Devotional

శ్రీ‌నివాస‌మంగాపురంలో అష్టబంధనం

Ashtabandhanam In Sreenivasa Mangapuram

1. శ్రీ‌నివాస‌మంగాపురంలో అష్టబంధన – ఆద్యాత్మిక వార్తలు
తిరుప‌తి, 2019 జూన్ 11: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మంగ‌ళ‌వారం అష్ట‌బంధ‌న మ‌ర్ధ‌న కార్య‌క్ర‌మం శాస్త్రోక్తంగా జ‌రిగిందిఈ సంద‌ర్భంగా పుణ్యాహ‌వ‌చ‌నం, విష్వ‌క్సేనారాధ‌న‌, సంక‌ల్ప‌పూజ నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఆల‌యంలోని ముఖ మండ‌పంలో అష్ట‌బంధ‌న మ‌ర్ధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అష్ట‌బంధ‌న ద్ర‌వ్యాల‌ను రోటిలో వేసి రోక‌లితో బాగా దంచారు. టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అర్చ‌కుల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారుఆ త‌రువాత బంగారం, న‌వ‌ర‌త్నాలను జెఈవో ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా తీసుకెళ్లి గ‌ర్భాల‌యంలోని మూల‌మూర్తి పాదాల కింద ఉంచారు. అనంత‌రం జెఈవో దంప‌తులు యాగ‌శాల‌ను ద‌ర్శించారుకాగా, బుధ‌వారం సాయంత్రం 3.30 నుండి 5 గంట‌ల వ‌ర‌కు మూల‌వ‌ర్ల‌కు మ‌హాశాంతి అభిషేకం చేప‌డ‌తారు. జూన్ 13న గురువారం ఉద‌యం 5 నుండి 7 గంట‌ల వ‌ర‌కు పూర్ణాహుతి, ప‌ద్మ‌ప్ర‌ద‌క్షిణం, ఉద‌యం 7.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు క‌ర్కాట‌క ల‌గ్నంలో మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ‌, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష‌వాహ‌న సేవ జ‌రుగ‌నున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద భ‌ట్టాచార్య‌లు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌న‌ దీక్షితులు, ప్రధాన కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
2. మునివాహన సేవకు అంతర్జాతీయ గుర్తింపు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌ ‘మునివాహన సేవ’కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆయన గతేడాది ఒక దళిత భక్తుడిని భుజాలపై ఎక్కించుకుని, నగరంలోని జియాగూడ రంగనాథస్వామి ఆలయ ప్రవేశం చేయించారు. ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆన్‌ రెలిజియన్‌ ఫ్రీడం’ జాతీయ కమిషన్‌ ఏటా ‘మత స్వేచ్ఛ’పై రూపొందించే నివేదికలో ప్రస్తావించింది. మతస్వేచ్ఛ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అమలవుతోంది.. వంటి అంశాలను పరిశీలించి ఈ కమిషన్‌ నివేదికను రూపొందిస్తుంటుంది. ఇందులో భాగంగా 2018-19 ఏప్రిల్‌ వరకు అన్ని దేశాల్లో జరిగిన మతపర సంఘటనలు, అట్టడుగు వర్గాలను ఏ విధంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్లారనే అంశాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. ‘భగవంతుని ముందు అందరూ సమానమనే నినాదంతో ఈ సేవ నిర్వహించాం. ఇదే అంశాన్ని అమెరికా ప్రభుత్వ జాతీయ కమిషన్‌ తన నివేదికలో పొందుపరచడం ఆనందం కలిగించింది’ అని రంగరాజన్‌ పేర్కొన్నారు.
3. పూరి రథయాత్ర ప్రత్యక్ష ప్రసారం వేలంపై వ్యాజ్యం
జులైలో జరగనున్న పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని వేలం వేయాలంటూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆలయ పాలనాధికారి, జిల్లా కలెక్టర్‌ను ఇందులో కక్షిదారులుగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే రథయాత్ర ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి అన్ని ఛానెళ్లకూ అనుమతివ్వాలని, ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని సంబంధిత పిటిషన్‌లో అభ్యర్థించారు.
4. సప్త గోపురాలు సంపూర్ణం
ఆధార శిల నుంచి మహానాసి వరకు కృష్ణ శిలతోనే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురాలు నిర్మించాలన్న లక్ష్యం సంపూర్ణమైంది. అనుకున్న విధంగా అన్ని దిక్కుల్లో ఆరు రాజగోపురాలు, గర్భగుడిపై దివ్య విమానం ఆవిష్కృతమయ్యాయని ‘యాడా’ నిర్వాహకులు పేర్కొన్నారు. ‘‘మొదటి ప్రాకారంలో తూర్పువైపున త్రితల రాజగోపురం(ప్రవేశం మార్గం), పడమర దిశలో ఐదంతస్తుల గోపురం(బయటకు వెళ్లేందుకు) రూపుదిద్దుకున్నాయి. రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్తుల మహా రాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాలు తీర్చిదిద్దారు. వీటితోపాటు స్వయంభువులు కొలువై ఉన్న గర్భగుడిపై 42అడుగుల ఎత్తున దివ్య విమానం(విమాన గోపురం) నిర్మాణం పూర్తవడంతో గోపురాల నిర్మాణ క్రతువు పరిపూర్ణమైంది’’ అని ప్రధాన స్తపతులు సుందరరాజన్‌, ఆనందచారి వేలు తెలిపారు.
గోపురాలను శిల్పకారులు 32 నెలల్లో పూర్తిచేయగలిగారని వివరించారు. దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా గోపురాలన్నీ సంపూర్ణంగా కృష్ణశిలతో తీర్చిదిద్దామని, శిల్ప సంప్రదాయం, కళల గూర్చి భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా నాగర, ద్రవిడ, పల్లవ, చోళ, విజయనగర, కాకతీయుల కాలం నాటి కళారూపాలతో ఆలయ విస్తరణ పనులు చేపట్టామని స్తపతులు అన్నారు.
5. బోనాల నిర్వహణకు రూ.15 కోట్లు -జులై 4 నుంచి వైభవోపేతంగా ఉత్సవాలు
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌ ఆషాఢ బోనాల ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.15 కోట్లు కేటాయించారన్నారు. బోనాల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో తలసాని, హోంమంత్రి మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సారి జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.22 కోట్లతో దేవాలయాల అలంకరణలు, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులు చేపడుతున్నాం. హైదరాబాద్‌ మెట్రో రైల్‌.. భక్తుల సౌకర్యార్థం అదనపు ట్రిప్పులను నడుపుతుంది. ఉత్సవాలకు అవసరమైన ఏనుగును అటవీ శాఖ సిద్ధం చేస్తుంది’ అన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాలకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు పంపుతామని, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రాజాసింగ్‌, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్‌, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ఇంఛార్జి పోలీసు కమిషనర్‌ జితేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
జులై 4 : గోల్కొండ బోనాలు
జులై 21 : సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు
జులై 28 : పాతబస్తీలో బోనాలు
6. పద్మావతి అమ్మవారి ఆలయానికి మహర్దశ!
తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి
ఆన్‌లైన్‌లో అందుబాటులోకి సేవలు
భక్తుల బసకు సిద్ధమైన పద్మావతీ నిలయం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవేరి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు ఆలయానికి మహర్దశ పట్టనుంది. అమ్మవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, భక్తుల్ని పెద్దఎత్తున ఆకర్షించేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండడంతో తిరుమల తరహాలో తిరుచానూరు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతోంది. శ్రీవారి ఆలయంలో ఉన్న విధంగానే అమ్మవారి ఆలయంలో కూడా సేవలన్నీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అమ్మవారిని ప్రముఖులు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్‌ పేరిట దర్శన వేళలు కేటాయించారు. ఒకే సమయంలో 2500 మంది భక్తులు బస చేసేలా పద్మావతి నిలయం పేరిట భారీ వసతి సముదాయ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. టీటీడీ దీర్ఘకాలిక ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితా న్నిస్తుండడంతో పదేళ్లలో ఆలయానికి రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది.
**ఆర్జిత సేవలకు పెరిగిన డిమాండ్‌
పద్మావతి అమ్మవారికి నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాలతోపాటు ఆర్జిత సేవలు జరుగుతాయి. వీటిలో ప్రతి శుక్రవారం అమ్మవారికి వస్త్రాలంకరణ సేవ, అభిషేక సేవలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. ప్రతి సోమవారం జరిగే అష్టదళ పాదపద్మారాధన సేవ, ప్రతి గురువారం జరిగే తిరుప్పావడ, శనివారం జరిగే పుష్పాంజలి సేవ, ప్రతి నెలా మొదటి బుధవారం జరిగే అష్టోత్తర శత కళశాభిషేకంతోపాటు ఏడాదికోసారి జరిగే వరలక్ష్మీ వ్రత సేవలకు కూడా భక్తుల నుంచి చాలా డిమాండ్‌ వుంది. అయితే ఇవన్నీ కరెంటు బుకింగ్‌లో మాత్రమే భక్తులకు అందుబాటులో వుండేవి. దీంతో సిఫారసు లేఖలకు, స్థానికులకు మాత్రమే ఈ సేవల భాగ్యం కలిగేది. బయట ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవల గురించి తెలిసేది కాదు. తెలిసిన వారెవరైనా ఉన్నా వారికి టికెట్లు దొరకడం కష్టమయ్యేది.
దీనిపై దృష్టి సారించిన టీటీడీ గత ఏడాది కీలకమైన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాగైతే ఆర్జిత సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారో అదే రీతిలో పద్మావతి ఆలయంలో కూడా ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. కొన్నేళ్ళ కిందటి వరకూ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలంటే కేవలం స్థానికుల పండుగ. అంతకు మించిన ప్రచారం గానీ, ప్రాముఖ్యత గానీ వుండేది కాదు. ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా కేవలం పంచమితీర్థం రోజు మాత్రమే స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చేవారు. అయితే ప్రస్తుతం అమ్మవారి ఆలయ ప్రాముఖ్యత, ఉత్సవాలు, స్థల ప్రశస్తిని, ఎస్వీబీసీ ఛానెల్‌, సప్తగిరి మాసపత్రిక, టీటీడీ వెబ్‌సైట్లతో పాటు ఇతర మీడియా సంస్థల ద్వారా టీటీడీ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది.
**దాతల సాయంతో..
టీటీడీ జేఈవో లక్ష్మీకాంతం దాతల సాయంతో కొన్ని పనులు చేపట్టారు. వాటిలో ఒకటి ఏఆర్‌టీ టెక్నాలజీ ద్వారా పద్మావతి అమ్మవారి పరిణయ వృత్తాంతాన్ని భక్తులకు తెలియజేసే కార్యక్రమం. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, హైదరాబాదుకు చెందిన మరో దాత కలసి అందజేసిన రూ.12 లక్షల విరాళంతో ఆలయం ఎదుట అమ్మవారి ఉద్యానవనంలో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. పద్మావతి-శ్రీనివాసుల పరిణయ వృత్తాంతాన్ని బొమ్మల ద్వారా తెలియజేసే ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
**ప్రముఖులకు ప్రత్యేక దర్శన వేళలు
గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుచానూరు వచ్చినప్పుడు అధికారులు హడావిడిగా వారికి దర్శన ఏర్పాట్లు చేసేవారు. ఆ సమయంలో సామాన్య భక్తుల క్యూలను నిలిపివేసేవారు. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ అధికారులు తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం ఆమల్లోకి తెచ్చారు. ఉదయం, సాయంత్రం నిర్దిష్ట వేళల్లో మాత్రమే ప్రముఖులకు దర్శనం కల్పిస్తున్నారు.
**అందుబాటులో అన్ని సదుపాయాలు
పద్మావతి అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా తిరుమల తరహాలోనే సెల్లార్‌ (కంపార్టుమెంట్‌)ను టీటీడీ ఏర్పాటు చేసింది. అధునాతన వసతులతో నిత్యాన్నదాన కేంద్రాన్ని ఏర్పాటుచేసి రోజుకు 5 వేల మందికి అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. 2,500 మందికి వసతి కల్పించే పద్మావతి నిలయం ప్రారంభానికి సిద్ధమైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుచానూరులో రహదారుల విస్తరణ, వాహనాల పార్కింగుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి రోజుకు 40 వేల మంది భక్తులు వస్తుండగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య 60 వేలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
7. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈ రోజు మంగళవారం.
11.06.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 24C° – 32℃°
నిన్న 88,173 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నె
భక్తులతో నిండినది, వెలుపల
వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.61 కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
నాలుగు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
8. చరిత్రలో ఈ రోజు జూన్, 11
**సంఘటనలు
1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది.
1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది
1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.
2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.
** జననాలు
1920: మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).
1924: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు రచయిత.(మ.2002)
1932: ధారా రామనాథశాస్త్రి, సుప్రసిద్ధ నాట్యావధాని (మ.2016).
1944: మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ జకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1947: లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు.
** మరణాలు
1963: టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు
1979: జాన్ వెయిన్, హాలీవుడ్ నటుడు (జ.1907).
1983: ఘనశ్యాం దాస్ బిర్లా, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త. (జ.1894)
1987: బి.ఎస్.మాధవరావు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (జ.1900)
2001: ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ.
9. శుభమస్తు తేది : 11, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 10 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 23 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 2 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 33 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 53 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 9 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కన్య
10. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రమణ్యం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
11. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని నేటి మధ్యాహ్నం 11.30 గంటలకు దర్శించుకోనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం దంపతులు.అనంతరం తిరుపతి శ్రీపద్మావతి అతిధి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుని సా.5.00 తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీపద్మావతి ఎక్స్ ప్రెస్ల్ లో విజయవాడ తిరుగుప్రయాణం అవుతారు.