Editorials

అమెరికా మెడలు వంచే పథకానికి భారత్ రెడీ

India to impose tariffs on lot of american goods in a trade fight

అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై అదనంగా కస్టమ్స్‌ సుంకాలను విధించాలని భారత్‌ నిర్ణయించింది. జూన్‌ 16 నుంచి నూతన సుంకాలు అమల్లోకి రానున్నాయి. వీటిలో బాదం, వాల్‌ నట్స్‌, కాయధాన్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ త్వరలో ఓ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. గతంలోనే పన్ను వేయాలని భావించినా పలు దఫాలుగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. భారత్‌ ఎగుమతి చేసే స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై గతేడాది మార్చిలో అమెరికా ప్రభుత్వం సుంకాలను విధించింది. దీనికి ప్రతిగా గతేడాది జూన్‌లోనే ఆయా వస్తువులపై పన్ను పెంచాలని భారత్‌ యోచించింది. పలు కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) కార్యక్రమం నుంచి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికాకు తెలియజేసినట్లు సమాచారం. భారత ప్రభుత్వ తాజా నిర్ణయంతో 29 ఉత్పత్తులపై అమెరికా ఎగుమతిదారులు కస్టమ్స్‌ సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందువల్ల సుమారు 217 మిలియన్‌ డాలర్ల ఆదాయం భారత్‌కు ద్వారా సమకూరనుంది.