Fashion

కాటన్‌ కట్టులో కొత్తదనం

Youth Prefer Cotton Sarees These Days For New Indo-Western Looks

దారాలెన్నింటినో ఒద్దికగా పేర్చితే… ఆ అల్లిక ఒక నేత చీరగా రూపుకడుతుంది. స్టైల్స్‌ ఎన్నింటినో పొందికగా కూర్చితే ఆ కొత్తదనం చీరంత అందమై కొలువుదీరుతుంది. నూలు దారాలన్నీ వినూత్నమై ఇలా నూలు విధాలుగా వెలుగొందుతాయి. నిన్నామొన్నటి వరకు కాటన్‌ చీరలు అంటే అమ్మాయిలు వాటిని ఆమడదూరం పెట్టేసేవారు. అవి పెద్దవారి జాబితా అంటూ పెదవి విరిచేవారు. ఇప్పుడు నయా స్టైల్‌ వచ్చింది. కంచి, ఖాదీ, లినెన్, మల్‌.. హ్యాండ్లూమ్‌ కాటన్‌ చీర ఏదైనా అమ్మాయిలు, అమ్మలు ఇలా కాటన్‌ కట్టులో కొత్తదనం తీసుకు వస్తున్నారు. ధరించే బ్లౌజ్‌తో అట్రాక్టివ్‌ లుక్‌ తీసుకువస్తున్నారు. ఈ ఇండోవెస్ట్రన్‌ లుక్‌ క్యాజువల్‌ వేర్‌గానే కాదు, సీజన్‌కి తగ్గట్టు పార్టీ వేర్‌గానూ హంగామా క్రియేట్‌ చేస్తుంది.