Business

విమానా ఛార్జీలు పెరుగుతున్నాయంటగా!

India flight charges to see a potential hike

ఇకపై విమాన ప్రయాణ ఛార్జీలు కాస్తా ప్రియం కానున్నాయి. వైమానిక రక్షణ ఛార్జీ (ఏఎస్‌ఎఫ్‌)పేరిట టికెట్‌కు రూ.130 నుంచి 150 వరకు పెంచాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన ఛార్జీలను జులై 1 నుంచి అమలు చేసే అవకాశముంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ఎఏస్‌ఎఫ్‌ చార్జీలను 3.25 అమెరికన్‌ డాలర్ల నుంచి 4.85 అమెరికన్‌ డాలర్లకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం… దేశీయ విమానాల్లో ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ.150 వంతున ఏఎస్‌ఎఫ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణికుల్లో తలకు 4.85 అమెరికన్‌ డాలర్లు వసూలు చేస్తారు. సవరించిన ఛార్జీలు జులై 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని విమానయాన శాఖ తెలిపింది.