DailyDose

జగన్‌ను కలిసిన రోజా-రాజకీయ-06/11

Roja Meets YS Jagan At His Camp Office - June 11 2019 - Daily Political News

* తాడెపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను ఎమ్మెల్యే రోజా కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో ఆమె అలకబూనినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అంతేకాదు జూన్-08న అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి రోజా హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్.. రోజాను క్యాంప్ ఆఫీస్‌కు రావాల్సిందిగా కబురు పంపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అమరావతికి వచ్చిన రోజా.. సీఎం జగన్‌ను కలిశారు. దీంతో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలాఉండగా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవికి బదులుగా నామినెటెడ్ పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.
* చంద్రబాబు నివాసంలో ప్రారంభమైన టీడీఎల్పీ భేటీ
హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలుకీలక పథకాల అమలుకు ఒత్తిడిచేసే ఛాన్స్పనేత, విప్ లను నియమించనున్న చంద్రబాబుటీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీఎల్పీ సమావేశం ప్రారంభమయింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన రుణమాఫీ సహా ఇతర కీలక పథకాల బకాయిలను ప్రజలకు చెల్లించేలా రేపటి సమావేశంలో ఒత్తిడి తీసుకురావచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి. టీడీఎల్పీ నేతగా ద్రబాబును ఇటీవల పార్టీ నేతలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సమావేశంలోనే టీడీపీ ఉపనేత, విప్ లను చంద్రబాబు ఎంపిక చేస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి
* రాయబరేలి వెళ్తున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడు ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో పర్యటించనున్నారు. రాయబరేలి లోక్‌సభ నుంచి తిరిగి గెలిచిన అనంతరం ఆ నియోజకవర్గంలో సోనియాగాంధీ పర్యటించనుండటం ఇదే ప్రథమం. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం కార్యకర్తలను సోనియాగాంధీ ఈ సందర్భంగా కలుసుకుంటారు. మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు.
* పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన..?
సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణ జిల్లాలో జరిగిన అల్లర్లలో బీజేపీకి చెందిన నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. దీనితో ఆ హత్యలకు కారణం మీరంటే మీరంటూ ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇది ఇలా ఉండగా బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందంటూ.. ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాధ్ త్రిపాఠి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
*తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాట
తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు ఉన్నాయా..? భట్టి దీక్ష తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా..? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న వీ హనుమంతరావు సొంత పార్టీపైనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. భట్టి విక్రమార్క దీక్షను అడ్డం పెట్టుకుని టీపీసీసీ తప్పులు కప్పిపుచ్చుకుంటోందని మండిపడుతున్నారాయన. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న తప్పులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుదామంటే 5 నెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటున్నారు వీహెచ్. ఏదేమైనా సరే త్వరలో రాహుల్‌ను కలిసి తీరతానని అంటున్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్పి.. భట్టితో దీక్ష విరమింప జేశారని.. తెలంగాణలో కాంగ్రెస్‌లో అసలు ఆయనకు ఏం పనంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేతను విమర్శించారు వీహెచ్.
*విద్యాసాగ‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన మ‌మ‌తా బెన‌ర్జీ
ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంస‌మైన విష‌యం తెలిసిందే. అమిత్ షా ర్యాలీని అడ్డుకోవ‌డానికి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆ విగ్ర‌హం ధ్వంస‌మైంది. అయితే తాము అధికారంలోకి వ‌స్తే విద్యాసాగ‌ర్ పంచ‌లోహ విగ్ర‌హాన్ని చేయిస్తామ‌ని ప్ర‌ధాని మోదీ ఆ త‌ర్వాత ఓ ర్యాలీలో హామీ ఇచ్చారు. కానీ త‌మ‌కు పంచ‌లోహ విగ్ర‌హాలు ఏమీ అవ‌స‌రం లేద‌ని దీదీ కూడా అన్నారు. అయితే ఇవాళ బెంగాల్ భాషా పండితుడు విద్యాసాగ‌ర్ విగ్ర‌హాన్ని కాలేజీలో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌తిష్టించారు. ఆ త‌ర్వాత కోల్‌క‌తాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ప్ర‌తి రాష్ట్రానికి వార‌సత్వం, భాష ఉంటాయ‌ని, ఇది మ‌న దేశ‌మ‌ని, కానీ బీజేపీ మ‌న రాష్ట్ర త‌ల‌రాత‌ను మార్చ‌లేద‌న్నారు. బెంగాల్ సంస్కృతిని ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆమె ఆరోపించారు.
*తెలంగాణ స్పీకర్‌, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్ట్.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓ వైపు ధర్నాలు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా.. ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది…
*రాజకీయాల్లోకి ఆదిత్య థాకరే
యువసేన చీఫ్‌ ఆదిత్య థాకరే(28) క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. మహారాష్ట్రలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య థాకరే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య వోర్లి లేదా మహీం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య పోటీ చేస్తారా? లేదా? అనే విషయంపై ఆయన తండ్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. యువసేన నాయకుడు వరుణ్‌ సర్దేశాయ్‌ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆదిత్య రాజకీయ అరంగేట్రంపై పోస్టు చేశారు. ఆదిత్య థాకరే కోసం మహారాష్ట్ర వేచి చూస్తుందని పోస్టు చేశారు. ఇది ఒక మంచి అవకాశం అని, దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
*తెలంగాణ స్పీకర్‌, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్ట్.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓ వైపు ధర్నాలు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా.. ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది…
*తెలంగాణ స్పీకర్‌, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్ట్.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓ వైపు ధర్నాలు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా.. ఈ నాలుగు రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది…
*మళ్లీ ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్‌
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ములాయంను గురుగ్రామ్‌ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి లక్నో నుంచి చార్టెడ్‌ ఫ్లైట్‌లో ములాయంను గురుగ్రామ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయంకు షుగర్‌ లెవల్స్‌ అధికంగా నమోదు కావడంతో ఆదివారం లక్నోలోని లోహియా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మళ్లీ సాయంత్రం వరకు ములాయం ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
*ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌
17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌ వ్యవహరించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వీరేంద్ర కుమార్‌ పేరును ఖరారు చేసిందని, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వీరేంద్రకుమార్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల17 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారంతో పాటు ఈ నెల 19న జరిగే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను కూడా ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. వీరేంద్ర కుమార్‌ ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌ తికమార్ఘ్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు.
*మా పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గాడు : రేవంత్
ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన బైసన్ పోలో గ్రౌండ్ ను కాంక్రీట్ జంగిల్గా మార్చి సెక్రటేరియట్ కట్టాలని సీఎం కేసీఆర్ అనుకున్నాడని, తమ పోరాటం వల్ల అది జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న పార్టీలో 23 మందే గెలిచినట్లు.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందే మిగులుతారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కు టుంబం ఓడిపోయిందని, ప్రజలు గెలిచారని అన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన చేస్తున్నారన్నారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెల్చిన సందర్భంగా సోమవారం కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.
* కాంగ్రెస్‌ నేతలు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు- వీహెచ్‌
కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్షను అడ్డుపెట్టుకొని… కాంగ్రెస్‌ నేతలు తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భట్టి దీక్షను రాష్ట్ర నేతలు విరమింపజేసి… రాహుల్‌ గాంధీ పేరు చెప్పారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిద్దామనుకుంటే… రాహుల్‌ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవహారాల్లో ‘ఆత్మ’ (కేవీపీ రామచంద్రరావు)కు ఏం పని? అని ఆయన ప్రశ్నించారు.
* యోగి సర్కార్‌కు సుప్రీం షాక్..
ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత ధర్మాసనం ఆదేశించింది. సదరు జర్నలిస్టును ఏ చట్టం కింద, ఎందుకు అరెస్టు చేశారంటూ యోగి ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. ప్రశాంత్ అరెస్టు అక్రమమనీ, చట్ట విరుద్ధమని .. వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ ఆయన భార్య జగీశా అరోరా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని జస్టిస్ ఇందిరా బెనర్జీ, అజయ్ రస్తోగీల ధర్మాసనం మన్నించింది. జగీశా తరపున న్యాయవాది నిత్య రామకృష్ణన్ వాదనలు వినిపించారు.
* పండగలా రాజన్న బడిబాట: మంత్రి సురేష్‌
కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కార్యాలయం నుంచి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచడం, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ.. ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా, రుచికరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
*అవినీతి రహితం ప్రజా శ్రేయస్కరం
అవినీతి రహిత పాలన అందించేలా, ప్రజలకు మేలు జరిగేలా పటిష్ఠమైన పురపాలక చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పురపాలక సంఘాలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవినీతిరహిత పాలన, ప్రజా శ్రేయస్సు ప్రధాన లక్ష్యాలని అధికారులు గుర్తించాలన్నారు. ప్రభుత్వ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులను బాధ్యులను చేస్తూ పకడ్బందీగా పురపాలక చట్టాన్ని రూపొందించాలని సీఎం సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలు, కార్యాచరణ.. కొత్త పురపాలకచట్టం రూపకల్పనలపై మంత్రులు, అధికారులతో చర్చించారు.
*ఏపీలో వరాల తొలకరి
ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం ఎన్నికల హామీల అమలు దిశలో కీలక అడుగులు వేసింది. రైతు, శ్రామిక, ఉద్యోగ వర్గాలకు వరాలను అందించింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దుకు ముందడుగు వేసింది. జులై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 27శాతం మధ్యంతర భృతిని ఆమోదించింది. అంగన్‌వాడీలు, ఆయాలు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచింది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకానుంది. బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు అందించే ‘అమ్మ ఒడి’ని జనవరి 26నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
*నోటీసు ఇవ్వకుండానే స్పీకర్‌ విలీన నిర్ణయం
కాంగ్రెస్‌ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లో విలీనం చేస్తూ ఈ నెల 6 న స్పీకర్‌ సచివాలయం జారీ చేసిన బులెటిన్‌ను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక రాజకీయ పార్టీ శాసనసభా పక్షాన్ని.. మరో రాజకీయ పార్టీలో విలీనం చేసే అధికారం ఎన్నికల సంఘానికే ఉంటుందని, స్పీకర్‌కు కాదని పేర్కొన్నారు. స్పీకర్‌ ఆదేశాలతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేస్తూ.. స్పీకర్‌ సచివాలయం జారీ చేసిన బులెటిన్‌ రాజ్యాంగంలోని పదో షెడ్యూలు, అధికరణ 101, 191, 324కు విరుద్ధమన్నారు.
*ఒకట్రెండు రోజుల్లో మంత్రిమండలి భేటీ
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఒకట్రెండు రోజుల్లో జరగనుంది. సన్నద్ధంగా ఉండాలని, ఇప్పటికే సిద్ధం చేసిన అంశాలతోపాటు కొత్త ప్రతిపాదనలనూ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఈ మేరకు కార్యదర్శులకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిమండలి సమావేశాన్ని గత నెల 28నే నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించినా.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాయిదా వేసింది. కోడ్‌ ముగియడంతో సమావేశానికి సన్నాహాలు చేస్తోంది.
*విభజన సమస్యలన్నీ వరుసగా పరిష్కారం
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సోమవారం సమావేశమైన ఆయన ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సంభాషించానని, భేటీలో ఎలాంటి ప్రత్యేకతా లేదని స్పష్టంచేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలూ బాగా పనిచేస్తున్నాయని, పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న భవనాల సమస్య తొలుత పరిష్కారమైందని, అదేవిధంగా ఇతర అంశాలపైనా తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటారని ఆయన చెప్పారు. దేశరాజధానిలోని ఏపీ భవన్‌ సహా అన్ని సమస్యలకీ త్వరలోనే పరిష్కారం లభించగలదన్నారు.
*విపక్ష సర్కార్లను కూల్చే కుట్ర
ప్రతిపక్షాల పాలనలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి, అధికారం చేజిక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. శాంతి భద్రతలను కారణంగా చూపి ప్రభుత్వాలను కూల్చడానికి పన్నాగం పన్నుతోందని విమర్శించింది. ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న అల్లర్లను అదుపు చేయాలంటూ కేంద్ర హోంశాఖ పంపించిన సలహా పత్రంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ స్పందించారు.
*బెంగాల్‌లో భాజపా నిరసనలు
పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురవుతుండడానికి నిరసనగా సోమవారం భాజపా ‘చీకటి రోజు’ను పాటించింది. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లా బసీర్‌హట్‌ సబ్‌డివిజన్‌ సందేశ్‌కాళిలో జరిగిన ఘర్షణలో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఒక తృణమూల్‌ కార్యకర్త మృతి చెందడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బసీర్‌హట్‌లో భాజపా 12 గంటల బంద్‌ పాటించింది. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రోడ్లు, రైల్వేలైన్లపై కార్యకర్తలు బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు.
*ఈవీఎంలపై శరద్‌ పవార్‌ అనుమానాలు
సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తర్వాత ఈవీఎంల కచ్చితత్వంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ విషయం ప్రస్తావించారు. తాము ఒక పార్టీకి ఓటేస్తే అది వేరే పార్టీకి వెళ్లిందేమోనని ప్రజలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల మనస్సులలో ఈవీఎంల గురించి అనుమానాలు రాకూడదని శరద్‌ పవార్‌ అన్నారు. శరద్‌పవార్‌ అన్నకొడుకు అజిత్‌ పవార్‌ మాత్రం తన బాబాయితో ఈ అంశంలో విభేదించారు.
*ముస్లింల సమస్యలపై నిలదీస్తాం
ముస్లింల సమస్యలపై పార్లమెంటులో అధికార పార్టీని నిలదీస్తామని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. సాలార్‌ సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ జ్ఞాపకార్థం ఆదివారం అర్ధరాత్రి యాఖుత్‌పురా రైల్వేస్టేషన్‌ దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సెక్యులర్‌ పార్టీలకు ముస్లింలు ఇంకా ఎంతకాలం కూలీలుగా పని చేయాలని పరోక్షంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
*భూ రికార్డుల ప్రక్షాళన గ్రామసభల్లో జరగాలి: కోదండరెడ్డి
సమక్షంలోనే జరగాలని కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి కోరారు. టీపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, కొత్త పాస్‌పుస్తకాల జారీతో పాటు భూ రికార్డుల ప్రక్షాళనలోనూ రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ లోపాల కారణంగానే ఇంకా ఏడులక్షల మందికి రైతుబంధు పథకం ప్రయోజనాలు అందలేదన్నారు.
*పరీత్యాల నిర్వహణ నిధుల వాడకంపై శ్వేతపత్రం కావాలి: మర్రి
ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు సంబంధించి కేంద్రం నుంచి అందిన నిధుల వినియోగం తీరుపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, 2005లో నాటి కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టనిబంధనల కింద 2016-17 సంవత్సరానికి రాష్ట్రానికి సాయంగా రూ.1500 కోట్ల నిధులు వచ్చాయన్నారు.
*అభివృద్ధిని ఆపొద్దు
రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు నీరందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా నిలిపేస్తామనడం సరికాదని తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తప్పుపట్టారు. రాజధాని అమరావతి లాంటి స్వయంపోషక(సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌) ప్రాజెక్టు పనుల్ని నిలిచిపోయే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
*ప్రజలంతా మెచ్చేలా పాలన
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది రైతు ప్రభుత్వమని, అన్నదాతకు భరోసాగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా.. ప్రజలకు ఇంత మేలు చేసిన ప్రభుత్వం మరేదీ లేదనిపించుకునేలా పాలన ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. అందుకు తగ్గట్లే మంత్రులు సైతం పని చేయాలని ఆయన నిర్దేశించారన్నారు.
*రాజధాని నిర్మాణ పనులు ఆగవు
ఆంధప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోతాయన్న ఆపోహలు వద్దని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సోమవారం ఆయన మొదటిసారిగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కార్యాలయానికి వచ్చారు. రాజధాని పనుల పురోగతిపై సమీక్షించారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటి వరకు పురోగతిని సీఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీనరసింహం, ఏడీసీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి ఆయనకు దృశ్య రూపకంగా వివరించారు.
*విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక మండలి
విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేకంగా మండలిని ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఈ మండలి కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం వృత్తి విద్యాకోర్సుల రుసుముల నియంత్రణకు ఉన్నట్లే విశ్రాంత న్యాయమూర్తి ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉంటారని తెలిపారు.
*ప్రతి శాఖకూ ఐదేళ్ల ప్రణాళిక
ప్రతి మంత్రిత్వ శాఖకు స్పష్టమైన లక్ష్యాలు, నిర్దిష్ట మైలురాళ్లతో ఐదేళ్ల ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రస్తుత స్థితిలో మార్పులు రావాలని, జీవన నాణ్యత పెరగాలని కోరుకుంటున్న ప్రజాతీర్పునకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్నారు.