DailyDose

జగన్‌ను కలుస్తానంటున్న యామిని-తాజావార్తలు–06/10

Sadineni Yamini Says She Will Meet YS Jagan - June 10 2019 - Daily Breaking News

*ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆయన చాంబర్ లో కలిశారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. గుర్తుతెలియని వ్యక్తులు తనపేరుతో నకిలీ పేస్ బుక్ పేజీని క్రియేట్ చేశారని.. అందులో తాను మోడీ, జగన్ ను తిడుతున్నట్టు పోస్ట్ చేశారని.. ఆ పోస్టుతో తనకెలాంటి సంబంధం లేదని.. ఇది నకిలీ పేజీ అని డీజీపీకి ఫిర్యాదు చేశారామె.. ఆ పేజీని క్రియేట్ చేసిన వారు ఎవరో తెలుసుకుని కఠినంగా శిక్షించాలని యామిని డీజీపీని కోరారు. కాగా ఆదివారం ప్రధాని మోదీ తిరుమల పర్యటన సందర్బంగా సీఎం జగన్ ను ఉద్దేశించి యామిని పేరుతో అసభ్యకర సందేశాన్ని పోస్ట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ విషయం తెలుసుకున్న యామిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ పేజీని డిలీట్ చేశారు.
*అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. సుమారు 46 రోజుల పాటు జరిగే యాత్రపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జులై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు జరిగే యాత్రపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. జులై 15 తరువాత జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడా భద్రతా లోపాలు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గత ఏడాదికంటే రెండున్నర రేట్ల భద్రతా మోహరించాలని అధికారులు నిర్ణయించారు. 2017లో 181 కంపెనీలు, 2018లో 213 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు
*తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపిన డేటా చౌర్యం కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థ సిఈవో అశోక్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది.
*బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా తాయారు చేసిన తేలికపాటి ట్రక్కులను ఇషర్ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీఈసివోలో భాగమైన ఇషర్ ఈ వాహనాన్ని విడుదల చేసింది. అత్యంత పోటీ ఉన్న తేలికపాటి ట్రక్కుల విభాగమైన ప్రో 2000 సీరీస్లో వీటిని తీసుకొచ్చింది.
* ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను. ఆంధ్ర ప్రదేశ్‌కు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని నియమించే సూచనలున్నాయని తెలుస్తోంది.కాగా, ప్రధాని మోదీ కొత్త కేంద్ర మంత్రి వర్గంలో సుష్మా స్వరాజ్‌ను తీసుకోకపోవడం.. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్నీ ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
* జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం మేడిపల్లి వీఆర్వో బాపయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు. రికార్డులు సరిచేయడానికి రైతు మహ్మద్ నుంచి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రూ.3వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
* తన వయసు రోజు రోజుకూ తగ్గుతోందంటున్నారు నందమూరి బాలకృష్ణ. సోమవారం ఆయన తన 59వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.
*టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు సోమ‌వారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. తెనాలికి చెందిన శ్రీ సాయిబాలాజి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేత శ్రీ సిహెచ్‌.శివ‌రామ‌కోటేశ్వ‌ర‌రావు ఈ మేరకు విరాళమిచ్చారు. ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతంకు అంద‌జేశారు.
*గుంటూరుజిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
*విశాఖపట్నం రాష్ట్రానికి రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రానున్నట్లు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం సముద్ర అధ్యయన విభాగ నిపుణులు తెలిపారు. ఈనెల 12న రాయలసీమ, 13, 14 తేదీల్లో కోస్తాంధ్రలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు
*నంద్యాల సమీపంలోని దీబగుంట్ల అయ్యలూరు మధ్యలో మట్టి ట్రాక్టర్ ను ఢీకొన్న ఇన్నోవా కారు.కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు.ప్రమాదానికి గల కారణం ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తుంది.
*మహానంది గిద్దలూరు ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం.చెట్టును ఢీకొన్న తుఫాన్ వాహనం,అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు.ఇద్దరి పరిస్థితి విషమం.నంద్యాల ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు.
* పాత కక్షలతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన సోమవారం నెల్లూరు జిల్లా కట్టుబడిపల్లిలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమురు పంచాయతీ వయా కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి నారాయణ అనే వ్యక్తి పై, అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ పాత కక్షలతో దాడి చేశాడు.
* ఈ నెల 17 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వి సుబ్బారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
* పశ్చిమ గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సోమవారం తాళ్లపూడి మండలం లో ఉదయం 6 గంటల నుండి ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షం మాత్రం కురవలేదు. జంగారెడ్డిగూడెం మండలంలో ఉదయం నుండి వర్షం కురుస్తోంది. లక్కవరం ఎస్సి పేటలో సీసీ రోడ్డు నీట మునిగింది. జీలుగుమిల్లిలోనూ వర్షం కురుస్తోంది. టి. నరసాపురం మండలంలో భారీ వర్షం కురిసింది.
* డీఎంకే నాయకులు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామ్ (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం పొద్దున తుదిశ్వాస విడిచారు. రామన్.. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికయ్యారు. 1996 -2000 మధ్య కాలంలో సీఎంగా చేశారు. 2006లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వీరు డీఎంకే కన్వినర్ గానూ పనిచేశారు. 2011 తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జానకి రామన్ మృతికి పలువురు రాజకీయనాయకులు సంతాపం తెలిపారు.
* ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు.
* గొలుసుకట్టు వ్యాపారాలతో(మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌-ఎంఎల్‌ఎం) ప్రజలు తీవ్ర ఆర్థికనష్టాల పాలవుతున్నారని.. వాటిని అరికట్టేందుకు చట్టాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ తెలిపారు.
* పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన తుది పరీక్షలో ఉత్తీర్ణులైనవారి ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
*పీటల దాకా వచ్చిన వివాహ వేడుక ఓ యువకుడి కారణంగా ఆగిపోయింది. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా డోన్‌లో చోటుచేసుకుంది.
*వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.
*పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన తుది పరీక్షలో ఉత్తీర్ణులైనవారి ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
*రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు పడుతాయన్నారు.
*వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. 96.06 శాతం ఓట్లు సాధించి పార్టీకి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. *
*తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరగబోతున్నాయి. ఆదివారం ఇద్దరు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. మరికొందరు సీనియర్‌ ఐఏఎస్‌లు, కలెక్టర్ల మార్పిడికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం కసరత్తు చేసినట్లు తెలిసింది.
*తెలంగాణలోని మాదిగల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కోరింది. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది.
*దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని 1:30కి తగ్గించాలని జాతీయ విద్యావిధానం సూచించింది. పాఠశాల విద్యలో బలమైన పునాది వేసేందుకు వీలుగా ఈ నిర్ణయం అమలు చేసి, వీలైనంత త్వరగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలని ఇటీవలే కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.
* జలవనరులశాఖలో సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను నిగ్గు తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు కొంతమంది నిపుణులతో ఒక జాబితా సిద్ధమయింది. మరికొందరు నిపుణులను కూడా సూచించాలని జలవనరులశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కోరినట్లు సమాచారం.
*ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటించింది. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆదివారం ఐకాస సమావేశం జరిగింది.
*రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500, ప్రకృతి వైపరీత్య నిధికి రూ.2వేల కోట్లు, సహకార డెయిరీలకు పోసే పాలకు లీటరుకు రూ.4 బోనస్‌ తదితర నిర్ణయాలు సాగుదారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అభిప్రాయపడ్డారు.
*ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం ప్రేక్షకుల గ్యాలరీలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన సతీమణి శ్రీశ్రావ్య. భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌ను వీరు తిలకించారు
*పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 9.30- 12.15 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‌www.bseap.org వెబ్‌సైట్‌లో పాఠశాలల లాగిన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి ధ్రువీకరించిన తర్వాత వారికి జారీ చేయాలన్నారు.
*అగ్రిగోల్డ్‌ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏపీ అగ్రిగోల్‌్్డ బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.