ScienceAndTech

ఇప్పటివరకు అంతుచిక్కని భారత వాయుసేన విమానం

Indian Air Force Flight With 13 Crew Members Still Remaing Missing - Indian Government Announces Reward For Any Info

అరుణాచల్‌ప్రదేశ్‌లో జూన్ 3న భారత వాయుసేన విమానం ఎన్-32 అదృశ్యమైన విషయం విదితమే. ఈ విమానంలో13 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఈ విమానానికి సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానానికి సంబంధించిన ఆచూకీ తెలియజేస్తే రూ.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. విమానం అదృశ్యమైనప్పటి నుంచి అధికారులకు దీనికి సంబంధించిన చిన్నపాటి ఆధారాలు కూడా లభ్యంకాలేదు. అందుకే ఈ విమానం ఆచూకీ తెలిస్తే ఎవరైనా సరే వెంటనే చెప్పాలని కోరింది. ఇందుకోసం ఫోన్ నంబర్లు 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 ప్రకటించింది. ఈ నంబర్లకు ఫోన్ చేసి సరైన సమాచారం చెప్పేవారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆర్‌డీ మాథుర్ తెలిపారు. కాగా విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ పేర్కొన్నారు.