DailyDose

లోక్‌సభ డిప్యుటీ స్పీకర్‌గా వైకాపా ఎంపీ–రాజకీయ-06/12

YSRCP Tribal MP In Race To Loksabha Deputy Speaker - June 12 2019 - Politcal News

*భారీ మెజార్టీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన భాజప ఏపీలో ఘన విజయం సాధించిన వైకాపా మధ్య సత్సంబందాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ దిప్యుటే స్పీకర్ పదవిని వైకాపాకి ఇస్తామని భాజపా ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్నీ జగన్ కు తెలియజేశారని అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా డిప్యూటీ స్పీకర్ పదవిని గిరిజన ఎంపీకి ఇచ్చే దిశగా జగన్ యోచిస్తున్నారని సమాచారం.
* ప్రియాంక భర్తకు మరో షాక్
నగదు అక్రమ చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు గట్టి షాక్‌ తగిలింది. రాబర్ట్‌ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్‌ భండారి సంస్థ ఆఫ్‌సెట్‌ ఇండియా సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఈ గ్రూపు సంస్థలు, ఇతర విభాగాలతో అన్ని వ్యాపార లావాదేవీలను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో (ఫిబ్రవరి 2018)మొట్టమొదటిసారిగా ఆఫ్‌సెట్‌ ఇండియా సొల్యూషన్స్‌తో వ్యాపారాన్ని ఆరునెలలపాటు నిషేధించింది. తాజాగా తదుపరి ఆదేశాల వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హంకేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక ఒప్పందాలతో (2005లో రక్షణ ఒప్పందం, 2009లో పెట్రోలియం,తదితర) భండారీకి సంబంధం ఉన్నాయని ఆరోపణలు. సంజయ్‌ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్‌సెట్‌ ఇండియా సొల్యుషన్స్‌ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్‌ సంస్థ ‘పిలాటస్‌’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్‌ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2016 లో ఐటీ దాడుల నేపథ్యంలో డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారి లండన్‌ పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబర్ట్‌ వాద్రా కస్టోడియల్‌ రిమాండ్‌ను కోరుతోంది. పెట్రో, రక్షణ వ్యవహారాల్లో భండారి లంచాలు తీసుకున్నారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. అలాగే లండన్‌ నుంచి భండారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
*రోజాకు పెద్ద పదవి
మంత్రివర్గంలో చోటు దక్కక్కపోవడం అసంతృప్తిగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ పెద్ద పదవి కట్టబెట్టారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) ఛైర్మెన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రిపదవి దక్కుతుందని అందరూ భావించారు.. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెకు అమాత్యయోగం లభించలేదు. దీంతో రోజా అలకబూనింది. ఈ క్రమంలో మంగళవారం జగన్ ను కలిశారు ఆమె. తాజగా ఏపీఐఐసీ ఛైర్మెన్ గా నియమించారు జగన్.
* జగన్ ను కలవనున్న కేసీఆర్
త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ ను ముఖ్య అథితిగా ఆహ్వానించనున్నారు. త్వరలో అమరావతిలోని జగన్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్.. సీఎం జగన్ ను ప్రారంభోత్సవానికి రావలసిందిగా స్వయంగా ఆహ్వానించనున్నారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
*చిన్నమ్మకు చిక్కుముడులు వీడనున్నాయి.
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారా? రెండేళ్లు ముందుగానే కారాగారం నుంచి బయట పడనున్నారా? ఇప్పుడిదే చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా శశికళను విడుదల చేయడానికి కర్ణాటక జైళ్ల శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. డిసెంబర్‌లోనే చిన్నమ్మ విడుదల అవుతారని ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. దాదాపు ఏడాది, ఏడాదిన్నర ముందుగానే జైలు నుంచి శశికళ బయటకు వస్తారనిజయలలిత అక్రమాస్తు కేసులో శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు… నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2017 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమెను బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. జైలు శిక్షలో ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లు కారాగారవాసం గడపాల్సి ఉంది. ఐతే, జైలు జీవితంలో చిన్నమ్మ సత్ప్రవర్తనతో మెలిగారని కర్ణాటక జైళ్ల శాఖ నివేదిక తయారు చేసినట్లు సమాచారం. కారాగారవాసం అనుభవిస్తున్నప్పుడు వివాదాలు, గొడవలకు శశికళ దూరంగా ఉన్నారని, అందువల్ల ఆమెను ముందుగానే విడుదల చేయవచ్చంటూ కర్ణాటక జైళ్ల శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివేదిక ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లో సంతోషం పొంగిపొర్లుతోంది.
*కావాలంటే నన్ను చంపండి – మమత
వెస్ట్బెంగాల్లో హత్యా రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. రాష్ట్రాన్ని గుజరాత్లా మార్చాలనుకుంటున్నదని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ ఆటలు సాగనివ్వబోనన్న ఆమె, బెంగాల్ కల్చర్ను కాపాడుకునే పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపిచ్చారు. మంగళవారం కోల్కతాలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఆమె, బెంగాల్ సంఘసంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని మంగళవారం తిరిగి ప్రతిష్టించారు. నెల రోజుల కిందట కోల్కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన గొడవల్లో విద్యాసాగర్ కాలేజీలోని విగ్రహం ధ్వంసమైన సంగతి తెలిసిందే.
*బాస్ ల కోసం కాంగ్రెస్ – భాజపా వేట.
ఒకటేమో 134 ఏండ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. ఇంకోటేమో వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారాని కొచ్చిన బీజేపీ. ఈ రెండు పార్టీలూ కొత్త బాస్ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పార్టీకి కొత్త నాయకుని అవసరమొచ్చింది. ఈ నెల 13, 14న జరగబోయే హైలెవల్ మీటింగ్లో షా వారసుడు డిసైడయ్యే చాన్సుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయానికే కట్టుబడటంతో కాంగ్రెస్కూ కొత్త లీడర్ను వెతుక్కోక తప్పడంలేదు. రాహుల్ పట్టుబడుతున్నట్టుగా నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తిని కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్గా ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
* బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు
ముగ్గురు ఏపీ మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎనిమిది జిల్లాల్లో స్టడీ సెంటర్స్‌ ఏర్పాటు చేసే దస్త్రంపై తొలిసంతకం చేశారు. ఈసందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ..మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 10శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు.
గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూశాఖమంత్రిగా నియమితులైన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలోనే కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామన్నారు. భూ సేకరణలో మార్కెట్‌ రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో భూముల రీసర్వే చేపడతామని వెల్లడించారు.
* ఫేస్‌బుక్‌లో కేశినేని నాని మరో పోస్టు సంచలనం
ఫేస్‌బుక్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మరో పోస్టు సంచలనం సృష్టిస్తోంది. తాను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవే తన నైజమని ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తెలిసినవాడినని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం లోక్‌సభలో ప్రధాని మోదీని నిలదీసినవాడినన్నారు. భయం తన రక్తంలోనే లేదని.. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదన్నారు. ఎవరెన్ని విపరీతార్థాలు తీసినా లెక్కచేయనని కేశినేని నాని పోస్టులో పేర్కొన్నారు.
* ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజా నియామకం
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కేబినేట్‌లో రోజాకు ఎలాంటి మంత్రి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా ఆమె నియామకం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
* ఇకనైనా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలి: చెవిరెడ్డి
గతంలో అప్రజాస్వామికంగా, అనైతికంగా అసెంబ్లీని నిర్వహించారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నేడు తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. దేశానికే ఆదర్శప్రాయంగా సీఎం జగన్‌ పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. సగం మంది అసెంబ్లీకి కొత్తగా వచ్చారని.. అందరినీ కలుపుకుని వెళ్తామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
*బాద్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు ‘
ముగ్గురు ఏపీ మంత్రులు ఇవాళ బాధ్యతలు
*ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
సలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ, శాసనమండలిలలో విలీన వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ విలీనం జరిగితే తమకు నోటీసులు జారీ చేసి తమ వాదనలు విన్నాక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆదేశించాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పిటిషన్‌ దాఖలు చేశారు.
* దాడులు, దౌర్జన్యాలు సహించం
తెదేపా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం, మరోవైపు తెదేపా నాయకులపై బురద జల్లడమే లక్ష్యగా వైకాపా వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అవగాహన లేకుండా వ్యవహరించడం, చెప్పుడు మాటలు వినడం, తెదేపాపై బురదజల్లడం అన్న మూడు సూత్రాల్ని వైకాపా నాయకత్వం అనుసరిస్తోందన్నారు.
* ప్రభుత్వానికి మానవత్వం లేదు
ప్రభుత్వానికి మానవత్వంతోపాటు కళ్లు, చెవులు కూడా లేవని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత నిరసన చేపడితే మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రతినిధి లేదా అధికారి ద్వారా సమస్య తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. దీక్ష విరమణ అనంతరం నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం ఆయన పరామర్శించారు.
* టీ.కాంగ్రెస్‌ తీరుపై వీహెచ్‌ అసంతృప్తి
సొంత పార్టీ నాయకత్వంపై ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ మల్లు భట్టివిక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను అడ్డం పెట్టుకుని తమ తప్పులను కప్పి పుచ్చుకోవాలని చూస్తోందన్నారు. భట్టివిక్రమార్క దీక్ష ఏఐసీసీకి పట్టదా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ పేరు చెప్పి రాష్ట్ర నేతలే దీక్ష విరమింపచేశారని మండిపడ్డారు.
* ప్రభుత్వానికి మానవత్వం లేదు
ప్రభుత్వానికి మానవత్వంతోపాటు కళ్లు, చెవులు కూడా లేవని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత నిరసన చేపడితే మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రతినిధి లేదా అధికారి ద్వారా సమస్య తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు.
* 18 మండల పరిషత్‌లకు ఎన్నికలు 15న
రాష్ట్రంలో 18 మండల పరిషత్‌లలోని కో-ఆప్డెడ్‌ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈనెల 15వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 7న మండల పరిషత్‌లకు ఎన్నికలు చేపట్టినప్పుడు.. వివిధ కారణాలతో వీటి ఎన్నికలు నిలిచిపోయాయి. తొలుతకో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక పూర్తికాకుంటే తదుపరి ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధనలు ఉండటంతో ఈ18స్థానాల్లోనూ ఎన్నికఆగిపోయింది.
* రాజ్యసభ నేతగా థావర్‌ చంద్‌ గహ్లోత్‌
రాజ్యసభ నేతగా కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ మంగళవారం నియమితులయ్యారు. భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన గహ్లోత్‌ ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా ఉన్నారు. భాజపాలోని ప్రముఖ దళిత నాయకుల్లో ఆయన ఒకరు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యసభ నేతను నియమిస్తుంది.
* ప్రధాని దృష్టికి ఆదివాసీల సమస్యలు
ఆదివాసీలకు సంబంధించి పోడు భూముల సమస్యను రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ దృష్టికి తీసుకెళతామని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కోవాలని చూస్తోందన్నారు. హద్దుల పేరుతో గోతులు తీసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
* బోధన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం: జీవన్‌రెడ్డి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. విద్యా సంబంధ విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.జీవన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. విద్యా ప్రమాణాల పెరుగుదల, కేజీ టు పీజీ వరకు ఆంగ్ల భాషలో నిర్బంధ విద్యపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు.
* సర్పంచులకు చెక్‌ పవర్‌ ఇవ్వకుంటే ఉద్యమిస్తాం: ఆర్‌.కృష్ణయ్య
రాష్ట్రంలోని 12751 మంది గ్రామ సర్పంచులకు వారం రోజుల్లో చెక్‌ పవర్‌ ఇవ్వాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
* రాజ్యసభ నేతగా థావర్‌ చంద్‌ గహ్లోత్‌
రాజ్యసభ నేతగా కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ మంగళవారం నియమితులయ్యారు. భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన గహ్లోత్‌ ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా ఉన్నారు.
* వైకాపా దాడులు ఖండించడం తప్పా?
తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు అప్రజాస్వామికంగా చేస్తున్న దాడులను ఖండించడం తప్పెలావుతుందని వైకాపా సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రశ్నించారు. ఇప్పటివరకు 100 చోట్లకు పైగా తెదేపా కార్యకర్తలపై, వారి ఇళ్లపై దాడులు చేసి భౌతికంగా గాయపరచడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
* బెంగాల్‌ అల్లర్లపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టాలి: భాజపా
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన అల్లర్లకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీదే బాధ్యత అని భాజపా సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌ మంగళవారం ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అల్లర్లు జరిగిన సందేశ్‌ఖలి ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడి ప్రజలు ఇంకా భయంతో బిక్కుబిక్కుమంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల వల్లే ఈ అల్లర్ల కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని ఆరోపించారు.
* తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
తెరాసలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ, శాసనమండలిలలో విలీన వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్‌లపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టింది. శాసనసభలో కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ విలీనం జరిగితే తమకు నోటీసులు జారీ చేసి తమ వాదనలు విన్నాక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆదేశించాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పిటిషన్‌ దాఖలు చేశారు.
* హోదా అడుక్కోవాల్సిన పనిలేదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించాలంటే కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పనిలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హోదా కోసం కేంద్రంపై పోరాడి సాధించుకోవాలని ఆయన సూచించారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికంగా ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంపై పోరాడి హోదా తీసుకొస్తామని సీఎం జగన్‌ ఎన్నికల్లో చెప్పారన్నారు. హోదా మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ గుర్తుంచుకోవాలన్నారు.
* 20న పీసీసీ కార్యవర్గ సమావేశం
20న జరగనుంది. రాష్ట్రంలో పార్టీ పునర్నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై దీనిలో చర్చించనుంది. అదే రోజు ఏపీ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమీక్షా సమావేశం జరగనుంది. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోని శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ సమావేశం ఉంటుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీలో ఏపీ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర నేతలు పాల్గొంటారని వివరించారు.
*జగన్ తో జీవీఎల్ భేటి
ముఖ్యమంత్రి జగన్ తో భాజపా రాజ్యసభ సభ్యుడు జాతెయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మంగళవారం అరగంట సేపు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమైన అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి. రాష్ట్రాభివృద్దికి కేంద్రం నుంచి పూర్తీ సహకారం అందేలా నా వంతు ప్రయత్నిస్తానని సిఎంకు తెలియజేశాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాల గురించి కూడా మా మధ్య చర్చకు వచ్చింది. లోక్ సభ ఉపసభాపతి పదవి ఎవరికీ ఇవ్వాలనేది మా పార్టీ అధిస్థానం నిర్ణయిస్తుంది ఆపదవిని వైకాపా సభ్యుడికి ఇచ్చే విషయం నాకు తెలియదు అని పేర్కొన్నారు.