DailyDose

పోలీసును కొట్టిన లేడి–నేరవార్తలు–06/11

BJP Women MP Beats Escort On Duty In Uttar Pradesh

* ఎస్కార్టు డ్యూటీలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ పై బీజేపీకి చెందిన మహిళా ఎంపీ దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. బీజేపీ మహిళా ఎంపీ రేఖావర్మ వద్ద పోలీసుకానిస్టేబుల్ శ్యాంసింగ్ ను ఎస్కార్టుగా నియమించారు. ఎంపీ రేఖావర్మ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ శ్యాంసింగ్ భద్రతా విధులు నిర్వర్తించారు. ఎంపీ వద్ద భద్రతా విధులు నిర్వర్తించి తిరిగి వెళుతుండగా ఎంపీ రేఖావర్మ తనను పిలిచి అకారణంగా కొట్టారని పోలీసు కానిస్టేబుల్ శ్యాంసింగ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మహిళా ఎంపీ తనపై చేయి చేసుకున్న ఘటనపై తనకు న్యాయం చేయాలని సీనియర్ పోలీసులను శ్యాంసింగ్ కోరారు.
* ఎస్కార్టు డ్యూటీలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ పై బీజేపీకి చెందిన మహిళా ఎంపీ దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. బీజేపీ మహిళా ఎంపీ రేఖావర్మ వద్ద పోలీసుకానిస్టేబుల్ శ్యాంసింగ్ ను ఎస్కార్టుగా నియమించారు. ఎంపీ రేఖావర్మ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ శ్యాంసింగ్ భద్రతా విధులు నిర్వర్తించారు.
*మీ పేస్ బుక్ అకౌంట్ కు అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించా ఒకే చేసే ముందు ఒక్క క్షనం ఆగండి, దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పెద్ద ముటా ఈ-మెయిల్స్ ను హ్యాక్ చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అందమైన అమాయి ఫోటో చూసి కొంచెం ఆదమరిస్తే మీ బ్యాంకు అకౌంట్ లోని డబ్బులు మొత్తం ఖాళీ గ్యారెంటీ.
*ప్రత్తిపాడు మండలం గోట్టిపాడు నుంచి నందిపాడు కు అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాలు రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు బియ్యం ను తరలిస్తున్న వాహన్నాని బియ్యాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు.
*జనగాం జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్‌టిసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్ 3750 నంబర్ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
*ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన ఓ మహిళను చివరకు ఆ ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న ఘటన త్రిపురలో జరిగింది.
*కరీంనగర్‌ మండలంలోని చర్లబుత్కూర్‌లో విషాదం నెలకొంది. ట్రాక్టర్‌ కింద పడి మూడేళ్ల చిన్నారి జక్కు రితిక మృతి చెందింది. తండ్రి నడుపుతున్న ట్రాక్టర్‌ కిందపడి రితిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
*అశ్వారావుపేట మండలం ఆసుపాకలో దారుణం జరిగింది. భూవివాదాలతో భార్య, అల్లుడిపై భర్త భూక్య నాగు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
*అమెరికా దేశంలోని మన్‌హట్టన్ నగరంలోని ఓ ఎతైన భవనంపై హెలికాప్టరు కూలిన ఘటనలో పైలెట్ మృతి చెందారు. మన్‌హట్టన్ నగరానికి చెందిన పైలెట్ టిమ్ మక్ కార్మాక్ అనే పైలెట్ 34వ హెలీపోర్ట్ నుంచి అగస్టా ఎ 109ఈ హెలికాప్టరులో బయలు దేరారు.
* బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. నితిన్‌ సరాఫ్‌ అనే వ్యక్తి వృతిరీత్యా వ్యాపారి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
*తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఏలూరు రూరల్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు విల్లుపురంకు చెందిన కాలేజీ స్టూడెంట్స్‌ మునిస్వామి మహేంద్ర(24), పళనియప్ప ప్రభూ(24) విశాఖపట్టణం నుంచి తమిళనాడుకు కారులో గంజాయి తరలించేందుకు ప్రయత్నించారు.
*సీతారాముల కళ్యాణ జాతర ఉత్సవాల్లో బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్పై చెయ్యి చేసుకున్న 16 మందిలో 12 మందిని రిమాండ్ కు తరలించినట్టు వికారాబాద్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.
*పంజాబ్ లో బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు ఫతేవీర్ కథ విషాదాంతమైంది. బోరు బావి నుంచి అధికారులు పైకి తీసినా.. ప్రాణాలు కాపాడలేకపోయారు. 109 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. 150 ఫీట్ల లోతు నుంచి పైకి వచ్చిన బాలుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*పశ్చిమ బెంగాల్ లో ఘర్షణలు తగ్గడం లేదు. ఇప్పటికే బీజేపీ,టీఎంసీ వర్గాల ఘర్షణలో పలువురు చనిపోగా..లేటెస్ట్ గా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంకినార ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. బాంబు దాడి అనంతరం దుండగులు చోరీ చేసినట్లు చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఘటన అనంతరం అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
* గిరిజన మహిళే కదా వాడుకుని వదిలేద్దామనుకున్నాడు.. కానీ ఆమెనే పెళ్లి చేసుకోక తప్పలేదు ఆ ఎమ్మెల్యేకి. పేరుకి పెద్ద పోస్టు. కానీ బుద్ది మాత్రం చిన్నది. త్రిపుర రాష్ట్రానికి చెందిన రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనన్ జోయ్‌పై ఓ గిరిజన మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గత కొంత కాలంగా తనతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే పెళ్లి చేసుకుందామనేసరికి మొహం చాటేస్తున్నాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఐపీసీ 417,376 సెక్షన్ల కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ప్రజాసంఘాలు గిరిజన మహిళకు అండగా నిలిచాయి. పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రేప్ కేసు పెట్టిన మహిళను ఆదివారం (జూన్9,2019) రోజున వివాహం చేసుకున్నారు.
* లవ్ మ్యారేజీకి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరు లవర్స్ హైదరాబాద్ చందానగర్ లో ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన మోహన్ నాయక్, మందురబాద్ ప్రాంతానికి చెందిన స్వర్ణలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించని చందానగర్ లోని వివి ప్రైడ్ లాడ్జిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే స్వర్ణలత ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఎల్.బి.నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా స్వర్ణలత చందానగర్ లో ఉన్నట్టు గుర్తించారు. రెండు రోజుల క్రితమే లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ విషయం స్వర్ణలత కుటుంబ సభ్యులకు తెలియదన్నారు పోలీసులు.
*బీహార్‌లోని బారురాజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
*మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా సింధివాహి ప్రాంతంలో వరసగా జరుగుతున్న పులి దాడుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
*ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుప లోడుతో ఆగి ఉన్న లారీని బిహార్‌లోని పట్నా వెళ్లే బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న ముగ్గురు మహిళలు, ఒక బాలుడు సహా 11 మంది మరణించారు.
* నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో నగదును విదేశాలకు అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బెనజిర్‌ భుట్టో భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీ అరెస్టయ్యారు. *
* నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో నగదును విదేశాలకు అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బెనజిర్‌ భుట్టో భర్త ఆసిఫ్‌ అలీ జర్దారీ అరెస్టయ్యారు.
*మలేషియా, సింగపూర్‌ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన రూ.7 కోట్ల విలువైన 24 కిలోల బంగారం, డ్రోన్‌, కెమెరాలు, రూ.24 లక్షల నగదు చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
*నగల వ్యాపారానికి పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశజూపి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన బెంగళూరులోని ఐఎంఏ నగల దుకాణం యజమాని మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ బోర్డు తిప్పేశారు.
*సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయ ముంపు బాధితులకు పంపిణీ చేయాల్సిన చెక్కుల్లో రెండు మాయమయ్యాయి.
*జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
*కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌ గౌడను తిడుతూ ఉన్న వీడియోను పోస్ట్‌ చేశారన్న కారణంతో బెంగళూరు పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.
*కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికుల జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చందానగర్‌ పోలీసుల కథనం మేరకు.. నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25) ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
*ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా తిలేమాల గ్రామంలో దుండగులు బీభత్సం సృష్టించారు. నిద్ర పోతున్న వ్యక్తిని నరికి చంపి తలను తీసుకెళ్లారు దుండగులు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ముండా(40) తన ఇంటి ముందు సోమవారం రాత్రి నిద్రిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి తలను దుండగులు తీసుకెళ్లారు.
* నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్‌ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్‌ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్‌పుర్‌ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్‌ కుమార్‌ జెనా(52), చరణ్‌ బిషాల్‌ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.