DailyDose

రోజాకు జగన్ బుజ్జగింపు–తాజావార్తలు–06/12

Jagan pacifies rojas disappointment. Promises better opportunities in future.

*నగరి ఎంఎల్‌ఎ, వైసిపి కీలక నేత ఆర్‌కె.రోజా సెల్వమణి ని ఎపిఐఐసి చైర్మన్‌ గా సిఎం జగన్‌ నియమించారు. వరుసగా రెండోసారి ఎంఎల్‌ఎ గా రోజా ఎన్నికవడంతో పాటు పార్టీలో ముఖ్య నేతగా ఉన్న రోజా కు సామాజిక కోణ కేబినెట్‌ కూర్పుతో మంత్రి పదవి దక్కలేదు. దీంతో రోజాకు ఈ నామినేటెడ్‌ పోస్టును జగన్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పించడంలో ఈ కార్పొరేషన్‌ చాలా కీలకమైనది.
*గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షం…గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్లు సమాచారాం.
*తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(తుడా)కి ఛైర్మన్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గానూ కొనసాగుతున్నారు.
*ఉగ్రవాదులు మరోసారి దొంగదెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కేపీ రోడ్డు వద్ద సీఆర్‌పీఎఫ్ గస్తీ బృందంపై బుధవారం సాయంత్రం దాడికి దిగారు. ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరపుతూ, గ్రనేడ్లు విసిరారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు
*భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంనాడు కలుసుకున్నారు. అమిత్‌షాతో పాటు మరో ముగ్గురు కేంద్రమంత్రులు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. వీరిలో క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రె ఉన్నారు.
మర్యాదపూర్వకంగానే మంత్రులు రాష్ట్రపతిని కలుసుకున్నారు.
*ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ సీఎం షీలాదీక్షిత్ సమావేశమయ్యారు. సిటీలో కరెంట్, వాటర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ దృష్టికి ఆమె తీసుకొచ్చారు. కరెంట్, వాటర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
* ఏజెంట్ మాటలు నమ్మి గల్ఫ్కు పోయిన.. అక్కడ 18 గంటల పని.. అన్నం సక్కగ పెట్టరు.. జీతం సక్కగ ఇయ్యరు.. ఇదేందని అడిగితే కొడతరు.. ఎదురుతిరిగితే చంపడానికి కూడా తయారుగుంటరు.. ఏదో నేరం మీద కేసులు పెడతరు.. సౌదీలో చాలామంది తెలుగు ఆడవాళ్లు బాధలను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నరు.. ప్రభుత్వానికి చెప్పుకున్నా.. ఫలితం ఉండదు.. ఎంబసీ ఆఫీసర్లు లెటర్‌ రాసి వదిలేస్తరు అంటూ తన గోస వెల్లబోసుకుంది రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన గల్ఫ్బాధితురాలు లావణ్య.సౌదీలో ఆరు నెలలు అష్టకష్టాలు పడి మంగళవారం తన సొంతూరుకు వచ్చింది. తనకు సాయం చేసిన కేటీఆర్‌కు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆరే స్వయంగా విజయవాడకు వచ్చి జగన్‌ను ఆహ్వానించనున్నారు. ముందు నుంచి జగన్తో కేసీఆర్ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికీ కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే
* వాయు తుఫాన్ దూసుకువ‌స్తోంది. గుజ‌రాత్ తీరం వైపు అది వెళ్తోంది. ప్ర‌స్తుతం ముంబైకి 290 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉన్న‌ది. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్-డ‌యూ నుంచి వీరావ‌ల్ వ‌ద్ద అది తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. సుమారు 155 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
* ఈనెల 14 రాత్రి ఢిల్లీ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం వైసీపీ ఎంపీలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం ఈ నెల 14వ తేదీ రాత్రికి ఢిల్లీ కి. వైఎస్ జగన్ ఢిల్లీలో 15వ తేదీన జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం
* దూళిపాళ్ళ వద్ద గుంరు నుండి పిడుగురాళ్ల వెళ్ళు జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్ జామ్ అయింది.రాష్ట్ర హోంమంత్రి సూచరిత ఓయస్డి గా ప్రజల అధికారిగా గుర్తింపు పొందిన డిఎస్పీ గంగధరం ను నియమిస్తున్నట్లు తెలిసింది,తనకు ఓయస్డి గా డిఎస్పీ గంగాధరం ను నియమించాలని రాష్ట్ర పోలీస్ బాస్ కు హోంమంత్రి కోరినట్లు తెలిసింది.
* యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ఈనెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యే గొంగిడి సునీతలు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు.
* కృష్ణాజిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం రవీంద్రనాధ్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తా
జిల్లాలో పని చేసే అవకాశం లభించడం నా అదృష్టం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా సామాన్యులకు పోలీస్ శాఖాపరంగా సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తా పోలీస్ స్టేషన్ లలో రికార్డ్ వ్యవస్థను బలోపేతం చేస్తా ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను పరిగణలోకి తీసుకుని సేవలందిస్తా గతంలో విజయవాడ సిటీ లా అండర్ డీసీపీగా, విజయవాడ విజిలెన్స్ ఎస్పీగా సేవలందించిన అనుభవం ఉంది.
* నగరి ఎంఎల్‌ఎ, వైసిపి కీలక నేత ఆర్‌కె.రోజా సెల్వమణి ని ఎపిఐఐసి చైర్మన్‌ గా సిఎం జగన్‌ నియమించారు. వరుసగా రెండోసారి ఎంఎల్‌ఎ గా రోజా ఎన్నికవడంతో పాటు పార్టీలో ముఖ్య నేతగా ఉన్న రోజా కు సామాజిక కోణ కేబినెట్‌ కూర్పుతో మంత్రి పదవి దక్కలేదు. దీంతో రోజాకు ఈ నామినేటెడ్‌ పోస్టును జగన్‌ కేటాయించినట్లు తెలుస్తోంది.
* పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో బిజెపి శ్రేణుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సిపి ఆఫీస్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని వందల మంది బిజెపి కార్యకర్తలు దూసుకొచ్చారు. దీంతో టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
*ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది. వైసీపీ నేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఈరోజు ఆయన నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలపారు..
* చంద్రయాన్‌ -2ను జులై 15న ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రయాన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
* ఎక్కడో అటవీ ప్రాంతంలో సందడి చేసే జాతీయ పక్షి నెమలి దారితప్పి పొరపాటున గ్రామంలోకి ప్రవేశించి కుక్కల బారిన పడింది. నెమలిని కుక్కలు వెంటాడుతున్న దృశ్యాలను గమనించిన గ్రామస్తులు వెంటనే పరిగెత్తి నెమలిని వాటి నుంచి కాపాడారు. అనంతరం నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో గ్రామస్తులు అప్పగించారు. కాని అప్పటికే తీవ్రగాయాల పాలైన ఆ నెమలి స్టేషన్ దగ్గర మృతి చెందింది. సాధారణంగా నెమళ్లు తమ గ్రామ సమీపంలోని రోళ్ళపాడు వన్యప్రాణి అభయారణ్యంలో కనిపిస్తు ఉంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన నెమలి నీరు లేదా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు వారు తెలిపారు.
* తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈనెల 14న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. డిల్లీలో జరగనున్న నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం.
*గుంటూరునరసరావుపేట సబ్ జైల్లో తెదేపా కార్యకర్తలను పరామర్శించిన కోడెల.సబ్ జైల్లో ఏడ్వర్ట్ పేట, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం తెదేపా కార్యకర్తలు.
*విజయవాడ సత్యనారాయణ పురంలో నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆ స్కూల్ కు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుపుతున్నారని గతంలో మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో స్కూల్ సీజ్ చేశారు.
*పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్లు రుణాలు ఎగవేసిన లండన్ కు పారిపోయిన నీరవ్ మోడీని భారత్ కు తీసుకొస్తే ఉంచడానికి ముంబాయిలో జైలు గది సిద్దమైందని మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అర్ధర్ రోడ్డు జైల్లో బ్యారక్ నంబరు 12ను సిడం చేసినట్లు రాష్ట్ర జైళ్ళ శాఖ గత వరం హోం శాఖకు తెలియపరచింది. బ్రిటన్ హైకోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభమయ్యి. జస్టీస్ ఇంగ్రీద్ సిమ్లేర్ బుధవారం తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించారు.
*ఏపీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకొన్నాయి. ముందస్తు సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లోని చొప్పకొండ, బురద కోట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది.
*డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది.
*పాఠశాలల వేసవి సెలవులు, పునఃప్రారంభ తేదీలను మళ్లీ పాత విధానంలోనే నిర్దేశిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని గతంలో నిర్ణయించారు.
* టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ముందస్తు బెయిలు పిటిషన్‌లో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిలు ఎందుకివ్వాలో సంక్షిప్త వివరాలు ఇవ్వాలని రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాదిని, బెయిలు ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
* వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లితే చేతులు కట్టుకుని, చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ… పోలీసులు అరెస్టు చేసిన పాత్రికేయుడు ప్రశాంత్‌ కనోజియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
* ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఆరేళ్ల తర్వాత స్నాతకోత్సవానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ముస్తాబవుతోంది. ఉస్మానియా ఆవరణలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభంకానుందని ఉపకులపతి ఆచార్య ఎస్‌.రామచంద్రం తెలిపారు.
* ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల ఐకాసకు మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఐకాస ఇచ్చిన సమ్మె నోటీసులోని 26 డిమాండ్లనూ పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించింది.
* దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు ప్రవేశ అర్హత సాధించడం గర్వకారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.
* మహిళా భద్రతలో ఆదర్శవంతమైన పాత్ర పోషిస్తున్న ‘షి’ బృందాలు రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ ఆకాంక్షించారు. రాష్ట్రంలో మహిళలు అంతా సురక్షితంగా ఉన్నామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత వీటిపై ఉందన్నారు.
* తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ర్యాంకులు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు ప్రకటనలు ఇస్తున్న కార్పొరేట్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
* రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 21.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2233.16 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్‌ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా తుమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 21.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2233.16 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు.
* తెలంగాణ మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా డీఎస్‌ జగన్‌ మంగళవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.
* డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది.
*గద్వాల్‌ మాజీ ఎమ్మెల్యే గట్టు బీముడు(65) తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు.