DailyDose

మహిళా న్యాయవాది హత్య -నేరవార్తలు–06/12

Female Lawyer And UP Bar Council Chaiperson President Murdered - June 12 2019 - Crime News

* ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దర్వేశ్‌ యాదవ్‌ హత్యకు గురయ్యారు. సహచర న్యాయవాది కాల్పుల్లో ఆమె హత్యకు గురయ్యారు. యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలిగా ఆమె రెండు రోజుల క్రితమే ఎన్నికయ్యారు. ఆగ్రా జిల్లా కోర్టులో ఆమె నేడు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాగత స్వీకారం తీసుకునేందుకు వెళ్తుండగా హత్యకు గురయ్యారు. దర్వేశ్‌పై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు మనీశ్‌ తనకు తానుగా కాల్చుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
* టెక్నాలజీ పెరిగింది.. దాంతో పాటు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాంగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తుకున్నా సదరు వ్యక్తి మాటల వలలో చిక్కుకుపోతోంది యువత. ఫలితంగా డబ్బులు గుల్ల. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు అనేక మందికి ఫోన్లు చేసి బ్యాంకు వివరాలు అడిగి తెలుసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్‌లైన్ పరిచయంతో నమ్మబలికిన కొందరు విదేశీ వ్యక్తులు మీకు గిప్టులు పంపాము. ఎయిర్ పోర్టులో ట్యాక్స్ కట్టి బహుమతులు తీసుకోండి అంటూ మరో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. ఈ లిస్టులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. తాజాగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సోనాక్షి వర్మ అనే హీరోయిన్‌ని నైజీరియన్ ముఠా దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
* ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దర్వేశ్‌ యాదవ్‌ హత్యకు గురయ్యారు. సహచర న్యాయవాది కాల్పుల్లో ఆమె హత్యకు గురయ్యారు. యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలిగా ఆమె రెండు రోజుల క్రితమే ఎన్నికయ్యారు. ఆగ్రా జిల్లా కోర్టులో ఆమె నేడు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
*విజయవాడ నగరంలోని పొలిక్లినిక్ రోడ్డులోని వెంకటరమణ ట్రస్టు ఆస్పత్రిలో అగ్నిప్రమాదంషార్ట్ సర్క్యూట్‌తో ఏసీ వార్డులో మంటలు నిముషాల్లో అన్ని గదులకు వైపించిన మంటలు హడలిపోయిన రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు
అంతటా వ్యాపించిన పొగతో రోగులు ఉక్కిరి బిక్కిరి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు
*ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట సమీపంలో గల 40వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
* ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకేసు నిందితులు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ప్రణయ్‌ హత్యకేసుకు సంబంధించి పేజీల చార్జిషీట్‌‌ను పోలీసులు దాఖలు చేశారు. మిర్యాలగూడ కోర్టులో పోలీసులు ఈ చార్జిషీట్‌ దాఖలు చేశారు. మారుతీరావుకిరాయిగుండాల కుట్రను… సాక్ష్యాధారాలతో పోలీసులు కోర్టు ముందుంచారు.
* బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
* వివాహితను కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన జగ్గయ్యపేట పట్టణ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి శివనారాయణ్‌ మీనా కన్నుమూశారు. దైవ దర్శనార్థం కేదార్‌నాథ్‌ ప్రయాణంలో ఉన్న ఆయన గుండెపోటు కారణంగా ఈ బుధవారం స్వర్గస్తులైనారు.
* అనంతపురం జిల్లా నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొని లారీ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
*పశ్చిమ బెంగాల్‌లో వరుస రాజకీయ హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఆశిష్‌ సింగ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
*రాజధాని అమరావతిలోని ఓ నిర్మాణ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
*మావోయిస్టులమంటూ విజయనగరం జిల్లా సాలూరులో పలువురిని బెదిరించి రూ.లక్షలు దోచుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
*కఠినమైన హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం-2016 అమల్లోకి వచ్చాక దేశంలో మొట్టమొదటిసారిగా నమోదైన కేసులో దోషికి మంగళవారం శిక్ష ఖరారైంది. విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడ్డ ముంబయి పారిశ్రామికవేత్త బిర్జు కె.సల్లాకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు జీవితఖైదు, రూ.ఐదు కోట్ల జరిమానా విధించింది.
*కొందరు వ్యక్తులు తన పేరుతో ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలు సృష్టించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మరికొందరు రాజకీయ నేతలపై అసభ్యకర పోస్టింగులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
*హైదరాబాద్‌ శివారు సుచిత్రా కూడలి సమీపంలోని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
* వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి, సీనియర్‌ కథానాయిక పూనంకౌర్‌లపై యూట్యూబ్‌లో అభ్యంతరంగా పోస్టులు పెట్టిన కోటి అలియాస్‌ కోటేశ్వరరావు మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
*సరకులు రవాణా చేయకుండానే నకిలీ ఇన్‌వాయిస్‌లతో రవాణా చేసినట్లు చూపి రూ.19.9 కోట్ల ఇన్‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్న రెండు సంస్థల యజమానులను అరెస్టుచేసినట్లు హైదరాబాద్‌ జోన్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.
*సుమారు రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు దంపతులను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వీరిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
*ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన మొగిలిపల్లి రమేష్‌(35) అనే నర్సరీ కాపరి(వాచ్‌మెన్‌)పై సోమవారం మావోయిస్టులు దాడి చేశారు.
*ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఒక యువకుడు సజీవ దహనమవగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ మండలం హస్నాబాద్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*తండ్రి నడుపుతున్న ట్రాక్టరు కింద పడి కుమార్తె దుర్మరణం చెందిన సంఘటన కరీంనగర్‌ మండలం చర్లబుత్కూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
*యశ్వంత్‌పూర్‌-హావ్‌డా (12864) ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మంగళవారం ప్రమాదం తప్పింది. ఈ రైలు విశాఖ సమీపంలోని ఉత్తర సింహాచలం స్టేషన్‌ దాటుకుని వేగంగా వెళ్తున్న సమయంలో బి-1 బోగీ చక్రాల నుంచి పొగలు, మంటలు రావడాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గమనించారు.
* కృష్ణా జిల్లా పరిషత్‌ ఆవరణలోని శిలాఫలకాన్ని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పట్టపగలు చోటుచేసుకున్న ఈ సంఘటనపై జడ్పీ సీఈవో షేక్‌సలాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
*ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఒక యువకుడు సజీవ దహనమవగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ మండలం హస్నాబాద్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* అబ్దుల్లాపూర్‌ మెట్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో 65వ జాతీయరహదారిపై ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం ఉదయం 6గంటల సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్‌ లారీని రోడ్డు పక్కన నిలిపివేశాడు.
* ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ పంచాయతీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గత రెండు రోజుల నుంచి చెరువులో పెద్దసంఖ్యలో చేపలు చనిపోయి తేలుతున్నాయి. చేపలు చనిపోవడంతో సుమారు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. దీంతో ఆవేదన చెందిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేపల చెరువులో విష ప్రయోగం జరిగిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* నాన్న నడిపే ట్రాక్టర్ కింద పడి మూడేళ్ల చిన్నారి జీవితం ముగిసిపోయింది. కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్‌కి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. ముద్దు ముద్దు మాటలు పలికే మూడేళ్ల చిన్నారికి అమ్మ అన్నం తినిపిస్తోంది. మధ్యలో అమ్మ లోపలికి వెళ్లింది. ఆడుకుంటున్న చిన్నారి నాన్న ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళుతున్నాడని బయటకు వచ్చింది బై చెప్పడానికి. అంతలోనే ట్రాక్టర్ ఆ చిన్నారి మీదకు ఎక్కింది. వెంటనే అరుస్తూ పడిపోయింది రితిక.. అరుపులను విన్న నాన్న కిందికి దిగి చూసేసరికి.. రితిక క్రింద పడి పోయి అపస్మార స్థితిలో పడి ఉంది. వెంటనే బిడ్డని తీసుకుని ఆసుపత్రికి పరిగెట్టారు తల్లిదండ్రులు. అయినా ఉపయోగం లేదు. అప్పటికే రితిక ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
* స్పీడుగా దూసుకొస్తున్న ఆ అమ్మాయి కారుకి బ్రేకులు వేశాడు ట్రాఫిక్ పోలీస్. ఆమె అందానికి అతడికి మాట రాలేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఒక్క క్షణం తనని తాను తమాయించుకుని మేడమ్.. మీరు మరీ ఇంత అందంగానా అని వెంటనే ఛలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం అని ఫైన్ వేశాడు. ఈ వింత ఘటన ఉరుగ్వేలో చోటు చేసుకుంది. కారులో వెళుతున్న ఓ యువతిని ట్రాఫిక్ పోలీస్ అడ్డగించాడు. ఎందుకు సార్ ఆపారు. నేనేం తప్పు చేశాను. తక్కువ స్పీడులోనే కదా వెళుతున్నాను అని అడిగింది ఆ అమ్మాయి పోలీస్‌ని. మరేం లేదమ్మాయి నీ అందం నన్ను కట్టి పడేసింది. అందుకే నీకు స్పెషల్ ఛలాన్ రాస్తున్నాను అని అబ్జర్వేషన్ సెక్షన్‌లో అని రాశాడు. తన అందాన్ని వర్ణించినందుకు సిగ్గులమొగ్గైంది అమ్మాయి.
* నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మాదారంలో చోటుచేసుకుంది. నకిలీ పత్తి విత్తనాల తయారీ, సరఫరా ముఠా సభ్యులను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. ఏడుగురిని అరెస్ట్‌ చేశామన్నారు.