Agriculture

తెలుగు రాష్ట్ర ప్రజలారా…కరువు వస్తోంది. సిద్ధంగా ఉండండి.

Monsoon Season Stuck In Kerala - Telugu States Might Be Hit With Drought And Famine

అసలే ఆలస్యంగా వచ్చాయి. ముందుకు కదలనంటూ మొండికేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలకు ఈ ఏడాది అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను రుతుపవనాల గమనాన్ని అడ్డుకుంటోంది. ఇప్పటివరకు ఇంకా కేరళ ఉత్తరభాగానికి కూడా విస్తరించలేదు. తీవ్రగాలులు రుతుపవనాల్లోని తేమను లాగేస్తున్నాయి. దీనివల్ల నైరుతి విస్తరించడంలేదు. ప్రస్తుతం భూ ఊపరితలం మీద ఉన్న గాలులు మొత్తం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ దిశగానే పయనిస్తున్నాయి. ఆ తుఫాన్‌ తీరం దాటితే కానీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదు.లకరి వానల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో నాలుగైదు రోజులు ఎదురుచూడాల్సిందే. సాధారణంగా ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు, ఇంకా కేరళ వద్దే నిలిచిపోయాయి..ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈనెల 15, 16 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.సాధారణ పరిస్థితులుంటే జూన్‌ 15 నాటికే ఇవి తెలంగాణ, మహారాష్ట్రలను దాటి గుజరాత్‌ వరకూ విస్తరించాలి. ఐదేళ్ల క్రితం అంటే 2014లో జూన్‌ 19న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత పెరిగింది. ఎండలు కూడా ఇంకా మండిపోతూనేఉన్నాయి.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు అత్యధి ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు…వడగాలులు వీస్తాయి. నిన్న రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట కూడా టెంపరేచర్ అసాధారణ స్థాయిలో ఉంటోంది. సాధారణంకన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.. గాలిలో తేమ కూడా సాధారణంకన్నా 11 శాతం తగ్గి 60కి చేరడంతో ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.అటు మండిపోతున్న ఎండలతో ఉత్తర భారతం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది..రాజస్థాన్ లో ఏకంగా 50 డిగ్రీలు దాటుతున్నాయి..యూపీ, హరియానా, పంజాబ్, ఒడిశాలోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతోంది. దేశరాజధాని ఢిల్లీలో అయితే గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా 48 డిగ్రీలు నమోదయింది.. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీరం దాటిన తర్వాత నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది..అప్పుడుదేశవ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది.