Movies

పంజాబీ కామెడీ

Sonakshi Sinha As Punjabi Girl In A New Romantic Comedy

పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే భిన్నమైన కథల్లోనూ నటిస్తోంది బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’, సల్మాన్‌ ఖాన్‌తో ‘దబాంగ్‌ 3’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్యలో ఓ వైవిధ్యమైన చిత్రం కూడా అంగీకరించింది. ఈ సినిమాకు ‘ఖాన్‌దానీ శఫాఖానా’ అనే పేరుని ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకొంది సోనాక్షి. ‘‘ఎప్పటి నుంచో సినిమా పేరు ఏంటి? అని అడుగు తున్నారు. ‘ఖాన్‌దానీ శఫాఖానా’ అని పేరు పెట్టేశాం. కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని చెబుతోంది సోనాక్షి. చిన్న పట్టణాల్లోని సెక్స్‌ క్లినిక్స్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సోనాక్షి పంజాబీ అమ్మాయిగా నటిస్తోంది. శిల్పీ దాస్‌గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేయనున్నారు.