లోని జోషి బాబా అటవీ ప్రాంతంలో 15 కోతులు మృతి చెందాయి. కోతుల మృతికి వడదెబ్బే కారణమని అటవీశాఖ అధికారులు తేల్చారు.
*నేపాల్‌లోని సుదూర్‌పశ్చిమ్‌ ప్రావిన్సులో వీచిన గాలి దుమారం ధాటికి ఇద్దరు మృతిచెందగా, 99 మంది గాయపడ్డారు. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు, స్తంభాలు నేల కూలడంతో రహదారులు మూసుకుపోయాయి.
*గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన లైసెన్స్‌డ్‌ సర్వేయరు తాడిగిరి శామ్యూల్‌ సుకుమార్‌ (34) హత్యకు గురయ్యారు.
*గుంటూరు నుంచి తెలంగాణ రాష్ట్రానికి తరలుతున్న లూజు పత్తి విత్తనాలను శుక్రవారం వ్యవసాయాధికారులు పట్టుకున్నారు.
*జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు జైష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రవాదులు మరణించారు. పంజ్రాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందగా భద్రతా బలగాలు అక్కడికి వెళ్లాయి. ముష్కరులు దాడికి దిగారు.
*సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ఎగవేత వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్‌లోని హీరాగ్రూప్‌ సంస్థలపై శుక్రవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం దాడులు నిర్వహించింది.
*పాత కక్షల నేపథ్యంలో దాడి చేసిన దుండగులు 20 రోజుల నవజాత శిశువును కొట్టి చంపిన దారుణమిది. గుజరాత్‌లోని మేఘని నగర్‌ ప్రాంతంలో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.
*హైదరాబాద్‌లో మరో భారీ హవాలా రాకెట్‌ బయటపడింది. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహించిన మధ్య మండలం పోలీసులకు రూ.1.4 కోట్ల నగదు లభ్యమైంది.
*పండగ సెలవులు పలు భారతీయ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రంజాన్‌ సందర్భంగా దుబాయ్‌లో జూన్‌ 3 నుంచి 6 వరకూ సెలవులు ప్రకటించారు.
*వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష పదవి ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
*చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
*ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురవరాజుపల్లి వద్ద శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో చోటుచేసుకుంది.
*కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మాతృమూర్తి తన ఇద్దరు బిడ్డలతో కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతిచెందగా తల్లి గల్లంతయింది. కుమారుడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఎ.శరభవరం వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
* ఆసుపత్రులలో రోగులకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి 85 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న జర్మన్‌ నర్సుకు అక్కడి కోర్టు జీవితఖైదు విధించింది.
*మానవత్వం మంటగలిసింది. ముక్కుపచ్చలారని చిన్నారి చేతులు విరిచి.. కనుగుడ్లు పెరికి దారుణాతి దారుణంగా హతమార్చారు. అది కూడా కేవలం రూ 5వేల అప్పు విషయమై జరిగిన గొడవలో! ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
* స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సీబీఐ ముగ్గుర్ని అరెస్టు చేసింది. లీకేజీలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అక్షయ్‌కుమార్‌ మాలిక్‌తో పాటు సందీప్‌ మాథుర్‌, ధర్మేంద్రలను అరెస్టు చేశామని సీబీఐవర్గాలు తెలిపాయి. లీకేజీ కేసులో పది మంది ‘సిఫీ టెక్నాలజీస్‌’ ఉద్యోగులతో పాటు 17 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పాయి.
*సాహితీవేత్త ఎం.ఎం.కలబుర్గి హత్య కేసులో ప్రధాన నిందితులు అమోల్‌ కాళే, ప్రవీణ్‌ చతుర్‌లను రెండు వారాలపాటు న్యాయ నిర్బంధానికి పంపించాలని ధార్వాడలోని మూడో జేఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఆదేశించింది.
*వేటు బస్సులోని తీగల్లో రాపిడి కారణంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ముందుగా గుర్తించి అప్రమత్తం చేయడంతో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
*ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేరిట ఫోర్జరీ సిఫార్సు లేఖ సృష్టించడం తితిదే వర్గాల్లో సంచలనం రేపింది.
* నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని మంథన్‌గోడు గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు తండ్రీకొడుకులు మృతిచెందారు.
* ఫరిదాబాద్‌లో గల పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
* అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం N S గేట్ వద్ద 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా ఒకరు మృతి ఇంకొకరికి గాయాలు.
*యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రయివేటు బస్సు బోల్తాపడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.