Videos

సైన్యానికి ఇలాంటి ఆహారం పెడతారా?

Indian army in Siachen gets the most disgusting weird food

సియాచిన్‌లో భారత సైనికుల తిండి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికల అవస్థలు ఇన్నీ అన్నీ కావు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్‌ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే.. మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితో పాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి.తిండి పదర్దాలు సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ… ఓ జవాన్ ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు.ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ గట్టకట్టుకుపోయింది.. దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం… ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా అయిపోతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.